ఎర్రటి ఎండల్లో కూడా కూల్ కూల్ జర్నీ.. రియర్ వెంటిలేటెడ్ సీట్లున్న టాప్-5 SUVలు ఇవే
వేసవిలో భారతదేశంలో ప్రయాణం అంటే అదొక నరకం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోతుంటారు. అందుకే ఇప్పుడు కారు కొనేవారు ఇంజిన్ పవర్ కంటే ముందు ఏపీ ఎంత బాగా వస్తుంది. సీట్లు ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయనేది చూస్తున్నారు. ముఖ్యంగా వెంటిలేటెడ్ సీట్లు ఇప్పుడు ఒక లగ్జరీ నుంచి అవసరంగా మారిపోయాయి. సాధారణంగా చాలా కార్లలో డ్రైవర్, కో-డ్రైవర్ కోసం మాత్రమే ఈ సీట్లు ఉంటాయి. కానీ వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం కూడా చల్లని గాలిని అందించే రియర్ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన టాప్ 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. కియా సైరోస్ (Kia Syros)
ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరకే రియర్ వెంటిలేటెడ్ సీట్లను అందిస్తున్న ఘనత కియా సైరోస్కే దక్కుతుంది. కియా కంపెనీ ఈ కారును కేవలం ఫీచర్ల కోసమే పుట్టించిందా అన్నంతగా ఇందులో టెక్నాలజీ ఉంది. దీనిలోని HTX+ వేరియంట్‌లో ఈ రియర్ వెంటిలేటెడ్ సీట్ల సౌకర్యం కలదు. కేవలం రూ.14.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలోనే ఈ ప్రీమియం ఫీచర్‌ను అందించడం నిజంగా గొప్ప విషయం.

ఈ సీట్లు కేవలం చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, వెనుక కూర్చునే వారు తమ వీలును బట్టి సీటును వెనక్కి వాల్చుకోవడానికి (Recline), ముందుకు వెనక్కు జరుపుకోవడానికి కూడా వీలవుతుంది. దీనికి తోడు 8-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని ఒక వేడుకలా మారుస్తాయి.
2. హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar)
మధ్యతరగతి కుటుంబాలకు, పెద్ద ఫ్యామిలీలకు హ్యుందాయ్ అల్కజార్ ఒక అద్భుతమైన ఆప్షన్. మూడు వరుసల సీట్లు కలిగిన ఈ ఎస్‌యూవీలో రెండో వరుస (సెకండ్ రో) లో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. కేవలం రూ.21.20 లక్షల ప్రారంభ ధరతో ఈ లగ్జరీని మనం అనుభవించవచ్చు.

అల్కజార్‌లో సెకండ్ రో కెప్టెన్ సీట్లు రావడం వల్ల ప్రయాణికులకు రాజసం ఉట్టిపడే అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్, మాగ్నెటిక్ ప్యాడ్స్, అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్ వెనుక సీట్లో కూర్చునే వారికి ఇంటి సోఫాలో కూర్చున్నంత కంఫర్ట్‌ను ఇస్తాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది పవర్, కంఫర్ట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది.
3. టాటా సఫారి (Tata Safari)
టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సఫారి. ఇది కేవలం స్ట్రాంగ్ నెస్ కు మాత్రమే కాదు, ఇప్పుడు అత్యున్నత సౌకర్యాలకు కూడా చిరునామాగా మారింది. సఫారిలోని Accomplished X+ వేరియంట్‌లో రెండో వరుసలో వెంటిలేటెడ్ సీట్లను అందించారు. దీని ధర సుమారు రూ.22.82 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా సఫారిలోని వెంటిలేటెడ్ సీట్లు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి, దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా అలసట కలగదు. ఇందులో 10-స్పీకర్ల జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్సుడ్ ఏడీఏఎస్ (ADAS) ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా బాస్ మోడ్ ద్వారా వెనుక కూర్చున్న వారు ముందు సీటును అడ్జస్ట్ చేసుకునే వీలుండటం వల్ల లెగ్ రూమ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
4. మహీంద్రా XUV7XO (Mahindra XUV700)
మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కారు XUV700. దీనిలోని AX7 Luxury (AX7L) ట్రిమ్ అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందిస్తుంది. దాదాపు రూ.25.07 లక్షల ధర కలిగిన ఈ మోడల్‌లో సెకండ్ రో ప్రయాణికుల కోసం వెంటిలేటెడ్ సీట్ల సదుపాయం ఉంది. మహీంద్రా ఈ కారులో కేవలం గాలిని మాత్రమే కాకుండా, 'రియర్ వైర్‌లెస్ ఛార్జింగ్ విత్ యాక్టివ్ కూలింగ్' వంటి చిన్న చిన్న అంశాలపై కూడా దృష్టి పెట్టింది.

డాల్బీ అట్మాస్ ఆడియో, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు వెనుక సీట్లో ప్రయాణించే వారికి ఒక మినీ హోమ్ థియేటర్ అనుభూతిని కలిగిస్తాయి. కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా వెళ్లే సస్పెన్షన్, చల్లని సీట్లు ఈ కారును ఒక పర్ఫెక్ట్ హైవే క్రూయిజర్‌గా మారుస్తాయి.
5. మహీంద్రా XEV 9e (Mahindra XEV 9e)
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మహీంద్రా కొత్తగా ప్రవేశపెట్టిన XEV 9e ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, సౌకర్యాల విషయంలో ఎక్కడా తగ్గదు. దీనిలోని ప్యాక్ త్రీ (Pack Three) వేరియంట్‌లో వెనుక కూర్చునే వారి కోసం వెంటిలేటెడ్ స్లైడింగ్ సీట్లను ఇచ్చారు. దీని ధర రూ.28.10 లక్షల వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల ఇంజిన్ శబ్దం ఏమాత్రం ఉండదు, దానికి తోడు వెంటిలేటెడ్ సీట్లు ఉండటంతో ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగుతుంది. 79 kWh బ్యాటరీ ప్యాక్, ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సిస్టమ్‌తో ఇది ఫ్యూచరిస్టిక్ కారుగా పేరు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications








