రూ.30 వేల జీతంతో కారు కొనండి! 33 కి.మీ మైలేజ్.. ఇండియాలో అతి తక్కువ ధరలో బెస్ట్ కార్లు
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. సైజ్ పరంగా చిన్నవైనా, ఇవి అందించే స్టైల్, సౌకర్యం, ఉపయోగకరమైన ఫీచర్ల వల్ల పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉండడం, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. మీరు ఇప్పుడు ఒక సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మారుతి సుజుకి బ్రాండ్ నుంచి వచ్చే కొన్ని మోడళ్లు మీ జాబితాలో తప్పకుండా ఉండాలి. వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో కార్లు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.
Maruti Suzuki Swift: స్విఫ్ట్ భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ప్రస్తుతం స్విఫ్ట్ ధరలు రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.80 లక్షల వరకు(ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో స్టైల్‌తో పాటు మంచి ఫీచర్లను అందించడం స్విఫ్ట్ ప్రత్యేకత. డిజైన్ పరంగా కొత్త స్విఫ్ట్ మరింత యూత్‌ఫుల్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్‌లో 5 సీట్ల లేఅవుట్ ఉంది.

ముందు, వెనుక సీట్లలో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చుని ప్రయాణించేందుకు తగినంత స్థలం అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఇంజిన్లు మంచి పనితీరుతో పాటు అద్భుతమైన మైలేజీని అందిస్తాయి. పెట్రోల్, CNG వేరియంట్లలో కలిపి చూస్తే, స్విఫ్ట్ సుమారు 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. ఫీచర్ల పరంగా కూడా స్విఫ్ట్ సెగ్మెంట్‌లో ముందంజలో ఉంటుంది.
Maruti Suzuki WagonR: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారత మార్కెట్‌లో ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. నమ్మకమైన పనితీరు, ప్రాక్టికల్ డిజైన్ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా చిన్న కుటుంబాల నుంచి ఫస్ట్ టైమ్ కార్ కొనుగోలుదారుల వరకు ఎంతోమందికి ఇది ఇష్టమైన ఎంపికగా మారింది. ప్రస్తుతం వ్యాగన్ఆర్ ధరలు రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు(ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, వ్యాగన్ఆర్‌లో 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, CNG వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజిన్లు రోజువారీ వినియోగానికి తగిన పనితీరుతో పాటు అద్భుతమైన మైలేజీని కూడా ఇస్తాయి. పెట్రోల్, CNG వేరియంట్లను కలిపి చూస్తే, వ్యాగన్ఆర్ సుమారు 23 నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజీ అందించగలదు. ఫీచర్ల పరంగా కూడా వ్యాగన్ఆర్ ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తుంది.
Maruti Suzuki Baleno: బాలెనో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలుస్తోంది. బాలెనో ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షల వరకు(ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి, అందువల్ల ఈ సెగ్మెంట్‌లో బలమైన ఎంపికగా మారింది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,520 మిమీ వీల్‌బేస్ ఉండటం వల్ల నగర రోడ్లతో పాటు హైవే ప్రయాణాల్లో కూడా ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ను అందిస్తుంది.

ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్లు మంచి పనితీరుతో పాటు ఇంధన సామర్థ్యాన్ని కూడా సమతుల్యంగా అందిస్తాయి. మైలేజీ పరంగా చూస్తే, బాలెనో సుమారు 22 నుంచి 30 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. భద్రత విషయంలో కూడా మారుతి సుజుకి ఎలాంటి రాజీ పడలేదు. అందుకే బాలెనోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








