ADAS ఫీచర్లతో తక్కువ ధరలో హైటెక్ సేఫ్టీ కార్లు.. కుటుంబ భద్రతే లక్ష్యం
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు స్పష్టంగా మారుతున్నాయి. ఒకప్పుడు కారు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఆకర్షణీయమైన ఫీచర్లు ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కస్టమర్లు ముందుగా అడుగుతున్న ప్రశ్న ఈ కారు ఎంత సురక్షితం?. ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలుదారులు కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. కారు బాడీ నిర్మాణ నాణ్యత, క్రాష్ టెస్ట్ రేటింగ్స్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి అంశాలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ADAS (Advanced Driver Assistance Systems) సూట్ కలిగిన కార్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ADAS ఫీచర్లను కలిగిన కార్లను ఒకసారి చూద్దాం.
Tata Nexon: టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV అయిన టాటా నెక్సాన్ లెవల్-2.0 ADAS సూట్‌తో అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటికే భద్రత విషయంలో మంచి పేరున్న నెక్సాన్, ఇప్పుడు మరింత ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీలతో ముందుకు వచ్చింది. ఈ లెవల్-2.0 ADAS సూట్ ఫియర్‌లెస్+ PS పెట్రోల్ DCA వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ.12.16 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు డ్రైవర్‌కు అదనపు భద్రతను అందిస్తాయి. ఇప్పటికే గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన తొలి భారతీయ కారుగా నెక్సాన్ గుర్తింపు పొందింది. ఇప్పుడు ADAS వంటి అధునాతన భద్రతా వ్యవస్థలు జోడించడంతో, ఈ SUV మరింత సురక్షితమైన, టెక్నాలజీ పరంగా సమగ్ర ఎంపికగా మారింది.
Honda City: హోండా సిటి దాదాపు 25 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ప్రముఖ సెడాన్. ప్రారంభమైనప్పటి నుండి విశ్వసనీయత, కంఫర్ట్, ప్రీమియం ఫీలింగ్ కారణంగా ఇది పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించింది. కాలానుగుణంగా టెక్నాలజీ, డిజైన్ మార్పులు స్వీకరించిన ఈ కారు ఇప్పుడు భద్రతా ప్రమాణాల్లో కూడా ముందంజలో ఉంది. ప్రస్తుతం బేస్ SV వేరియంట్‌ను మినహాయిస్తే, మిగతా అన్ని ట్రిమ్‌లలో లెవల్-2 ADAS సూట్ అందుబాటులో ఉంది.

ఈ సిస్టమ్‌లో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఆధునిక డ్రైవర్ సహాయక ఫీచర్లు ఉంటాయి. ఇవి హైవే డ్రైవింగ్ సమయంలో అదనపు భద్రత, నమ్మకాన్ని అందిస్తాయి. ADAS లెవల్-2 ఫీచర్లతో కూడిన హోండా సిటీ ట్రిమ్‌లు సుమారు రూ. 12.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర నుండి ప్రారంభమవుతాయి.
Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్‌ఓ ప్రస్తుతం దేశంలో అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఆధునిక డిజైన్, టెక్నాలజీతో పాటు భద్రతా ప్రమాణాల విషయంలో కూడా ఈ మోడల్ బలమైన స్థానం సంపాదించింది. XUV 3XOలో బ్రాండ్ లెవల్-2 ADAS సూట్‌ను AX5L, AX7L ట్రిమ్‌లలో అందిస్తోంది. లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉన్నాయి.

అలాగే, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చుతాయి. హైవే ప్రయాణాల్లో ఈ సిస్టమ్ డ్రైవర్‌కు అదనపు సహకారం అందిస్తుంది. భద్రతా ప్రమాణాల విషయానికి వస్తే, ఈ SUVకి భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ధరల విషయానికి వస్తే, AX5L వేరియంట్ సుమారు రూ. 11.60 లక్షలు (ఎక్స్-షోరూమ్), AX7L వేరియంట్ రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








