రూ.5 లక్షల్లో 35 కి.మీ మైలేజ్ ఇచ్చే టాప్ CNG కార్లు.. బైక్‌ కంటే బెస్ట్! మధ్యతరగతి కోసం సూపర్ కార్లు

భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్లు మొదటగా చూసేది రెండు విషయాలనే ధర, మైలేజ్. తక్కువ ధరలో లభిస్తూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఖర్చును తగ్గించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. CNG కార్లు నడపడానికి ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తాయి కాబట్టి రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్లో తక్కువ ధరలో లభించే CNG కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, సెలెరియో కార్లు కీలకంగా ఉన్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

Maruti Suzuki Celerio: భారతదేశంలో తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా పేరు సంపాదించింది. ముఖ్యంగా CNG ఆప్షన్‌తో ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఎంపికగా మారింది. ప్రస్తుతం ఈ కారు CNG వేరియంట్ ఒక్కటే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది, అది VXi వేరియంట్. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను CNG కిట్‌తో జతచేశారు. ఈ ఇంజన్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందించబడుతుంది.

Top Affordabl Maruti Cng Cars In India S Presso Alto K10 Celerio Price Mileage Details

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ CNG మోడల్ లీటర్‌కు సుమారు 34.43 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. అందుకే రోజువారీ ప్రయాణాలు చేసే వారికి లేదా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా భావించబడుతోంది. ప్రస్తుతం ఈ కారుకు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.98 లక్షలుగా ఉంది. ప్రాంతాన్ని బట్టి ఆన్-రోడ్ ధరలు కొంత మారే అవకాశం ఉంటుంది.

Maruti Suzuki S-Presso: తక్కువ ధర CNG కార్లలో ఎస్-ప్రెస్సో ఒకటిగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. మారుతి సుజుకి ఈ కారును రెండు CNG వేరియంట్లలో అందిస్తోంది. అవి LXi (O) CNG, VXi (O) CNG. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా సుమారు రూ.4.62 లక్షలు మరియు రూ.5.12 లక్షలుగా ఉన్నాయి.

Top Affordabl Maruti Cng Cars In India S Presso Alto K10 Celerio Price Mileage Details

ఈ రెండు వేరియంట్లు కూడా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. అదే ఇంజన్‌కు కంపెనీ ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG కిట్‌ను అందించింది. ఈ ఇంజన్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు కిలోకు సుమారు 32.73 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. అందుకే తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారింది.

Maruti Suzuki Alto K10: ఆల్టో కె10 కూడా భారతదేశంలో అత్యంత చౌకైన CNG కార్లలో ఒకటిగా మంచి పేరు సంపాదించింది. ఈ కారును రెండు CNG వేరియంట్లలో LXi (O) CNG, VXi (O) CNGలలో అందిస్తున్నారు. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా సుమారు రూ.4.82 లక్షలు, రూ.5.32 లక్షలుగా నిర్ణయించబడ్డాయి.

Top Affordabl Maruti Cng Cars In India S Presso Alto K10 Celerio Price Mileage Details

S-Presso CNG వేరియంట్లతో పోలిస్తే ఆల్టో కె10 CNG మోడళ్ల ధర ప్రతి వేరియంట్‌కు సుమారు రూ.20,000 వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ కారు కూడా 1.0-లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG కిట్‌తో వచ్చే ఈ ఇంజన్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కారణంగా ఈ కారు కూడా భారత మార్కెట్లో మంచి డిమాండ్‌ను పొందుతోంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 14, 2026, 17:00 [IST]
English summary
Top affordabl maruti cng cars in india s presso alto k10 celerio price mileage details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+