పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఛాయిస్.. అదిరిపోయే మైలేజీ, తక్కువ ధరలో దొరికే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక పెద్ద కల. అది కూడా ఉమ్మడి కుటుంబం లేదా ఐదుగురు కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు సాధారణ ఐదు సీట్ల కారు సరిపోదు. అందుకే మార్కెట్లో ప్రస్తుతం 7 సీటర్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది.

ఒకప్పుడు ఏడు సీట్ల కారు అంటే బడ్జెట్ రూ.15 లక్షలు దాటేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం రూ.10 లక్షల లోపు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ ఫ్యామిలీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, పెద్ద కారు కావాలనుకుంటే.. మీకోసం మార్కెట్లో ఉన్న టాప్ 5 ఆప్షన్లు ఇవే

Top 5 Best 7 Seater Cars Under Rs 10 Lakh for Large Families in India

1. నిస్సాన్ గ్రావిట్ (Nissan Gravite):
నిస్సాన్ నుంచి వచ్చిన ఈ సరికొత్త 7 సీటర్ కారు ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) దగ్గర మొదలవుతుంది. నిజానికి ఇది రెనాల్ట్ ట్రైబర్‌పై ఆధారపడి తయారైన మోడల్ అయినప్పటికీ, ఇందులో నిస్సాన్ తనదైన శైలిలో ప్రీమియం ఫీచర్లను జోడించింది.

వైర్‌లెస్ ఛార్జర్, అంబియంట్ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు దీని సొంతం. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, ఏడుగురు కూర్చునే వీలుండటం దీని ప్రత్యేకత. సిటీ రోడ్లపై హాయిగా తిరగాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

Top 5 Best 7 Seater Cars Under Rs 10 Lakh for Large Families in India

2. మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Ertiga):
మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ కారు ఏదంటే టక్కున వినిపించే పేరు మారుతి ఎర్టిగా. దీని ప్రారంభ ధర రూ.8.80 లక్షలు. ఇందులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మంచి పవర్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో సిఎన్‌జి (CNG) ఆప్షన్ ఉండటం ప్లస్ పాయింట్.

కేజీ సిఎన్‌జికి ఇది ఏకంగా 26 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇస్తుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు దీని సీటింగ్ కంఫర్ట్ అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా మారుతికి ఉన్న సర్వీస్ నెట్‌వర్క్ వల్ల మెయింటెనెన్స్ టెన్షన్ ఉండదు.

Top 5 Best 7 Seater Cars Under Rs 10 Lakh for Large Families in India

3. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
తక్కువ బడ్జెట్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించిన కారు రెనాల్ట్ ట్రైబర్. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులోని విశేషం ఏంటంటే, దీని థర్డ్ రో సీట్లను పూర్తిగా తొలగించవచ్చు.

సామాన్లు ఎక్కువగా ఉన్నప్పుడు సీట్లు తీసేసి బూట్ స్పేస్ పెంచుకోవచ్చు, ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు సీట్లు పెట్టేసుకోవచ్చు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా చాలా కలిసొచ్చే కారు.

Top 5 Best 7 Seater Cars Under Rs 10 Lakh for Large Families in India

4. మహీంద్రా బొలేరో(Mahindra Bolero):
గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్లపై తిరగడానికి మహీంద్రా బొలేరోకు మించిన కారు మరొకటి లేదు. దీని ధర రూ. 8 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది విలాసవంతమైన ఫీచర్ల కంటే ఎక్కువగా కారు మన్నికకు, మొండితనానికి పేరుగాంచింది.

ఎంతటి గుంతల రోడ్డులోనైనా ఇది దర్జాగా వెళ్తుంది. దీని రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లోడ్ ఎక్కువ వేసినా, ఎక్కడా తగ్గకుండా దూసుకుపోవడం దీని నైజం.

Top 5 Best 7 Seater Cars Under Rs 10 Lakh for Large Families in India

5. మహీంద్రా బొలేరో నియో (Bolero Neo):
క్లాసిక్ బొలేరోకు మోడ్రన్ టచ్ ఇస్తే అది బొలేరో నియో అవుతుంది. దీని ప్రారంభ ధర రూ.8.84 లక్షలు. ఇందులో పవర్ ఫుల్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది కేవలం పల్లెటూళ్లకే కాదు, సిటీ రోడ్లపై కూడా దర్జాగా కనిపిస్తుంది.

మంచి రోడ్ ప్రెజెన్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఇది ఒక ప్రీమియం ఎస్‌యూవీ (SUV) అనుభూతిని ఇస్తుంది. మెరుగైన ఇంటీరియర్, సేఫ్టీ ప్రమాణాలు ఉండటం వల్ల యంగ్ జనరేషన్‌ను కూడా ఇది బాగా ఆకట్టుకుంటోంది.

Article Published On: Monday, April 27, 2026, 10:33 [IST]
English summary
Top 5 best 7 seater cars under rs 10 lakh for large families in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+