రూ.5లక్షలకే 300 కిలోమీటర్ల రేంజ్.. ఇదే కాకుండా ఇండియన్ మార్కెట్‎ను షేక్ చేసేందుకు టాటా నయా ప్లాన్

భారతదేశ మధ్యతరగతి ప్రజల కలల కారుగా పేరుగాంచిన టాటా న్యూసెన్స్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును అందించాలనే లక్ష్యంతో వచ్చిన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా నిలిచింది. అయితే, పోటీ పెరుగుతున్న తరుణంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు టాటా మోటార్స్ ఈ కారులో భారీ మార్పులు చేస్తోంది. సరికొత్త లుక్, హైటెక్ ఫీచర్లు, ఊహించని ధరతో టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Facelift) త్వరలోనే భారత రహదారులపై గర్జించనుంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా, బయటకు వస్తున్న లీకులు కార్ల ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఈ కొత్త టియాగో ఇవి ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా మనల్ని ఆకట్టుకునే అంశం దాని ఫీచర్లు. సాధారణంగా ఖరీదైన కార్లలో మాత్రమే కనిపించే 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి సదుపాయాలను ఈ చిన్న కారులో కూడా టాటా జొప్పించబోతోంది. అంతేకాకుండా, లోపలి భాగంలో పెద్ద సైజు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, మెరుగైన సౌండ్ సిస్టమ్ ఉండబోతున్నాయి.

Tata Tiago EV Facelift 2026 300km Range Sunroof 360 Camera at a Shocking Price

సేఫ్టీ విషయంలో రాజీ పడని టాటా, ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హెచ్‌డి రియర్ వ్యూ కెమెరా వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను కూడా అందిస్తోంది. డిజైన్ పరంగా కొత్త ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, రీ-డిజైన్ చేసిన బంపర్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఇక అందరూ ఎదురుచూస్తున్న రేంజ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్ల కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఈ కొత్త మోడల్‌లో ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు దాదాపు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.

Tata Tiago EV Facelift 2026 300km Range Sunroof 360 Camera at a Shocking Price

ప్రస్తుతం ఉన్న టాటా టియాగో ఈవీ 7.99 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో ఉండగా, కొత్త మోడల్ ధర విషయంలో టాటా ఒక భారీ స్కెచ్ వేసింది. ఇటీవల విడుదలైన టాటా పంచ్ ఇవి ఫేస్‌లిఫ్ట్ ధరలను తగ్గించినట్టే, టియాగో ఇవి ధరను కూడా తగ్గించే యోచనలో కంపెనీ ఉంది.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, టాటా మోటార్స్ ఈ కారు కోసం Baas (Battery as a Service) పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ పద్ధతిలో కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన పని లేదు. దీనివల్ల కారు ధర భారీగా తగ్గి, కేవలం 5 లక్షల రూపాయలకే మీకు టాటా టియాగో ఈవీ సొంతమయ్యే అవకాశం ఉంది.

Tata Tiago EV Facelift 2026 300km Range Sunroof 360 Camera at a Shocking Price

అయితే, మీరు కారును నడిపిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2 నుండి 2.50 రూపాయల వరకు బ్యాటరీ అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుట్ అయితే, సాధారణ పెట్రోల్ కార్ల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారును కొనే అవకాశం మధ్యతరగతి ప్రజలకు దక్కుతుంది. మొత్తానికి టాటా వేస్తున్న ఈ ఎత్తుగడతో భారత ఆటోమొబైల్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Saturday, February 28, 2026, 7:33 [IST]
English summary
Tata tiago ev facelift 2026 300km range sunroof 360 camera at a shocking price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+