మారుతి నుంచి టాటా వరకు.. సగం ధరకే ఎలక్ట్రిక్ కారు.. కంపెనీల మాస్టర్ ప్లాన్ తెలిస్తే ఇప్పుడే షోరూంకు వెళ్తారు
ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే సామాన్యులకు ఇప్పటికీ ఒక పెద్ద అడ్డంకి వాటికి ఉన్న భారీ ధర. పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధరలు చుక్కలను తాకడానికి ప్రధాన కారణం వాటిలో వాడే భారీ బ్యాటరీ ప్యాక్‌లే. అయితే ఇప్పుడు కార్ల కంపెనీలు ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు ఒక కొత్త మంత్రాన్ని కనిపెట్టాయి. అదే BaaS (Battery-as-a-Service). అంటే కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దెకు వాడుకోవడం అన్నమాట. దీనివల్ల కారు ప్రారంభ ధర లక్షల్లో తగ్గుతుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ అద్భుతమైన సదుపాయంతో అందుబాటులో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఏమిటి ఈ BaaS స్కీమ్? ఎందుకు అంత క్రేజ్?
సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు కారు బాడీని మాత్రమే కొంటారు. బ్యాటరీ కంపెనీకి చెందుతుంది. మీరు కారును ఎన్ని కిలోమీటర్లు నడిపితే, ఆ కిలోమీటర్ల లెక్కన కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. దీనివల్ల కారు కొనేటప్పుడు చెల్లించే అప్‌ఫ్రంట్ కాస్ట్ భారీగా తగ్గుతుంది. ఇది కాకుండా బ్యాటరీ లైఫ్ అయిపోతే ఏంటి? అనే భయం కూడా కస్టమర్లకు ఉండదు, ఎందుకంటే బ్యాటరీ బాధ్యత కంపెనీదే కాబట్టి.

1. ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎంజీ కామెట్ ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్. దీని చిన్న సైజు కారణంగా పార్కింగ్, డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటాయి. BaaS స్కీమ్ కింద ఈ కారు ధర కేవలం రూ.4.92 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ కారు కొనాలంటే రూ.7.63 లక్షలు ఖర్చు చేయాలి, కానీ ఈ స్కీమ్ వల్ల మీరు మొదట్లోనే రూ.2.71 లక్షలు ఆదా చేయవచ్చు. బ్యాటరీ కోసం మీరు ప్రతి కిలోమీటర్ కు రూ.3.2 చొప్పున అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఆదా చేసిన లక్షల రూపాయలతో మీరు వేల కిలోమీటర్ల దూరం నిశ్చింతగా ప్రయాణించవచ్చు. సిటీలో తిరిగే చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.

2. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన పంచ్ ఈవీని కూడా ఈ బ్యాటరీ రెంట్ స్కీమ్‌లోకి తీసుకువచ్చింది. ఈ కారు బాడీని మీరు కేవలం రూ.6.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. రెగ్యులర్ ధర రూ.9.69 లక్షలతో పోలిస్తే, ఇక్కడ మీకు రూ.3.20 లక్షల భారీ అడ్వాంటేజ్ లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కారు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కేవలం కిలోమీటర్ కు రూ.2.6 మాత్రమే. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అతి తక్కువ ఛార్జీగా చెప్పవచ్చు. మధ్యతరగతి ప్రజలు ఎస్‌యూవీ (SUV) అనుభూతిని తక్కువ బడ్జెట్‌లో పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

3. ఎంజీ విండ్‌సర్ ఈవీ (MG Windsor EV)
లగ్జరీ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్ కోరుకునే వారికి ఎంజీ విండ్‌సర్ ఈవీ సరైన ఛాయిస్. ఈ కారు BaaS ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ స్కీమ్ ఎంచుకోవడం వల్ల ప్రారంభంలోనే రూ.5.11 లక్షల వరకు ఆదా చేసే వీలుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 38 kWh బ్యాటరీకి కిలోమీటర్ కు రూ.3.9, అలాగే పెద్దదైన 52.9 kWh బ్యాటరీకి కిలోమీటర్ కు రూ.4.5 అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ఫీచర్లు కావాలి కానీ బడ్జెట్ తక్కువగా ఉండాలి అనుకునే వారికి విండ్‌సర్ ఈవీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

4. మారుతి సుజుకి ఈ-విటారా (Maruti Suzuki e Vitara)
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాతో ఈ రేసులోకి దూసుకొచ్చింది. BaaS ప్లాన్ కింద ఈ కారు ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ మోడల్‌లో మీకు గరిష్టంగా రూ.5.50 లక్షల వరకు అప్‌ఫ్రంట్ సేవింగ్స్ లభిస్తాయి. బ్యాటరీ వాడకం కోసం 49 kWh వేరియంట్ కు రూ.3.99/కిమీ, 61 kWh వేరియంట్ కు రూ.4.39/కిమీ ఛార్జ్ చేస్తారు. మారుతి బ్రాండ్ మీద నమ్మకం, దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్ల సదుపాయం వల్ల ఈ కారుకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
5. ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ కూడా ఇప్పుడు BaaS స్కీమ్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీని మీరు రూ.13 లక్షల ప్రారంభ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల మీకు సుమారు రూ.5.24 లక్షల వరకు ఆరంభ ఖర్చు తగ్గుతుంది. ఈ కారు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కిలోమీటర్ కు రూ.4.5 గా నిర్ణయించారు. పవర్ఫుల్ ఇంజన్, అదిరిపోయే రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ బాస్ (BaaS) మోడల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఇది అత్యంత సౌకర్యవంతమైన కారు.


Click it and Unblock the Notifications








