ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో వెళ్లొచ్చు..చుట్టాలను కూడా ఎక్కించుకోవచ్చు.. మార్కెట్లోకి కొత్త 7 సీటర్ కార్లు
పెద్ద కుటుంబం ఉండి, అందరూ కలిసి ఒకే కారులో విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి 2026 సంవత్సరం ఒక వరమనే చెప్పాలి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ ఏడాది అదిరిపోయే ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో కూడిన 5 కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు (SUVs) అడుగుపెట్టబోతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. టాటా, మహీంద్రా, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
1. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio-N Facelift)
మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో-ఎన్ను కొత్త హంగులతో మార్కెట్లోకి తెస్తోంది. ఆగస్టు 2026లో విడుదల కానున్న ఈ కారులో మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. కొత్త గ్రిల్, స్లీక్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్‌తో ఇది చూడటానికి మరింత గంభీరంగా ఉండనుంది.

లోపలి భాగంలో 10.25-అంగుళాల భారీ టచ్ స్క్రీన్, పనోరమిక్ సన్రూఫ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా జోడిస్తున్నారు. దీని ధర సుమారు రూ.14 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఆఫ్‌రోడింగ్ ఇష్టపడే వారికి, పెద్ద ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.
2. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio Classic Facelift)
స్కార్పియో-ఎన్ వచ్చినప్పటికీ, పాత స్కార్పియో క్లాసిక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మహీంద్రా దీనిని కూడా అప్డేట్ చేస్తోంది. కొత్త క్రోమ్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో ఇది రానుంది. ఇందులో నమ్మకమైన 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ కొనసాగుతుంది, అయితే ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో పాత స్కార్పియో స్టైల్, స్వ్యాగ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

3. టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ సంచలనం సృష్టించబోతోంది. 2026 ద్వితీయార్థంలో సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ కానుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. భారీ పరిమాణం ఉన్నప్పటికీ, కేవలం 7 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఇందులో ఆటో పార్క్ అసిస్ట్, మీ కారు నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు పవర్ ఇచ్చే V2L ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని ధర రూ.28 నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
4. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ 7-సీటర్ (Toyota Urban Cruiser Hyryder 7-Seater)
టయోటా తన మైలేజీ రారాజు అయిన హైరైడర్‌ను 7-సీటర్ వెర్షన్‌లో తీసుకువస్తోంది. ఇప్పటికే లద్దాఖ్‌లో దీని టెస్టింగ్ జరుగుతోంది. 7 సీట్ల కోసం దీని వీల్ బేస్‌ను పెంచారు. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఉండటం వల్ల మైలేజీ అద్భుతంగా ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా ఇందులో ఉండబోతోంది. దీని ధర రూ.15 నుంచి రూ.22 లక్షల మధ్య ఉండవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే పెద్ద ఫ్యామిలీలకు ఇది వరం లాంటిది.

5. నిస్సాన్ టెక్టాన్ బేస్డ్ 7-సీటర్ (Nissan Tecton Based 7-Seater)
నిస్సాన్ కంపెనీ తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టెక్టాన్ ఆధారంగా ఒక 7-సీటర్ కారును రూపొందిస్తోంది. దీని అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇది చూడటానికి టెక్టాన్ లాగే ఉన్నా, లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో వచ్చే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారు రూ.14 నుంచి రూ.22 లక్షల వరకు ఉండవచ్చు. నిస్సాన్ బ్రాండ్‌ను ఇష్టపడే వారికి ఇది మంచి కారు కానుంది.


Click it and Unblock the Notifications








