ఈ కారుకే జనాల పట్టాభిషేకం.. ఎక్కువ మంది కొంటున్న మిడ్-సైజ్ SUV టాప్-10 పూర్తి సేల్స్ రిపోర్ట్ చూసేయండి!

భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాంపాక్ట్ SUVలతో పోలిస్తే ఎక్కువ క్యాబిన్ స్పేస్, రోడ్డుపై వెళ్తుంటే ఆకట్టుకునే లుక్, ఫ్యామిలీకి సరిపోయే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఇప్పుడు ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను అత్యంత విజయవంతంగా ఉపయోగించుకుంటున్న కంపెనీల్లో మహీంద్రా (Maghindra) ముందంజలో ఉంది. ప్రత్యేకించి మహీంద్రా స్కార్పియో, XUV 7XO మోడళ్లు మార్కెట్లో అద్భుతమైన స్పందనను అందుకుంటున్నాయి. ఈ రెండు SUVలే ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్‌కు ప్రధాన అమ్మకాల బలంగా మారాయి. వీటి క్రేజ్ కారణంగా కంపెనీ నెలవారీ విక్రయాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి.

ఇక స్కార్పియో (Scorpio) విషయానికి వస్తే, జూన్ 2026లో 14,097 యూనిట్ల అమ్మకాలతో మరోసారి తన సత్తా చాటింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 11 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో ఉన్నప్పటికీ ఈ SUVపై వినియోగదారుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. స్కార్పియో అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం దాని నిర్మాణం, శక్తివంతమైన పనితీరు, అన్ని రకాల రోడ్లపై డ్రైవింగ్ అనుభవం.

Top Selling Mid Size Suv Cars In India Based On June 2026 Sales Report

వీటికి తోడు మహీంద్రా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, టెక్నాలజీ అప్‌డేట్‌లు అందిస్తూ ఈ SUVని మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. అందుకే కొత్త SUV కొనుగోలు చేయాలనుకునే వారి జాబితాలో స్కార్పియో ఇప్పటికీ మొదటి వరుసలో నిలుస్తోంది. స్కార్పియో తర్వాత అమ్మకాల పరంగా రెండో స్థానాన్ని మారుతి సుజుకి విక్టోరిస్ దక్కించుకుంది. కంపెనీకి చెందిన ఈ కొత్త మిడ్-సైజ్ SUV గత నెలలో 10,035 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జూన్ 2025లో ఈ మోడల్ మార్కెట్లో అందుబాటులోనే లేదు. అయినప్పటికీ తక్కువ సమయంలోనే వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందుతూ సెగ్మెంట్‌లో టాప్ మోడళ్లలో ఒకటిగా నిలవడం గమనార్హం. మూడో స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. కియా బ్రాండ్‌కు ఇప్పటికీ అత్యధిక అమ్మకాలు తెచ్చిపెడుతున్న మోడల్‌గా సెల్టోస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Top Selling Mid Size Suv Cars In India Based On June 2026 Sales Report

జూన్ 2026లో 9,654 యూనిట్లు విక్రయించగా, ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 85 శాతం వృద్ధి సాధించింది. నాలుగో స్థానంలో మహీంద్రా XUV 7XO నిలిచింది. గతంలో XUV700 పేరుతో విక్రయించిన ఈ మోడల్, ప్రస్తుతం కొత్త గుర్తింపుతో మార్కెట్లో కొనసాగుతోంది. జూన్ నెలలో 9,244 యూనిట్లు అమ్ముడవడంతో మహీంద్రా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఆ తర్వాతి స్థానాల్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా నిలిచాయి. టయోటా-మారుతి భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేశారు. జూన్ నెలలో హైరైడర్ 9,104 యూనిట్లు, గ్రాండ్ విటారా 9,092 యూనిట్లు విక్రయించాయి. గత ఏడాది జూన్‌తో పోలిస్తే హైరైడర్ అమ్మకాలు 22 శాతం, గ్రాండ్ విటారా అమ్మకాలు 33 శాతం పెరగడం ఈ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.

Top Selling Mid Size Suv Cars In India Based On June 2026 Sales Report

ఇక ఎప్పుడూ ఈ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉండే హ్యుందాయ్ క్రెటా ఈసారి ఏడో స్థానానికి పరిమితమైంది. గత నెలలో 7,168 యూనిట్లు మాత్రమే అమ్ముడవడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. టాటా సియెర్రా కూడా మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ SUV జూన్ 2026లో 6,392 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కొత్త మోడల్ కావడంతో గత ఏడాది అమ్మకాలతో పోల్చేందుకు గణాంకాలు అందుబాటులో లేవు.

మరోవైపు, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గత నెలలో 1,182 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే నెలలో 1,170 యూనిట్లు విక్రయించగా, ఈసారి కేవలం 12 యూనిట్ల పెరుగుదలతో 1.03 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అంటే టైగన్ అమ్మకాలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక రెనాల్ట్ డస్టర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. జూన్ నెలలో ఈ SUV 1,011 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

Article Published On: Thursday, July 16, 2026, 15:08 [IST]
English summary
Top selling mid size suv cars in india based on june 2026 sales report
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+