రూ.5 లక్షల లోపు దొరికే కార్లు.. 30 కి.మీ మైలేజ్.. మార్కెట్లో ఫుల్ డిమాండ్ బడ్జెట్ కార్లు!
మంచి మైలేజ్, తక్కువ మెయింటనెన్స్ ఖర్చులు, ఆధునిక ఫీచర్లతో కూడిన తక్కువ ధర కార్ల కోసం చూస్తున్న వారు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మొదటి కారు కొనాలనుకునే వారు లేదా మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్‌కు తగ్గ కారు కావాలనుకునే వారికి ఈ సెగ్మెంట్ చాలా కీలకం. ఇలాంటి వారికి టాటా, మారుతి సుజుకి, రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ బడ్జెట్ కార్లతో మంచి ఎంపికలను అందిస్తున్నాయి. ఇవి నగర ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌లకు కూడా అనువుగా ఉంటాయి. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా డిజైన్ చేయబడిన ఈ కార్లు, మెరుగైన మైలేజ్‌తో పాటు భద్రత, కంఫర్ట్‌ను కూడా అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 లక్షల లోపు లభిస్తూ మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని కార్లను ఈ కథనంలో చూద్దాం.
Maruti Suzuki WagonR: వ్యాగన్ ఆర్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా లక్షలాది కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ కారు, తక్కువ ధరలో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు అందించే కారుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ కారు రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తోంది, ఇది మధ్యతరగతి కుటుంబాలు, మొదటి కారు కొనుగోలుదారులకు బెస్ట్.

వ్యాగన్ ఆర్‌లో లభించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మంచి పనితీరు, ఇంధన సామర్థ్యానికి పేరుగాంచింది. ముఖ్యంగా AMT ఆటోమేటిక్ వేరియంట్ నగర ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌కు బెస్ట్. ఇది 22.34 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. వ్యాగన్ ఆర్‌లో లభించే CNG వెర్షన్ కిలో గ్యాస్‌కు దాదాపు 34 km వరకు మైలేజీ ఇవ్వడం విశేషం, దీంతో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
Maruti Alto K10: మారుతి ఆల్టో K10 భారతదేశంలో అత్యంత సరసమైన, ఎక్కువగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.69 లక్షల నుండి ప్రారంభమవడం వల్ల, తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి ఇది మొదటి ఎంపికగా మారింది. తక్కువ ధర మాత్రమే కాకుండా, మంచి స్థలం, విశ్వసనీయ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు అందించడం ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఆల్టో K10లో లభించే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మంచి పనితీరుతో పాటు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. ఈ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు సుమారు 24.5 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు, ఇది రోజువారీ నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మారుతి ఈ కారును ఫ్యాక్టరీ-ఫిట్ CNG ఆప్షన్‌తో కూడా అందిస్తోంది. CNG వేరియంట్ ఒక కిలో గ్యాస్‌కు దాదాపు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వడం విశేషం.
Renault KWID: రెనాల్ట్ క్విడ్ భారతదేశంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 4.29 లక్షలుగా ఉండటం వల్ల, తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే క్విడ్‌కు చిన్న SUV తరహా లుక్ ఉండటం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Tata Tiago: టాటా టియాగో భారతదేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో భద్రత, ఫీచర్లు, విలువ అనే మూడు అంశాలను సమతుల్యంగా అందించే కారుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. టాటా మోటార్స్ నమ్మకంతో రూపొందించిన ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్‌లో లీటరుకు 20 కి.మీ, సిఎన్‌జిలో 27 కి.మీ/కి.మీ మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








