ఇదేం చోద్యం రా నాయనా..5 సీటర్లను పక్కనపెట్టి 7 సీటర్ల వైపు క్యూ కట్టిన జనం..టయోటాకు తిరుగులేదుగా

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా (Toyota) బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. ముఖ్యంగా ఆ బ్రాండ్ నుంచి వచ్చే పెద్ద కార్లు, 7-సీటర్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన 2025 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, భారతీయ కస్టమర్లు టయోటా 5-సీటర్ కార్ల కంటే 7-సీటర్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు టయోటా అమ్మకాల సునామీ ఎలా ఉంది? ఏ కారు ఎన్ని యూనిట్లు అమ్ముడైంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) 2025 డిసెంబర్ నెలను ఘనంగా ముగించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 37.25% వృద్ధిని నమోదు చేస్తూ 34,157 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలలో సింహభాగం టయోటా ఐకానిక్ మోడల్స్ అయిన ఇన్నోవా హైక్రాస్, హైరైడర్ల దే కావడం విశేషం. ఈ రెండు మోడళ్లు కలిపి టయోటా మొత్తం అమ్మకాలలో 42 శాతాన్ని ఆక్రమించాయి. అంటే టయోటా షోరూమ్‌కు వచ్చే ప్రతి పదిమందిలో నలుగురు ఈ రెండు కార్లనే కొంటున్నారు.

Toyota December 2025 Sales 7-Seaters Dominate Over 5-Seaters in India

ఇన్నోవా హైక్రాస్.. నంబర్ వన్ స్థానం

టయోటా లైనప్‌లో ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. డిసెంబర్‌ లో మొత్తం 7,162 యూనిట్లు అమ్ముడై అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత 5-సీటర్ ఎస్‌యూవీ హైరైడర్ (Hyryder) 7,022 యూనిట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే, హైరైడర్ నెలవారీ అమ్మకాల్లో స్వల్పంగా 5 శాతం తగ్గుదల కనిపించగా, హైక్రాస్ మాత్రం దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం భారతీయ కుటుంబాలు ప్రయాణాల్లో సౌకర్యానికి, ఎక్కువ మంది కూర్చునే వెసులుబాటుకు ప్రాధాన్యత ఇవ్వడమే.

చిన్న కార్లలో గ్లాంజా, టైజర్‌ల రచ్చ!

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో గ్లాంజా (Glanza) అనూహ్య వృద్ధిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 85 శాతం గ్రోత్ రేటుతో 6,451 యూనిట్లు అమ్ముడైంది. అలాగే, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న టైజర్ (Taisor) కూడా 4,457 యూనిట్లతో అదరగొట్టింది. నవంబర్ నెలతో పోలిస్తే టైజర్ అమ్మకాలు 40 శాతం పెరగడం విశేషం. ఇది యువతను బాగా ఆకట్టు కుంటోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Toyota December 2025 Sales 7-Seaters Dominate Over 5-Seaters in India

లగ్జరీ సెగ్మెంట్‌లో వెల్‌ఫైర్ మ్యాజిక్

భారీ ధర ఉన్నప్పటికీ వెల్‌ఫైర్ (Vellfire) అమ్మకాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ లగ్జరీ ఎంపీవీ ఏకంగా 123 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 141 యూనిట్లు అమ్ముడైంది. ఇక ఎస్‌యూవీ రారాజు ఫార్చ్యూనర్ (Fortuner) 2,961 యూనిట్లతో తన పట్టును నిలబెట్టుకుంది.

కివీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా ఫార్చ్యూనర్ వాడుతున్నారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు కొంచెం తగ్గినప్పటికీ, ఎర్టిగా రీ బ్యాడ్జ్ వెర్షన్ అయిన రూమియన్ (Rumion) 2,727 యూనిట్లతో తన సత్తా చాటింది. టయోటా హైలక్స్, కామ్రీ మోడళ్లు కూడా గౌరవప్రదమైన అమ్మకాలను నమోదు చేశాయి. టయోటా ఈ భారీ అమ్మకాలు చూస్తుంటే, భారతీయ కస్టమర్లు నాణ్యతకు, రీసేల్ వాల్యూకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది

More from DriveSpark

Article Published On: Sunday, January 18, 2026, 7:38 [IST]
English summary
Toyota december 2025 sales 7 seaters dominate over 5 seaters in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+