90s కార్లు.. ఇప్పటికీ బతికున్న టాప్ 5 ఐకానిక్‌లు.. భారతీయుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయ్!

1990ల కాలంలో వచ్చిన కార్లు భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో ఒక ప్రత్యేక యుగాన్ని సృష్టించాయి. ఆ రోజుల్లో రోడ్లపై కనిపించిన ప్రతి కారు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేది. ఆకర్షణీయమైన డిజైన్‌లు, బలమైన ఇంజిన్‌లు, అప్పటివరకు చూడని ఆధునిక ఫీచర్లతో ఈ వాహనాలు భారతీయ మార్కెట్‌కు కొత్త దిశను చూపించాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇవి కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, ఒక కలలా భావించబడేవి. 90ల తరం ప్రజల జ్ఞాపకాలలో ఈ కార్లు ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని ఉన్నాయి. 1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు, ఒక కారు కొనడం అంటే కుటుంబ గౌరవానికి, జీవితంలో సాధించిన విజయానికి ప్రతీకగా భావించే పరిస్థితిని ఈ ఐకానిక్ మోడళ్లు తీసుకొచ్చాయి. ఈ కథణంలో చెరగని ముద్ర వేసిన 5 గొప్ప కార్లను చూద్దాం.

Tata Sierra: టాటా సియోర్రా భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎంతో గుర్తింపు పొందిన SUVలలో ఒకటి. 1991లో విడుదలైన ఈ వాహనం అప్పటి కాలంలో చాలా స్టైలిష్‌గా కనిపించేది. ఇప్పుడు ఈ ఐకానిక్ SUVను మళ్లీ కొత్త రూపంలో తీసుకు వచ్చింది. కొత్త సియెర్రా 1.5L పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రానుండగా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Top 5 Iconic 90s Indian Cars Still Seen On Roads Today Full Details

Honda City: హోండా సిటీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్లలో ఒకటి. 1998లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు త్వరగా భారతీయుల మనసు దోచుకుంది. ముఖ్యంగా 2000ల కాలంలో హోండా సిటీ అంటే ఒక స్టేటస్ సింబల్‌లా భావించేవారు. Honda అందించిన VTEC టెక్నాలజీ ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సెడాన్ ఐదవ తరం మోడల్‌లో అందుబాటులో ఉంది.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5L i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో పాటు 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పాత సిటీకి ఉన్న క్లాస్‌ను కొనసాగిస్తూ, కొత్త టెక్నాలజీతో ఈ సెడాన్ ఇప్పటికీ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది. మంచి పనితీరు, స్మూత్ డ్రైవింగ్ అనుభవం, విశ్వసనీయత కారణంగా సిటీకి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Top 5 Iconic 90s Indian Cars Still Seen On Roads Today Full Details

Tata Safari: టాటా మోటార్స్ నుంచి టాటా సఫారీ భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన SUVలలో ఒకటి. 1990ల చివరలో మార్కెట్లోకి వచ్చిన ఈ వాహనం, అప్పట్లో చాలా మంది యువత, కుటుంబాలకు డ్రీమ్ SUVగా మారింది. బలమైన లుక్, పెద్ద సైజు, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్ కారణంగా సఫారీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం Tata Motors ఈ SUVను పూర్తిగా ఆధునిక రూపంలో అందిస్తోంది.

కొత్త సఫారీకి పాత సఫారీకి ఉన్న పేరు, స్టైల్‌ను కొనసాగిస్తూ మరింత హైటెక్‌గా మార్చారు. ఈ SUVలో 2.0L డీజిల్ ఇంజన్‌తో పాటు 1.5L హైపెరియన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెద్ద కుటుంబాలకు సరిపోయే స్పేస్, కంఫర్ట్, బలమైన రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఇది ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ SUVగా కొనసాగుతోంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Top 5 Iconic 90s Indian Cars Still Seen On Roads Today Full Details

Maruti Suzuki Wagon R: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. 1999లో విడుదలైన ఈ కారు, సింపుల్ డిజైన్, ఎక్కువ స్పేస్, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా ఫ్యామిలీ కారుగా పెద్ద పేరు సంపాదించింది. ప్రస్తుతం ఇది పెట్రోల్, CNG ఆప్షన్లతో అందుబాటులో ఉండి, మంచి మైలేజ్ ఇవ్వడం దీని ప్రత్యేకత. మొదటిసారి కారు కొనేవారికి ఇప్పటికీ ఇది బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.

Mahindra Bolero: మహీంద్రా బొలెరో భారతదేశ రోడ్లపై ఇప్పటికీ బలంగా నడుస్తున్న ఐకానిక్ SUVలలో ఒకటి. 2000లో విడుదలైన ఈ వాహనం, దృఢమైన బాడీ, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఇది డీజిల్ ఇంజన్‌తో మంచి పనితీరు అందిస్తూ, నమ్మకమైన SUVగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Top 5 Iconic 90s Indian Cars Still Seen On Roads Today Full Details

Article Published On: Tuesday, May 26, 2026, 12:57 [IST]
English summary
Top 5 iconic 90s indian cars still seen on roads today full details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+