ప్రభుత్వ ఉద్యోగులకు భారీ డిస్కౌంట్లు! టాటా, మహీంద్రా, ఓలా, ఏథర్.. ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లపై తగ్గింపు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజువారీ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనలో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేసే లక్షణాలు, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇవి కలిసి ఈవీలకు మంచి డిమాండ్‌ను తీసుకువస్తున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. సబ్సిడీలు, ట్యాక్స్ రాయితీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అనేక ప్రయోజనాలను ప్రకటిస్తూ ప్రజలను ఈవీల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేసింది.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రముఖ వాహన తయారీ సంస్థలు అందించే ఎలక్ట్రిక్ వాహనాలపై 10 నుండి 20 శాతం వరకు రాయితీలు అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా, మొత్తం మార్కెట్‌కు కూడా ఒక పాజిటివ్ సంకేతంగా మారింది.

Telangana Ev Discounts For Govt Employees Tata Mahindra Ola Ather Offers

ఈ ప్రోత్సాహకాలు అమల్లోకి రావడానికి ముఖ్య కారణం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీసుకున్న చొరవ. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీలు, ప్రత్యేక ఆఫర్లను అందించాలని కోరుతూ ఆయన వాహన తయారీ కంపెనీలకు లేఖలు రాశారు. ఈ విజ్ఞప్తికి కంపెనీలు సానుకూలంగా స్పందిస్తూ, తమ వాహనాలపై రాయితీలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. వాహన మోడల్‌ను బట్టి ఈ రాయితీలు మారుతూ ఉండే అవకాశం ఉంది.

కొన్ని మోడళ్లపై 10 శాతం వరకు, మరికొన్నింటిపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను ప్రతి నెలలో పరిమిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే వర్తింపజేస్తారని తెలుస్తోంది. అంటే, ముందుగా బుక్ చేసుకునే వారికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం, తయారీదారుల మధ్య సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచనుంది.

Telangana Ev Discounts For Govt Employees Tata Mahindra Ola Ather Offers

మహీంద్రా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రావ్టన్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు అందించడానికి ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. ఒక ప్రముఖ మీడియాలో వచ్చిన కథణం ప్రకారం, టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్లపై మంచి డిస్కౌంట్లు ఇస్తోంది. టియాగో ఈవీపై సుమారు 10% తగ్గింపు, పంచ్ ఈవీపై 20% వరకు రాయితీ ఇవ్వనుంది.

ముఖ్యంగా పంచ్ వేరియంట్‌లపై రూ.2.75 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. కర్వ్ ఈవీ మోడళ్లపై కూడా 20% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అయితే ఈ ఆఫర్ నెలకు కేవలం 50 కార్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక మహీంద్రా XUV400 EL Pro మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.49 లక్షలు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులకు దీన్ని రూ.13.99 లక్షలకే అందించనుంది.

Telangana Ev Discounts For Govt Employees Tata Mahindra Ola Ather Offers

అంటే దాదాపు రూ.3.5 లక్షల వరకు తగ్గింపు. అదే సిరీస్‌లోని ఇతర వేరియంట్‌లపై కూడా రూ.2.5 లక్షలకుపైగా డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అదనంగా BE 6 ఈవీపై రూ.1.20 లక్షలు, XEV 9e మోడల్‌పై రూ.2.05 లక్షల వరకు తగ్గింపు ప్రకటించారు. కొన్ని మోడళ్ల డెలివరీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని కూడా తెలిపారు. టూవీలర్ సెగ్మెంట్‌లో కూడా ఆఫర్లు తక్కువేమీ కావు.

Ola Electric తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై 20% వరకు రాయితీ ఇస్తోంది. S1 X వేరియంట్‌పై రూ.17,600 నుంచి రూ.27,539 వరకు, S1 Pro మోడల్‌పై రూ.29,000 నుంచి రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే Roadster వేరియంట్‌పై రూ.31,000 నుంచి రూ.63,000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అదే విధంగా ఏథర్ ఎనర్జీ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై సుమారు 11% వరకు రాయితీ ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Monday, March 30, 2026, 16:45 [IST]
English summary
Telangana ev discounts for govt employees tata mahindra ola ather offers
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+