జపాన్ నుంచి వచ్చి దుమ్ములేపుతుంది! రోజుకు 1000 మందికి పైగా ఈ కంపెనీ కార్లే కొంటున్నారు
దేశీయ ఆటోమొబైల్ రంగంలో టయోటా (Toyota) ప్రస్తుతం బలమైన దూకుడుతో ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ జపాన్ బ్రాండ్, ఇప్పుడు భారత మార్కెట్లో మరింత గట్టి స్థానం సంపాదించుకుంటోంది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన కార్లను అందిస్తూ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో కంపెనీ సక్సెస్ అవుతోంది. ఈ విజయానికి ప్రధాన కారణం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న పాపులర్ మోడళ్లే. ఇన్నోవా, ఫార్చ్యునర్ వంటి కార్లు మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాయి. ఈ కంపెనీ అందించే కార్ల డిజైన్‌లో కనిపించే ప్రాక్టికాలిటీ, డ్రైవింగ్‌లో ఇచ్చే సౌకర్యం, దీర్ఘకాలిక నమ్మకం కలిగించే ఇంజిన్ పనితీరు ఇవన్నీ కలిపి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
అదనంగా, టయోటా కార్లకు ఉన్న మంచి రీసేల్ విలువ కూడా కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశంగా మారింది. ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్ల ప్రభావం అమ్మకాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 2026లో టయోటా మొత్తం 32,086 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 27,329 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి దాదాపు 17 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు, మార్కెట్లో బ్రాండ్‌పై పెరుగుతున్న నమ్మకానికి ప్రతీక. వృద్ధికి దేశీయ మార్కెట్ ప్రధాన బలం కావడం మరో ముఖ్య అంశం. భారత వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, వాటికి సరిపోయే ఉత్పత్తులను అందించడం ద్వారా టయోటా మంచి ఫలితాలను సాధిస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు, లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడే వినియోగదారులు, నమ్మకమైన వాహనం కోరుకునే వారు టయోటా వైపు మొగ్గు చూపుతున్నారు.
దేశీయంగా టయోటా ప్రదర్శన ఈసారి మరింత బలంగా కనిపించింది. ఏప్రిల్ 2026లో కంపెనీ మొత్తం 30,159 యూనిట్లను డీలర్‌షిప్‌లకు పంపించింది. గత సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా విక్రయించిన 24,833 యూనిట్లతో పోలిస్తే ఇది సుమారు 21 శాతం వృద్ధిని సూచిస్తోంది. అంటే, దేశీయ మార్కెట్లో డిమాండ్ ఎంతగా పెరిగిందో ఈ సంఖ్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. 30 రోజుల్లో రోజుకు 1069 మంది ఈ కంపెనీ కార్లే కొన్నారు.

అయితే, ఎగుమతుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. ఏప్రిల్ 2026లో టయోటా విదేశాలకు 1,927 యూనిట్లను మాత్రమే రవాణా చేసింది. గత ఏడాది ఇదే నెలలో 2,496 యూనిట్లు ఎగుమతి చేయగా, ఈసారి దాదాపు 23 శాతం తగ్గుదల నమోదైంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ మార్పులు అంశాలు ఈ పడిపోవడానికి కారణంగా భావించవచ్చు. అయినప్పటికీ, ఈ ఎగుమతుల తగ్గుదల కంపెనీ మొత్తం పనితీరుపై పెద్దగా ప్రభావం చూపలేదు.
దేశీయ మార్కెట్‌లో వచ్చిన బలమైన రిటైల్ డిమాండ్. ఇండియా మార్కెట్‌లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో, మొత్తం వృద్ధి రేటు 17 శాతంగా స్థిరంగా నిలిచింది. అంటే, దేశీయంగా వచ్చిన ఊపు కంపెనీకి ప్రధాన ఆధారంగా మారింది. ప్రధానంగా ఇన్నోవా హైక్రాస్ భారత మార్కెట్లో ప్రీమియం MPV సెగ్మెంట్‌కు కొత్త స్టాండర్డ్ సెట్ చేసిన మోడల్‌గా నిలిచింది.

స్పేస్, కంఫర్ట్, అడ్వాన్స్ ఫీచర్ల కలయికతో హైక్రాస్ ఇప్పుడు ప్రీమియం MPV కొనాలనుకునే వారికి టాప్ ఛాయిస్‌గా మారుతోంది. ఇదే సమయంలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా టయోటా హైబ్రిడ్ లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. SUV సెగ్మెంట్‌లో మైలేజ్‌తో పాటు పవర్‌ను సమతుల్యం చేస్తూ, హైరైడర్ వినియోగదారుల నుండి మంచి స్పందనను పొందుతోంది. మరోవైపు, ఇన్నోవా క్రిస్టా తన స్థిరమైన పనితీరుతో ఇప్పటికీ మార్కెట్లో బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications