జస్ట్ రూ.4.69 లక్షలకే టాటా సరికొత్త సంచలనం.. అన్ని వర్గాల వారికి నచ్చేలా 6 అదిరిపోయే ఆప్షన్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు నమ్మకమైన బ్రాండ్ టాటా మోటార్స్(Tata Motors). సేఫ్టీ, మైలేజ్ విషయంలో తిరుగులేని రికార్డు సృష్టించిన టాటా.. తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్ టాటా టియాగో(Tata Tiago 2026)ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్లోకి దించింది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి మునుపెన్నడూ లేని రేంజ్‌లో అగ్రెసివ్ ప్రైస్‌తో ఈ కారును లాంచ్ చేసింది.

దీంతో ఈ సెగ్మెంట్లోని మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ మొదలైంది. టాటా కంపెనీ ఈ సరికొత్త టియాగోను మొత్తం 6 విభిన్నమైన ట్రిమ్స్‌లో తీసుకొచ్చింది. కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.4.69 లక్షల నుంచే స్టార్ట్ అవుతోంది.

టాప్-ఎండ్ మోడల్ ధర రూ.8.55 లక్షల వరకు ఉంటుంది. కస్టమర్ల జేబుకు, వారి అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవడానికి వీలుగా కంపెనీ దీనిని స్మార్ట్ (Smart), ప్యూర్ (Pure), ప్యూర్+ (Pure+), ప్యూర్+ A (Pure+ A), క్రియేటివ్ (Creative), క్రియేటివ్+ (Creative+) అనే 6 వేరియంట్లలో డిజైన్ చేసింది.

Tata Tiago 2026 Facelift Launched in India at Rs 4 69 Lakh All 6 Variants and Features Explained

1. టాటా టియాగో స్మార్ట్ వేరియంట్ (ధర:రూ. 4.69 లక్షల నుంచి రూ.5.79 లక్షలు)
ఇది ఈ సిరీస్‌లోనే అందరికీ అందుబాటులో ఉండే బేస్ మోడల్. తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కల నెరవేర్చుకోవాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో మీకు 13-ఇంచుల స్ట్రాంగ్ స్టీల్ వీల్స్, స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్-లాంప్స్ లభిస్తాయి.

కంఫర్ట్ కోసం స్టీరింగ్ వీల్ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్, పార్ట్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లాస్సి ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీ, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్, 12V పవర్ సాకెట్ ఇచ్చారు. సేఫ్టీ విషయంలో టాటా అస్సలు తగ్గలేదు. బేస్ మోడల్ అయినప్పటికీ ఇందులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ యాంకర్ పాయింట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్లను స్టాండర్డ్‌గా అందించడం విశేషం.

Tata Tiago 2026 Facelift Launched in India at Rs 4 69 Lakh All 6 Variants and Features Explained

2. టాటా టియాగో ప్యూర్ వేరియంట్ (ధర: రూ.5.49 లక్షల నుంచి రూ.7.05 లక్షలు)
బేస్ మోడల్ కంటే కాస్త ఎక్కువ ఫీచర్లు, కంఫర్ట్ కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఈ ప్యూర్ వేరియంట్ బాగా సెట్ అవుతుంది. ఇందులో స్మార్ట్ మోడల్‌లోని ఫీచర్లతో పాటు అదనంగా.. వీల్ కవర్స్‌తో కూడిన 14-ఇంచుల స్టీల్ వీల్స్ వస్తాయి. సైడ్ మిర్రర్స్ (ORVMs) పైనే ఇండికేటర్లు ఉంటూ ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.

కారు వెనుక విండోకు రియర్ డిఫాగర్, ఎక్స్‌టర్నల్ యాంటెన్నా, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డ్రైవర్ డిస్‌ప్లే లభిస్తాయి. ఏఎంటీ (AMT) ఆటోమేటిక్ వేరియంట్ ఎంచుకుంటే రొటరీ గేర్ సెలెక్టర్, ప్యాడల్ షిఫ్టర్లు కూడా వస్తాయి. వీటితో పాటు డే/నైట్ ఐఆర్‌వీఎమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్లిప్ కీతో సెంట్రల్ లాకింగ్, నాలుగు పవర్ విండోస్, 2-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ క్యాబిన్ లో యూఎస్‌బీ టైప్-A, టైప్-C చార్జింగ్ పోర్టులు, ఫాలో-మీ-హోమ్ హెడ్‌లాంప్స్ లభిస్తాయి.

