చూపు తిప్పుకోనివ్వని డిజైన్లతో త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ 5 మిడ్-సైజ్ SUVలు ఇవే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే మార్కెట్లో టాటా సియెర్రా, కియా సెల్టోస్, మారుతి ఈ-విటారా వంటి కార్లు సందడి చేస్తుండగా.. స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి పాపులర్ కార్లు కూడా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో దూసుకుపోతున్నాయి. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. రాబోయే ఒకే ఒక్క సంవత్సరంలో ఇండియన్ రోడ్లపై ప్రభంజనం సృష్టించడానికి 5 మిడ్-సైజ్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు మైండ్ బ్లాకింగ్ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ (EV) ఆప్షన్లలో ఉన్నాయి.
1. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా
భారతదేశంలో టయోటా కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు (EV) ఇదే కావడం విశేషం. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. మారుతి సుజుకి ఈ-విటారాతో కలిపి ఈ కారును సంయుక్తంగా తయారు చేస్తున్నారు.

దీని ఫ్రంట్ లుక్ చాలా ఫ్యూచరిస్టిక్ గా, క్లీన్ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది. ఇందులో ఒక వేరియంట్ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ఉన్న టాప్ వేరియంట్ ఏకంగా 543 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇస్తుంది. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే ఈవీ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
2. నిస్సాన్ టెక్టాన్
ఒకప్పుడు ఇండియన్ రోడ్లను ఏలిన నిస్సాన్ టెరానో కారు గుర్తుంది కదా.. సరిగ్గా అదే రగ్గడ్ లుక్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సరికొత్తగా వస్తోంది నిస్సాన్ టెక్టాన్. ఈ ఏడాది జూన్ 9వ తేదీనే ఈ కారు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇది రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే వస్తున్నప్పటికీ, డిజైన్ పరంగా చాలా స్పోర్టీగా ఉంటుంది.

ఈ కారులో షార్ప్ ఎల్‌ఈడీ లైట్లు, పెద్ద 18-ఇంచుల అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదట్లో ఈ కారును కంపెనీ 1.0-లీటర్, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే తీసుకురానుంది. అయితే ఈ ఏడాది చివర్లోగా ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టే ప్లాన్ లో నిస్సాన్ ఉంది.
3. హ్యుందాయ్ బేయాన్
గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన తన పాపులర్ కారు బేయాన్‌ను హ్యుందాయ్ ఇప్పుడు సరికొత్త రూపంలో ఇండియాకు తీసుకొస్తోంది. మార్కెట్లో దీని ప్రధాన పోటీ మారుతి సుజుకి విక్టోరిస్ కారుతో ఉండబోతోంది. ప్రస్తుత క్రెటా కారుతో పోలిస్తే దీని డిజైన్, లుక్స్ మరింత స్టైలిష్‌గా, డైనమిక్‌గా కనిపిస్తాయి.

ఈ కారులో సరికొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన పవర్, మంచి మైలేజ్ కాంబినేషన్‌తో రానుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ కారు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.
4. జాకూ J5 (Jaecoo J5)
జెఎస్డబ్ల్యూ (JSW) మోటార్స్ సంస్థ చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ చెరి (Chery)తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఇండియాలో లాంచ్ చేయబోతున్న రెండో ఎస్‌యూవీ ఈ జాకూ J5. వచ్చే ఏడాది జనవరి 2027 లోగా ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ కారు డిజైన్ చూస్తే ఎవరైనా సరే లగ్జరీ రేంజ్ రోవర్ కారు అనుకోవాల్సిందే.. అంత మస్క్యులర్ గా, ప్రీమియంగా ఉంటుంది. ఇండియాలో దీనిని సరికొత్త పేరుతో, కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ (EV) అవతారంలోనే లాంచ్ చేయనున్నారు. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 461 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
5. న్యూ-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా (Next-Gen Hyundai Creta)
మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌కు అప్రతిహత మహారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా, ఇప్పుడు మరింత పెద్దగా సరికొత్త థర్డ్-జనరేషన్ (3rd Generation) రూపంలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 2027 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. పాత క్రెటాతో పోలిస్తే ఇది మరింత రఫ్-అండ్-టఫ్ లుక్, భారీ మస్క్యులర్ బాడీతో ఉండబోతోంది.

కారు లోపల ఏకంగా 12.9-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త మోడ్రన్ కేబిన్ హైలైట్‌గా నిలవనున్నాయి. మొదట ఈ కారును పవర్‌ఫుల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లాంచ్ చేసి, ఆ తర్వాత కొద్ది రోజులకే ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ (EV) వేరియంట్లను కూడా లైన్లోకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications