అత్యధికంగా అమ్ముడవుతున్న రూ.10 లక్షలలోపు 5 బెస్ట్ కార్లు.. టాప్ ప్లేస్‌లో ఎవరు ఉన్నారో తెలుసా?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి కుటుంబాలు ఈ విభాగం కార్లను ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలగడం వంటి కారణాల వల్ల హ్యాచ్‌బ్యాక్ కార్లు లక్షలాది మంది వినియోగదారుల మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు బడ్జెట్‌కు అనుగుణంగా ఉండటంతో ఈ సెగ్మెంట్‌కు మార్కెట్లో నిరంతరం మంచి డిమాండ్ కొనసాగుతోంది. మే 2026 నెలలో కూడా హ్యాచ్‌బ్యాక్ కార్లు బాగానే అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఈ కథణంలో గత నెలలో ఎక్కువగా సేల్ అయిన టాప్ 5 కార్లను ఒకసారి చూద్దాం.

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. 2026 మే నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టాప్-5 స్థానాల్లో ఉన్న కార్లలో ఎక్కువ భాగం మారుతి సుజుకి మోడళ్లే కావడం విశేషం. ముఖ్యంగా బాలెనో, వాగన్ఆర్, స్విఫ్ట్ వంటి మోడళ్లు వినియోగదారుల నుంచి భారీ ఆదరణను పొందుతూ అమ్మకాల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని మారుతి సుజుకి బాలెనో దక్కించుకుంది.

Top 5 Highest Selling Hatchback Cars In India During May 2026

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎప్పటినుంచో మంచి గుర్తింపు పొందిన బాలెనో, 2026 మే నెలలో ఏకంగా 18,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కారు కేవలం 11,618 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో బాలెనో అమ్మకాలు 58 శాతం పెరగడం మార్కెట్లో ఈ కారుకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

రెండో స్థానంలో నిలిచిన వ్యాగన్ఆర్ తన సత్తాను మరోసారి నిరూపించింది. భారతదేశంలో కుటుంబ కారుగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ మోడల్, 2026 మే నెలలో 18,076 యూనిట్ల అమ్మకాలను సాధించింది. గత ఏడాది మేలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 13,949 యూనిట్లకే పరిమితమయ్యాయి. దీంతో ఏడాది ప్రాతిపదికన ఈ కారు అమ్మకాలు 30 శాతం పెరిగాయి. విశాలమైన ఇంటీరియర్, తక్కువ నిర్వహణ ఖర్చులతో కుటుంబాల తొలి ఎంపికగా ఇది ఉంది.

Top 5 Highest Selling Hatchback Cars In India During May 2026

మూడో స్థానంలో స్విఫ్ట్ నిలిచింది. గత నెలలో 17,519 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో స్విఫ్ట్ అమ్మకాలు 14,135 యూనిట్లుగా నమోదయ్యాయి. కొత్త తరం స్విఫ్ట్‌లో అందించిన డిజైన్ మార్పులు, మెరుగైన ఇంధన సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. బాలెనో, వాగన్ఆర్, స్విఫ్ట్ ఈ మూడు మోడళ్లు మాత్రమే గత నెలలో 17 వేలకుపైగా యూనిట్ల అమ్మకాలను సాధించడం విశేషం.

ఇక నాలుగో స్థానంలో నిలిచిన ఆల్టో కొనసాగుతుంది. ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు పొందిన ఆల్టో, 2026 మే నెలలో 9,887 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2025 మేలో ఆల్టో అమ్మకాలు కేవలం 4,970 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. అంటే కేవలం ఏడాది వ్యవధిలో అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం ఈ మోడల్‌పై ఇంకా బలమైన డిమాండ్ ఉందని సూచిస్తోంది.

Top 5 Highest Selling Hatchback Cars In India During May 2026

అదేవిధంగా, ఐదో స్థానంలో నిలిచిన ఎస్-ప్రెస్సో వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు, గత ఏడాది మేలో 1,806 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అయితే 2026 మే నాటికి అమ్మకాలు భారీగా పెరిగి 6,388 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది మూడు రెట్లకు పైగా వృద్ధిని సూచిస్తోంది. తక్కువ ధర, ఎత్తైన సీటింగ్ పొజిషన్, మెరుగైన మైలేజ్ కారణంగా ఎస్-ప్రెస్సోకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తోంది.

Article Published On: Sunday, June 14, 2026, 16:37 [IST]
English summary
Top 5 highest selling hatchback cars in india during may 2026
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+