Tata Tiago 2026 Facelift Launched in India at Rs 4 69 Lakh All 6 Variants and Features Explained

3. టాటా టియాగో ప్యూర్+ వేరియంట్ (ధర: రూ.5.99 లక్షల నుంచి రూ.7.55 లక్షలు)
ఈ వేరియంట్ నుంచి కారు ఇంటీరియర్ లుక్ పూర్తిగా హైటెక్‌గా మారిపోతుంది. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోడల్. ప్యూర్ మోడల్ ఫీచర్లతో పాటు ఇందులో ట్రెండీ షార్క్ ఫిన్ యాంటెన్నా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 8-ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ అమర్చారు.

పాటల కోసం 4-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వస్తుంది. కో-డ్రైవర్ కోసం వానిటీ మిర్రర్, రివర్స్ తీసేటప్పుడు సేఫ్టీ కోసం రియర్‌వ్యూ కెమెరా, ముందు భాగంలో 65W పవర్‌ఫుల్ యూఎస్‌బీ టైప్-C ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సేఫ్టీని మరింత పెంచుతూ ఇందులో స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్స్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ప్రీమియం సేఫ్టీ ఆప్షన్లను జోడించారు.

4. టాటా టియాగో ప్యూర్+ A వేరియంట్ (ధర: రూ.6.49 లక్షల నుంచి రూ.7.49 లక్షలు)
ఈ మోడల్ కారుకు మరింత లగ్జరీ లుక్‌ను తీసుకొస్తుంది. టెక్నాలజీతో పాటు సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది బాగా నచ్చుతుంది. ప్యూర్+లోని ఫీచర్లతో పాటు ఇందులో ఆటోమేటిక్ హెడ్‌లాంప్స్, 14-ఇంచుల స్మార్ట్ స్టైల్డ్ స్టీల్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్-లాంప్స్, వాషర్‌తో కూడిన రియర్ వైపర్ లభిస్తాయి.

క్యాబిన్ లోపల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్ స్పేస్‌తో కూడిన ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, కీలెస్ ఎంట్రీ, వెనుక ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్ (Rear AC Vents), రైన్-సెన్సింగ్ వైపర్లు ఉంటాయి. పెట్రోల్ మోడల్ కొనే వారికి వెనుక భాగంలో పార్సెల్ ట్రే కూడా లభిస్తుంది.

5. టాటా టియాగో క్రియేటివ్ వేరియంట్ (ధర: రూ.6.99 లక్షల నుంచి రూ.8.55 లక్షలు)
ఈ మోడల్ లోపల కూర్చుంటే మీకు ప్రీమియం లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. రూ.7 లక్షల బడ్జెట్‌లో టాప్ క్లాస్ టెక్నాలజీ కావాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. ప్యూర్+ Aలోని ఫీచర్లతో పాటు ఇందులో డీఆర్‌ఎల్‌తో కూడిన సరికొత్త ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, పెట్రోల్ మోడల్ లో 15-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్ వస్తాయి.

సైడ్ మిర్రర్స్ ఆటో-ఫోల్డింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. క్యాబిన్‌లో ఏకంగా 10.25-ఇంచుల మెగా ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ స్క్రీన్‌ను అమర్చారు. డ్రైవర్ విండో కోసం వన్-టచ్ డౌన్ ఫీచర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వెనుక సీట్లకు పాకెట్స్ లభిస్తాయి. సేఫ్టీ పరంగా ఇందులో అడ్వాన్స్‌డ్ బ్లైండ్-స్పాట్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా వంటి హైటెక్ ఫీచర్లు ఉండటం విశేషం.

6. టాటా టియాగో క్రియేటివ్ ప్లస్ వేరియంట్ (ధర: రూ.7.29 లక్షల నుంచి రూ.7.85 లక్షలు)
ఇది ఈ సిరీస్‌లోనే మోస్ట్ లగ్జరీ అండ్ అల్టిమేట్ టాప్-ఎండ్ మోడల్. కారు లుక్ అల్ట్రా మోడ్రన్‌గా ఉండాలి అనుకునే వారి కోసం దీనిని తయారు చేశారు. క్రియేటివ్ ప్లస్ మోడల్ ఫీచర్లన్నింటితో పాటు.. రోడ్డుపై కారు ప్రత్యేకంగా కనిపించేలా డ్యూయల్-టోన్ ఫినిషింగ్ రూఫ్, పవర్‌ఫుల్ ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్‌ను అందించారు.

క్యాబిన్ లోపల వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 65W యూఎస్‌బీ టైప్-C ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, ఫోన్ ద్వారా కారును కంట్రోల్ చేసే అధునాతన కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అమర్చారు.

Article Published On: Friday, May 29, 2026, 16:40 [IST]
English summary
Tata tiago 2026 facelift launched in india at rs 4 69 lakh all 6 variants and features explained
Read more on: #tata motors #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+