పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేస్తే..ఊరంతా తిరిగేయొచ్చు..ఈ కార్ల మైలేజ్ అలాంటిది మరి
భారతదేశంలో కార్ల కొనుగోలు దారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది మైలేజీకే. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కారు మైలేజ్ బాగుంటే నెలవారీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల బడ్జెట్ లో మైలేజ్, భద్రతను ఇచ్చే అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి.
టాటా టియాగో (Tata Tiago): టాటా మోటార్స్ నుంచి వచ్చిన టియాగో కారు భద్రతకు, మైలేజీకి పెట్టింది పేరు. దీని ప్రారంభ ధర రూ.4.57 లక్షలు. గట్టి బాడీ స్ట్రక్చర్‌తో పాటు, ఇది లీటరుకు సుమారు 26.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భద్రతను (4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్) కోరుకునే వారికి, అదే సమయంలో తక్కువ ఇంధన ఖర్చును ఆశించే వారికి ఇది ఒక తెలివైన ఎంపిక.

మారుతి సుజుకి సెలెరియో (Maruti Celerio): మారుతి సెలెరియో ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ.4.70 లక్షలు. దీని పెట్రోల్ వేరియంట్ లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సిఎన్‌జి (CNG) మోడల్ అయితే ఏకంగా కిలోకు 34.4 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి సెలెరియోకు మించిన ఆప్షన్ లేదు.

మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Alto K10): నగరాల ఇరుకైన రోడ్లపై సులభంగా దూసుకుపోయే కారు కావాలంటే ఆల్టో K10 బెస్ట్. దీని ధర కేవలం రూ.3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.0 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి, చిన్న కుటుంబాలకు అత్యంత పొదుపైన కారు.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti WagonR): సంవత్సరాలుగా ఇండియాలో నంబర్ 1 అమ్మకాలతో దూసుకుపోతున్న కారు వ్యాగన్ ఆర్. దీని ధర రూ. 4.99 లక్షల నుండి మొదలవుతుంది. దీని బాక్సీ డిజైన్ వల్ల లోపల విశాలంగా ఉంటుంది. మైలేజ్ పరంగా చూస్తే, దీని 1.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ 25.19 కి.మీ/లీ మైలేజీని ఇస్తుంది. సిఎన్‌జి వెర్షన్ లో దీని పొదుపు ఇంకా ఎక్కువగా ఉంటుంది.

హ్యుందాయ్ i10 నియోస్ (Hyundai Grand i10 Nios): హ్యుందాయ్ నుంచి వస్తున్న ఈ ఎంట్రీ లెవల్ కారు ధర రూ.5.98 లక్షలు. స్టైలిష్ లుక్ తో పాటు సేఫ్టీ కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా ఇచ్చారు. ఇది పెట్రోల్ మాన్యువల్‌లో 18 కి.మీ/లీ, ఆటోమేటిక్ లో 16 కి.మీ/లీ, సిఎన్‌జి వెర్షన్‌లో 27 కి.మీ/కిలో మైలేజీని అందిస్తుంది. లగ్జరీ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.

మధ్యతరగతి భారతీయుడు కారు కొనాలనుకున్నప్పుడు మొదట చూసేది మైలేజ్ . పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే కారు ఉంటే ఆ కిక్కే వేరు. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 6 లక్షల లోపు ఉండి, సిటీ డ్రైవింగ్‌కు పర్‌ఫెక్ట్ గా సరిపోయే మంచి మైలేజ్ కారు కోసం వెతుకుతుంటే పై వాటిని పరిశీలించొచ్చు.


Click it and Unblock the Notifications








