ఈ కారు ఎక్కితే స్పీడ్ బ్రేకర్ల భయం ఉండదు.. అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న టాప్ 4 సెడాన్ కార్లు ఇవే
భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ (SUV) కార్లకు భారీ క్రేజ్ నడుస్తున్నప్పటికీ, సెడాన్ (Sedan) కార్లను ఇష్టపడే వారి సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే లగ్జరీ కంఫర్ట్, హై-స్పీడు స్టెబిలిటీ, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరే ఇతర కార్లలోనూ లభించవు. అయితే, సెడాన్ కార్లను కొనేటప్పుడు చాలామంది వినియోగదారులను భయపెట్టే ఒకే ఒక్క ప్రధాన సమస్య గ్రౌండ్ క్లియరెన్స్ (Ground Clearance). మన దేశంలో ఉండే ఎత్తుపల్లాలు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద కారు కింద భాగం రోడ్డుకు తగులుతుందేమోనని వాహనదారులు తెగ టెన్షన్ పడిపోతుంటారు.
కానీ, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్‌తో లభిస్తున్న టాప్ 4 సెడాన్ కార్ల వివరాలను ఇక్కడ చూద్దాం. ఈ లిస్ట్‌లో ఫాక్స్‌వ్యాగన్, హోండా, హ్యుందాయ్, మారుతి సుజుకి వంటి ప్రముఖ కంపెనీల కార్లు ముందంజలో ఉన్నాయి.

1. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus)
ఈ బడ్జెట్ సెగ్మెంట్ సెడాన్ కార్లలో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ కారు ఏకంగా 179 మీమీ భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన హైట్ కారణంగా రోడ్లపై ఉండే ఎలాంటి సైజు స్పీడ్ బ్రేకర్లనైనా, గుంతలనైనా ఈ కారు చాలా సులభంగా దాటేస్తుంది. కారు కింద భాగం రోడ్డుకు స్క్రాప్ అవుతుందనే భయమే ఉండదు.
చాలా పెద్ద సైజు బ్రేకర్ల వద్ద మాత్రమే దీనికి కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. భారత మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ వర్టస్ ధరలు రూ. 10.5 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కార్ లవర్స్ కోసం కంపెనీ ఈ ఏడాది చివర్లో వర్టస్ ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.

2. హోండా అమేజ్ (Honda Amaze)
మధ్యతరగతి ఆటోమొబైల్ ప్రియులకు ఎంతో ఇష్టమైన కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో హోండా అమేజ్ అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ థర్డ్ జనరేషన్ అమేజ్ కారు 172 మీమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దీని వీల్‌బేస్ (2,470 మీమీ) తన తోటి కాంపాక్ట్ సెడాన్ కార్ల కంటే దాదాపు 20 మీమీ ఎక్కువగా ఉంటుంది.
ఈ కారు వీల్‌బేస్ పొడవుగా ఉన్నప్పటికీ, దీని అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా సిటీ రోడ్లపై మరియు సెమీ-అర్బన్ ఏరియాల్లోని స్పీడ్ బ్రేకర్లపై కారు కింద భాగం అస్సలు తగలకుండా ప్రయాణిస్తుంది. మార్కెట్లో హోండా అమేజ్ ధరలు కేవలం రూ. 7.51 లక్షల నుంచి ప్రారంభమై రూ. 10 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

3. హ్యందాయ్ వెర్నా (Hyundai Verna)
సరికొత్త ఫ్యూచరిస్టిక్ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో దూసుకుపోతున్న హ్యుందాయ్ వెర్నా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఇటీవల ఈ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, దీని గ్రౌండ్ క్లియరెన్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. వెర్నా కారు 165 మీమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
ఇది మారుతి డిజైర్ కంటే కేవలం 2 మీమీ మాత్రమే ఎక్కువ. హ్యుందాయ్ వెర్నా కారు వీల్‌బేస్ కాస్త పొడవుగా ఉన్నప్పటికీ, ఇండియన్ రోడ్లపై ఉండే సాధారణ స్పీడ్ బ్రేకర్లను ఇది చాలా ఈజీగా అధిగమిస్తుంది. చాలా విపరీతమైన ఎత్తు ఉన్న రోడ్డు హంప్స్ వద్ద మాత్రమే డ్రైవర్ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం వెర్నా ధరలు రూ. 10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల వరకు ఉన్నాయి.

4. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఫ్యామిలీ సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ కారు 163 మీమీ డిసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేస్తోంది. మన దేశంలోని సాధారణ రోడ్డు పరిస్థితులకు ఈ హైట్ చాలా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది.
డిజైర్ కారు వీల్‌బేస్ సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల, ఇది రోడ్లపై ఉండే రొటీన్ స్పీడ్ బ్రేకర్లను చాలా ఈజీగా దాటేస్తుంది. అయితే, కారులో ఐదుగురు ప్రయాణికులు కూర్చున్నప్పుడు, పెద్ద సైజు హంప్స్ వచ్చినప్పుడు మాత్రం కారు కింద భాగం స్క్రాప్ అవ్వకుండా కాస్త నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. దీని ధరలు రూ. 6.26 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.31 లక్షల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications