ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1200 కిమీ.. ఈ దీపావళికి ఏకంగా 3 గేమ్ ఛేంజింగ్ కార్లు దిగుతున్నాయ్
భారతదేశంలో కార్ లవర్లకు, ముఖ్యంగా భారీ SUV మోడళ్లను ఇష్టపడేవారికి ఇదో సూపర్ గుడ్ న్యూస్. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సరికొత్త విప్లవం నడుస్తోంది. కంపెనీలు కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజన్లకే పరిమితం కాకుండా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి.
రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లను భారీగా డిమాండ్ పెరుగనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాంగ్ జర్నీలకు వెళ్లేటప్పుడు మైలేజ్ లేదా ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకుండా, ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే టాప్ 3 ప్రీమియం ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలు త్వరలోనే భారత రోడ్ల మీద పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

జూలై 16నే జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కొత్త సంచలనం
ఈ సరికొత్త హైబ్రిడ్ కార్ రేసులో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా అందరికంటే ముందు వరుసలో నిలిచింది. ఈ సంస్థ జూలై 16వ తేదీన దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని అధికారికంగా లాంచ్ చేయబోతోంది.
ఈ సరికొత్త మోడల్ చైనా మార్కెట్లో ఇప్పటికే విక్రయించబడుతున్న ప్రముఖ ఊలింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా రూపుదిద్దుకున్నట్లు సమాచారం. ఈ కారు గ్లోబల్ వేరియంట్ తరహాలోనే భారతీయ మోడల్‌లో కూడా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, 20.5kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు.
ఈ ఎంజీ హైబ్రిడ్ కారు స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పెట్రోల్, బ్యాటరీ రెండింటినీ కలిపి వాడితే (కంబైన్డ్ రేంజ్) ఏకంగా 1100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు ఇంజన్ 197bhp పవర్‌ను, 230Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని రకాల ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న ఈ ఎస్‌యూవీ ధర భారత మార్కెట్లో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

దీపావళి ధమాకాగా వస్తున్న జెటూర్ T2
జేఎస్‌డబ్ల్యూ (JSW) మోటార్స్ నుంచి రాబోతున్న మరో అద్భుతమైన కారు జెటూర్ T2 i-DM. ఈ పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని రాబోయే దీపావళి పండుగ సీజన్ నాటికి భారతదేశంలో లాంచ్ చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.
ఈ మోడల్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్, పెద్దదైన 26.7kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ పవర్‌ఫుల్ సెటప్ ద్వారా కారుకు ఏకంగా 380bhp శక్తి, 691Nm టార్క్ లభిస్తుంది. భారీ పవర్ ఇష్టపడేవారికి ఈ కారు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
ఈ జెటూర్ T2 ఎస్‌యూవీ కేవలం బ్యాటరీ (ఎలక్ట్రిక్ మోడ్) పైనే 100 నుంచి 139 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. పెట్రోల్ ఇంజన్ సాయంతో కలిపి దీని మొత్తం డ్రైవింగ్ రేంజ్ 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ లగ్జరీ కారును మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్మిస్తున్న జేఎస్‌డబ్ల్యూ సరికొత్త గ్రీన్-ఫీల్డ్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ కారు పొడవు 4785 మిమీ, వెడల్పు 2006 మిమీ, ఎత్తు 1875 మిమీ, వీల్‌బేస్ 2800 మిమీగా ఉండనుంది. దీని ధర మార్కెట్లో రూ.40 లక్షల నుంచి రూ.50లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
మార్కెట్లోకి దిగుతున్న చైనా దిగ్గజం BYD సీల్ U
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చైనా దిగ్గజ సంస్థ బివైడి, భారత మార్కెట్లోకి తన సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ BYD సీల్ U DM-i మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కారు భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. దీనికి అదనంగా BYD సంస్థకు చెందిన పేటెంటెడ్ బ్లేడ్ టెక్నాలజీ కలిగిన 18.3kWh బ్యాటరీని అమర్చారు.
ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీ వల్ల ఈ కారు 323bhp కంబైన్డ్ పవర్‌ను, 550Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ లిస్ట్‌లో ఉన్న అన్ని కార్ల కంటే ఈ BYD సీల్ U ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేసి, ట్యాంక్ నింపితే చాలు.. నిరంతరాయంగా 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది.
ప్రీమియం ఫీచర్లు, లగ్జరీ క్యాబిన్‌తో రానున్న ఈ మోడల్ ధర రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. లాంగ్ జర్నీలు ఎక్కువగా చేసే వారికి, లగ్జరీతో పాటు బెస్ట్ మైలేజ్ కావాలనుకునే వారికి ఈ మూడు కార్లు చక్కని ప్రత్యామ్నాయాలుగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications