ఎర్టిగా కంటే రూ.3లక్షలు తక్కువకే నిస్సాన్ 7 సీటర్ కారు.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే మామ
ఫ్యామిలీ అంతా కలిసి ఒకే కారులో వెళ్లాలనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను నిజం చేసేలా 7-సీటర్ కార్ల (MPV) విభాగంలో ఇప్పటివరకు మారుతి సుజుకి ఎర్టిగా రారాజుగా ఏలుతోంది. అయితే ఇప్పుడు ఆ రాజ్యానికి సవాల్ విసురుతూ జపనీస్ దిగ్గజం నిస్సాన్ తన సరికొత్త అస్త్రం నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను రంగంలోకి దింపింది. ఫిబ్రవరి 2026లో విడుదలైన ఈ కారు, ఎర్టిగా కంటే దాదాపు రూ.3.15 లక్షలకు పైగా తక్కువ ధరకే లభిస్తుండటంతో వాహన మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి.ఎంపీవీ సెగ్మెంట్‌లో దిగ్గజమైన ఎర్టిగాను ఈ గ్రావైట్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.
ధరలో భారీ వ్యత్యాసం
నిస్సాన్ గ్రావైట్ అందరినీ ఆశ్చర్యపరిచే ధరతో మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అంటే ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు కొనే బడ్జెట్‌లోనే మీకు 7-సీటర్ కారు వచ్చేస్తుంది. మరోవైపు మారుతి ఎర్టిగా ధర రూ.8.80 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎర్టిగా బేస్ మోడల్ ధరతో పోలిస్తే గ్రేవైట్ ఏకంగా రూ.3.15 లక్షలు తక్కువ. గ్రావైట్ టాప్ ఎండ్ మోడల్ (రూ. 8.93 లక్షలు) కొన్నా కూడా ఎర్టిగా ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరకే సమానంగా ఉండటం నిస్సాన్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

ఇంజిన్, పర్ఫార్మెన్స్
సామర్థ్యం విషయంలో ఎర్టిగా కాస్త ముందుంది.
మారుతి ఎర్టిగా: ఇందులో 1.5 లీటర్ K15C ఇంజిన్ ఉంది. ఇది 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఇస్తుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని, లగేజీ లోడ్ చేసినా హైవేల మీద ఇది చాలా పవర్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.
నిస్సాన్ గ్రేవైట్: ఇందులో 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. సిటీలో తిరగడానికి ఇది సరిపోతుంది కానీ, ఫుల్ లోడ్‌తో ఘాట్ రోడ్లు లేదా హైవేల మీద ఎర్టిగా అంత వేగంగా వెళ్లలేకపోవచ్చు.

మైలేజ్, సీఎన్‌జీ ఆప్షన్
మైలేజ్ విషయంలో రెండూ నువ్వా-నేనా అన్నట్లు ఉన్నాయి. ఎర్టిగా పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 కి.మీ ఇస్తుంటే, గ్రేవైట్ 19.3 కి.మీ వరకు ఇస్తుంది. అయితే ఎర్టిగాలో ఉన్న అతిపెద్ద బలం సీఎన్‌జీ (CNG). సీఎన్‌జీ మోడల్ కేజీకి 26.11 కి.మీ మైలేజ్ ఇస్తుంది. నిస్సాన్ గ్రావైట్లో ప్రస్తుతం సీఎన్‌జీ అందుబాటులో లేదు కానీ, త్వరలోనే డ్యూయల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్‌తో లాంచ్ చేసే అవకాశముంది.
ఫీచర్లు, సౌకర్యాలు
ధర తక్కువైనా ఫీచర్ల విషయంలో నిస్సాన్ ఏమాత్రం తగ్గలేదు.
గ్రావైట్: ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని 7-సీట్ల కాన్ఫిగరేషన్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
ఎర్టిగా: ఎర్టిగాలో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని క్యాబిన్ గ్రేవైట్ కంటే కాస్త వెడల్పుగా ఉండి, ఎక్కువ స్పేస్ ఇస్తుంది.

ఏది కొనాలి?
మీరు మొదటిసారి ఒక 7-సీటర్ కారును అత్యంత తక్కువ బడ్జెట్‌లో సొంతం చేసుకోవాలి అనుకుంటే, నిస్సాన్ గ్రావైట్ మీకు బెస్ట్ ఛాయిస్. మరీ ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు, చిన్న చిన్న ఫ్యామిలీ ట్రిప్స్ కు ఇది చాలా పొదుపుగా ఉంటుంది. కానీ, మీకు పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి, కారు రీసేల్ వాల్యూ బాగుండాలి. దేశంలో ఎక్కడైనా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండాలి అనుకుంటే మాత్రం మారుతి ఎర్టిగానే రారాజు.


Click it and Unblock the Notifications








