రోడ్డు మీద రాకెట్ వేగంతో వెళ్లాలని ఉందా.. 15 లక్షల లోపు లభించే టాప్ టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు ఇవే

గడిచిన కొన్నేళ్లుగా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. అయితే, కేవలం కారు చూడటానికి పెద్దగా ఉంటే సరిపోదు, దాని ఇంజిన్‌లో కూడా పవర్ ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. ముఖ్యంగా డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్నవారికి టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఇచ్చే కిక్కు వేరు. మీరు కూడా 15 లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో అదిరిపోయే పవర్, వేగంతో దూసుకెళ్లే ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే లిస్ట్. టాటా, మహీంద్రా, కియా వంటి దిగ్గజాలతో పాటు సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

1. స్కోడా కైలాక్ (Skoda Kylaq)
మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండి, క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదనుకుంటే స్కోడా కైలాక్ బెస్ట్ ఆప్షన్. ఇది ప్రతిష్టాత్మకమైన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇందులో 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 118 hp పవర్, 178 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. భారత్ NCAP లో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడం విశేషం. దీని ధర రూ.7.59 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్య ఉంటుంది.

Top 5 Turbo Petrol SUVs Under Rs 15 Lakh Power-Packed Machines for Driving Enthusiasts

2. కియా సోనెట్ టర్బో (Kia Sonet)
స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లు కోరుకునే వారికి కియా సోనెట్ మొదటి ప్రాధాన్యత. ఇందులో 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 118 hp పవర్, 172 Nm టార్క్ ఇస్తుంది. దీనిలోని iMT (క్లచ్ లేని మాన్యువల్), DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. దీని సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్‌గా ఉన్నా, హైవేలపై దూసుకెళ్లేటప్పుడు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దీని అన్ని టర్బో వేరియంట్లు 15 లక్షల లోపే లభిస్తాయి.

3. సరికొత్త రెనాల్ట్ డస్టర్ (New Renault Duster 2026)
డ్రైవింగ్ ప్రియులకు డస్టర్ అంటే ఒక ఎమోషన్. కొత్త వెర్షన్ ఇప్పుడు మరింత పవర్‌తో వచ్చింది. ఇందులో 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది ఏకంగా 160 hp పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇంత పవర్ ఇచ్చే కారు మరొకటి లేదు. 212 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ, మలుపుల్లో ఈ కారు ఇచ్చే గ్రిప్ అద్భుతం. దీని ధర రూ. 12.99 లక్షల నుండి రూ. 14.69 లక్షల మధ్య ఉంది. పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇదే సరైన ఛాయిస్.

Top 5 Turbo Petrol SUVs Under Rs 15 Lakh Power-Packed Machines for Driving Enthusiasts

4. టాటా పంచ్ టర్బో (Tata Punch Turbo)
టాటా మోటార్స్ తన పాపులర్ పంచ్ ఎస్‌యూవీలో కూడా ఇప్పుడు టర్బో ఇంజిన్‌ను పరిచయం చేసింది. నెక్సాన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 118 hp పవర్, 170 Nm టార్క్ ఇస్తుంది. కేవలం 11.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. భారత్ NCAP 5-స్టార్ రేటింగ్‌తో సేఫ్టీలోనూ దీనికి సాటి లేదు. దీని ధర రూ.8.29 లక్షల నుంచి రూ.9.79 లక్షల మధ్య ఉండి, బడ్జెట్ ప్రియులను ఆకర్షిస్తోంది.

5. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈ జాబితాలో మరో బలమైన పోటీదారు. దీనిలోని 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో ఇంజిన్ ఏకంగా 131 hp పవర్ను జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో దీని పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫీచర్ల పరంగా కూడా ఇది చాలా అప్‌డేట్ అయ్యింది. దీని ధర రూ.7.37 లక్షల నుంచి రూ.14.55 లక్షల మధ్య ఉంటుంది. ఇది కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, March 23, 2026, 15:55 [IST]
English summary
Top 5 turbo petrol suvs under rs 15 lakh power packed machines for driving enthusiasts
Read more on: #kia sonet #renault #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+