కంఫర్ట్‌లో సాటిలేదు.. నమ్మకంలో తిరుగులేదు.. ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడే కార్లు ఇవే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే కొనసాగుతోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇష్టపడిన జనం, ఇప్పుడు కాస్త బడ్జెట్ పెంచి అయినా సరే మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీలను కొనడానికి ఎగబడుతున్నారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఒకవేళ మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక సూపర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే ప్రస్తుతం మార్కెట్లో దుమ్మురేపుతున్న 5 బెస్ట్ ఆప్షన్ల వివరాలు చూద్దాం.
1. సరికొత్త రెనాల్ట్ డస్టర్ (Next-Gen Renault Duster)
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్‌ను మొదలుపెట్టిన కారు రెనాల్ట్ డస్టర్'. ఇప్పుడు సరికొత్త మోడ్రన్ అవతారంలో ఈ కారు మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. చిన్న కార్ల నుంచి పెద్ద కారులోకి షిఫ్ట్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఛాయిస్. పాత డస్టర్ లాగే ఇది రగ్గ్‌డ్ లుక్‌తో ఉంటూనే, లోపల కేబిన్‌ను మాత్రం చాలా లగ్జరీగా మార్చేశారు.

ఈ కారులో రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్లతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా లభిస్తోంది. దీనివల్ల మైలేజ్ పరంగా కస్టమర్లకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. కారు లోపల పనరోమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ కంఫర్ట్ విషయంలో దీనికి వందకు వంద మార్కులు వేయవచ్చు.
2. ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun)
కారు లుక్, మైలేజ్ కంటే సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ ముఖ్యం అనుకునే వారికి ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఒక వరం లాంటిది. జర్మన్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఈ కారులో 1.0-లీటర్, 1.5-లీటర్ సామర్థ్యం గల రెండు పవర్‌ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో కూడా ఈ కారును చాలా సులువుగా కంట్రోల్ చేయవచ్చు. దీని డ్రైవింగ్ డైనమిక్స్ అద్భుతంగా ఉంటాయి, హైవేలపై ఎంత వేగంగా వెళ్లినా కారు రోడ్డుకు అతుక్కుపోయినట్లు ప్రయాణిస్తుంది.

3. కియా సెల్టోస్ (Kia Seltos)
ఫీచర్లు, మోడ్రన్ డిజైన్ పరంగా కియా సెల్టోస్‌ను కొట్టే కారే లేదు. నార్మల్ చిన్న కార్ల నుంచి ఈ కారులోకి మారితే ఏదో లగ్జరీ విమానంలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఇది ఒకటి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్ తన అవసరానికి తగ్గట్టుగా గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. లోపల రెండు పెద్ద స్క్రీన్లు ఉన్న పనోరమిక్ డిస్‌ప్లే, హెడ్-అప్ డిస్‌ప్లే, 10 రకాలుగా అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఈ కారు సొంతం.

4. హోండా ఎలివేట్ (Honda Elevate)
ఎలాంటి హడావుడి లేకుండా, సింపుల్ లుక్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కోరుకునే వారికి హోండా ఎలివేట్ పర్ఫెక్ట్ మ్యాచ్. హోండా సంస్థకు చెందిన నమ్మకమైన 1.5-లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు వస్తుంది. ఇది మాన్యువల్, స్మూత్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఎలివేట్ కారు క్యాబిన్ చాలా గాలీ, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. లాంగ్ జర్నీల్లో అస్సలు అలసట అనిపించదు. దీని బూట్ స్పేస్ ఏకంగా 458 లీటర్లు ఉంటుంది, అంటే ఫ్యామిలీ లగేజ్ మొత్తాన్ని సులభంగా సర్దేయవచ్చు. రక్షణ కోసం ఇందులో అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.

5. టాటా సియెర్రా(Tata Sierra)
రోడ్డుపై వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కారు వైపే చూడాలి అనుకునేలా ఐకానిక్ లుక్‌తో వచ్చింది సరికొత్త టాటా సియెర్రా. పాత తరం సియెర్రా క్లాసిక్ లుక్‌ను గుర్తు చేస్తూనే, సరికొత్త డిజిటల్ హంగులతో టాటా దీనిని డిజైన్ చేసింది. ఈ కారు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ అనే మూడు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ నుంచే 5G కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ కాక్‌పిట్ లభిస్తాయి. వెనుక సీట్లను సోఫా లాగా వెనక్కి వాల్చుకునే సదుపాయం ఉండటం వల్ల ప్రయాణం అత్యంత విలాసవంతంగా మారుతుంది. సేఫ్టీ కోసం లెవెల్-2 ADAS టెక్నాలజీని ఇందులో అమర్చారు.

మంచి మైలేజ్, మోడ్రన్ లుక్ కావాలంటే రెనాల్ట్ డెస్టర్, ప్యూర్ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, ఫీచర్ల వేటలో ఉంటే కియా సెల్టోస్, సుదీర్ఘ కాలం మన్నిక, సింప్లిసిటీ కోసం హోండా ఎలివేట్, ఇక రోడ్లపై తిరుగులేని పర్ఫామెన్స్, లగ్జరీ కావాలంటే టాటా సియెర్రా కార్లను మీరు ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications