కార్ లవర్స్ కు పండుగే.. కేవలం రూ.15 లక్షల లోపు బడ్జెట్లో ఈ ఏడాది లాంచ్ కానున్న బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే నడుస్తోంది. రోడ్డుపై గంభీరంగా కనిపించే లుక్, అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యామిలీ అంతా సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా వీటికే ఓటేస్తున్నారు. మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీ బడ్జెట్ 15 లక్షల లోపే ఉందా? అయితే కొద్ది రోజులు ఆగండి. మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త కార్లు రాబోతున్నాయి. కేవలం 8 లక్షల నుంచే వీటి ధరలు ఉండబోతున్నాయి.

1. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఫేస్‌లిఫ్ట్ (Toyota Urban Cruiser Hyryder Facelift)
టయోటా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను సరికొత్త హంగులతో తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్న 5-సీటర్ మోడల్‌కు అప్‌డేట్స్ ఇవ్వడమే కాకుండా, పెద్ద ఫ్యామిలీల కోసం 7-సీటర్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కారులో ముఖ్యంగా రియర్ ఓవర్‌హ్యాంగ్‌ను పెంచి మూడవ వరుస సీట్లను జోడించనున్నారు.

Top Upcoming SUVs Under Rs 15 Lakh in India 2026 Best Budget-Friendly Launches to Watch Out For

ఫీచర్ల విషయానికి వస్తే 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, యూఎస్‌బీ టైప్-సి పోర్టులు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది లీటరుకు సుమారు 25 నుంచి 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సమాచారం. ఇది అక్టోబర్ 2026 నాటికి మార్కెట్లోకి రావచ్చు, దీని ప్రారంభ ధర సుమారు 13.50 లక్షల రూపాయలు ఉండవచ్చు.

2. హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon)
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు గట్టి పోటీని ఇచ్చేందుకు హ్యుందాయ్ తన గ్లోబల్ మోడల్ బేయాన్‎ను ఇండియాలోకి తెస్తోంది. ఇది హ్యుందాయ్ ఎక్స్టర్, వెన్యూ మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేస్తుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో ఇది అద్భుతమైన మైలేజీని ఇవ్వబోతోంది.

Top Upcoming SUVs Under Rs 15 Lakh in India 2026 Best Budget-Friendly Launches to Watch Out For

లోపల 12.3 ఇంచ్ కర్వ్డ్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు బడ్జెట్ ప్రియుల కోసం కేవలం 8 లక్షల రూపాయల (ఆన్-రోడ్) నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీపావళి 2026 నాటికి ఇది షోరూమ్‌లలో మెరవనుంది.

3. నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో నిస్సాన్ తన ముద్ర వేసేందుకు టెక్టాన్‎ను సిద్ధం చేసింది. మెర్సిడెస్-బెంజ్ సహకారంతో అభివృద్ధి చేసిన 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ దీని ప్రత్యేకత. ఇది ఏకంగా 163 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే వేగంతో పాటు గంభీరమైన పవర్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. నిస్సాన్ ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వేరియంట్లను కూడా అందించే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.12.65 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.

Top Upcoming SUVs Under Rs 15 Lakh in India 2026 Best Budget-Friendly Launches to Watch Out For

4. మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Brezza Facelift)
ఎస్‌యూవీ అనగానే భారతీయులకు గుర్తొచ్చే పేరు బ్రెజ్జా. ఇప్పుడు ఈ కారు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. ఇందులో ప్రధాన మార్పు ఏంటంటే.. కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా బూట్ స్పేస్ తగ్గకుండా ఉండేందుకు అండర్-బాడీ సీఎన్జీ ట్యాంక్ టెక్నాలజీని మారుతి ఇందులో వాడే అవకాశం ఉంది. దీనివల్ల సీఎన్జీ కారులో కూడా లగేజీ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఇది లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర 10 లక్షల రూపాయల దగ్గర ఉండవచ్చు.

5. మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ (Thar 3-Door Facelift)
ఆఫ్-రోడింగ్ కింగ్ మహీంద్రా థార్ ఇప్పుడు కొత్త లుక్‌తో రాబోతోంది. థార్ రాక్స్ (5-డోర్) లో ఉన్న ఫీచర్లను ఇప్పుడు 3-డోర్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా చేర్చనున్నారు. కొత్త సి-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు ఈ కారుకు మరింత క్రేజీ లుక్‌ను ఇస్తాయి. ఇంజిన్, పర్ఫార్మెన్స్‌లో మార్పులు ఉండకపోవచ్చు కానీ, ఇంటీరియర్ మాత్రం మరింత లగ్జరీగా మారనుంది. ఈ పండుగ సీజన్లో థార్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. దీని ధర సుమారు 11.91 లక్షల రూపాయల నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 14, 2026, 10:35 [IST]
English summary
Top upcoming suvs under rs 15 lakh in india 2026 best budget friendly launches to watch out for
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+