డెలివరీ బాయ్స్‌కు పండగే.. ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
నేటి కాలంలో డెలివరీ బాయ్స్, ఫీల్డ్ వర్క్ చేసే వారికి బైక్ ఎంత ముఖ్యమో, వారి స్మార్ట్‌ఫోన్ కూడా అంతే ముఖ్యం. గూగుల్ మ్యాప్స్ చూడాలన్నా, ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి. కానీ రోజంతా బయట తిరిగేవారికి ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం ఒక పెద్ద తలనొప్పి. పవర్ బ్యాంకులు మోయడం, ఎక్కడైనా హోటల్ దగ్గర ఛార్జింగ్ కోసం బతిమిలాడటం కంటే.. బైక్‌లోనే ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే, డెలివరీ పనుల కోసం ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.
1. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube):
టీవీఎస్ ఐక్యూబ్ భారతీయ మార్కెట్లో అత్యంత నమ్మకమైన ఫ్యామిలీ, కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని స్మూత్ రైడింగ్ అనుభవం. డెలివరీ చేసేవారు రోజంతా రోడ్లపైనే ఉంటారు కాబట్టి, వారికి అలసట లేకుండా ప్రయాణించడం ముఖ్యం. ఐక్యూబ్‌లోని అన్ని వేరియంట్లలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంది. సీటు కింద ఉండే ఈ ఛార్జింగ్ పాయింట్ ద్వారా మీరు ప్రయాణిస్తున్నప్పుడే మీ ఫోన్‌ను సురక్షితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 2.2kWh నుంచి 5.3kWh వరకు నాలుగు రకాల బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది, దీనివల్ల మీ అవసరానికి తగ్గ రేంజ్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవచ్చు.

2. ఓలా ఎస్1 సిరీస్ (Ola S1 X & Pro):
ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా వారి ఎస్1 ఎక్స్ (S1 X), ఎస్1 ప్రో (S1 Pro) మోడల్స్ డెలివరీ బాయ్స్‌కు బాగా సెట్ అవుతాయి. ఐక్యూబ్ లాగా సీటు కింద కాకుండా, ఓలాలో హ్యాండిల్‌బార్ కింది భాగంలోనే యూఎస్‌బీ (USB) ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే మీరు మ్యాప్స్ చూడటం లేదా కాల్స్ మాట్లాడటం చాలా సులభం అవుతుంది. భారీ బ్యాటరీ ప్యాక్ మరియు మంచి టాప్ స్పీడ్ ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేయడానికి ఇది తోడ్పడుతుంది.
3. ఏథర్ రిస్టా (Ather Rizta):
ఏథర్ నుంచి వచ్చిన తాజా మోడల్ రిస్టా. ఇది ముఖ్యంగా ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఇందులో ఏకంగా 56 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది, ఇది డెలివరీ బాక్సులు లేదా బ్యాగులు పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. సీటు కింద ఉన్న ఈ స్టోరేజ్ ఏరియాలోనే 15 వాట్ల యూఎస్‌బీ-సి (USB-C) ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మీ ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, ఇతర చిన్న చిన్న గ్యాడ్జెట్లను కూడా దీనితో ఛార్జ్ చేసుకోవచ్చు.

4. హీరో విడా వి1 (Hero Vida V1):
హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుంచి వచ్చిన విడా వి1 ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్ ఉండటం వల్ల డెలివరీ చేసే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఛార్జింగ్ పాయింట్ విషయానికొస్తే, హ్యాండిల్‌బార్ కింద యూఎస్‌బీ పోర్ట్ అందించారు. అయితే, కొందరు కస్టమర్ల అభిప్రాయం ప్రకారం.. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ ఉంచడానికి సరైన హోల్డర్ లేదా స్పేస్ లేకపోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, ఒక మొబైల్ హోల్డర్ అదనంగా అమర్చుకుంటే ఇది డెలివరీ పనులకు ది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
5. బజాజ్ చేతక్ (Bajaj Chetak):
చేతక్ అంటేనే ఒక క్లాసిక్ లుక్, స్ట్రాంగ్ మెటల్ బాడీ. పాత చేతక్ లాగే కొత్త ఎలక్ట్రిక్ చేతక్ కూడా చాలా గట్టిది. ఇందులో కూడా కంపెనీ ఇన్-బిల్ట్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తోంది. హ్యాండిల్‌బార్ కింద ఉన్న గ్లోవ్ బాక్స్ లోపల ఈ పోర్ట్ ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే, వర్షం పడుతున్నప్పుడు లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఫోన్ సురక్షితంగా లోపల ఛార్జ్ అవుతుంది. డెలివరీ సమయంలో రోడ్లు సరిగ్గా లేకపోయినా దీని మెటల్ బాడీ తట్టుకోగలదు, అలాగే మొబైల్ ఛార్జింగ్ సమస్యను కూడా తీరుస్తుంది.

6. రివర్ ఇండీ (River Indie):
దీనిని స్కూటర్ల ఎస్‌యూవీ అని పిలుస్తారు. ఎందుకంటే దీని లుక్ మరియు స్టోరేజ్ ఆప్షన్లు అంతలా ఉంటాయి. యమహా కూడా దీనిని బేస్ చేసుకునే తమ ఈవీలను లాంచ్ చేస్తోందంటే దీని పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు. ఇందులో హ్యాండిల్‌బార్ కింద 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ ఉంటుంది, అందులోనే మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. పెద్ద టైర్లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల కుదుపులను బాగా తట్టుకుంటుంది. ఫుడ్ డెలివరీ చేసే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ వర్క్ హార్స్ లాంటిది.


Click it and Unblock the Notifications








