మధ్యతరగతి ప్రజల బడ్జెట్ ధరలో 28 కిమీ మైలేజ్‌..టాటా ప్రసాదించిన వరం ఈ కారు

మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారం తగ్గించడంతో పాటు, సిటీ ట్రాఫిక్‎లో డ్రైవింగ్ ఈజీ చేసే విధంగా ఓ అద్భుతమైన కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది అదే టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్(Tata Tiago CNG Automatic). మన దేశంలో అత్యంత చౌకైన, సీఎన్జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‎బాక్స్‌తో వచ్చినటువంటి మొదటి ఇదే కావడం విశేషం.

టాటా టియాగో తన సెగ్మెంట్‌లో దీంతో ఓ విప్లవాన్నే సృష్టించిందని చెప్పాలి. సాధారణంగా సీఎన్జీ కార్లు అంటే కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే వస్తాయనే సంప్రదాయాన్ని చెరిపేస్తూ, టాటా కంపెనీ ఏఎంటీ(AMT) టెక్నాలజీని ఇందులో ఇంట్రడ్యూస్ చేసింది. దీని బేసిక్ మోడల్ ధర కూడా కేవలం రూ.7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) కావడం విశేషం.

Tata Tiago CNG Automatic Price Mileage Features

బాగా రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చే అవసరం, ఇబ్బంది పడేవారికి, అలాగే తక్కువ ఇంధన ఖర్చుతో రోజూ ఆఫీసులకు వెళ్లాలని అనుకునే వాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్. ఇక ఈ కారు ఇంజిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ కారులో 1.2 లీటర్ల రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఇది సిఎన్‌జి మోడ్‌లో 73 bhp పవర్, 95 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఉన్న 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా వర్క్ చేస్తుంది. టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్ వేరియంట్ ఏకంగా కిలోకు 28.06కిమీ మైలేజీని అందిస్తుందని ఏఆర్ఏఐ (ARAI) కన్ఫాం చేసింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీతో ప్రయాణించడం వల్ల వాహన యజమానుల జేబుకు 50 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.

Tata Tiago CNG Automatic Price Mileage Features

ఇక ఫీచర్ల పరంగా చూస్తే కూడా ఈ కారు ఎక్కడా తగ్గలేదు. కారు లోపల పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మన్ బ్రాండ్ కి చెందిన 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో అందించారు.

అంతేకాకుండా కూల్డ్ గ్లోవ్ బాక్స్, వాయిస్ కమాండ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. అంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కారు కండీషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

Tata Tiago CNG Automatic Price Mileage Features

టాటా కారు అంటేనే సేఫ్టీకి మారుపేరు. టియాగో కారు గ్లోబల్ ఎన్‎క్యాప్(Global NCAP) క్రాష్ టెస్టులో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్(ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

అతి తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ఫెసిలిటీ, అదిరిపోయే మైలేజ్, స్ట్రాంగ్ బాడీ కావాలనుకునే వారికి టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్ ఒక కంప్లీట్ ప్యాకేజీ. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని, తిరుగులేని మైలేజీని, టాటా భరోసాని ఇచ్చే ఈ టియాగో సిఎన్‌జి ఆటోమేటిక్.. మధ్యతరగతి వారి కలల కారుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సిటీ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి చెబుతూ, పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ.

Article Published On: Thursday, January 22, 2026, 11:50 [IST]
English summary
Tata tiago cng automatic price mileage features
Read more on: #tata motors #cng #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+