సంబరాల్లో మునిగితేలుతున్న డీలర్లు.. సేల్స్ కౌంటర్ల వద్ద క్యూకట్టిన కస్టమర్లు! 4 లక్షలు దాటి కొత్త రికార్డ్!
ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్ కార్పోరేషన్ (Toyota Motor Corporation) భారత కార్ల మార్కెట్‌లో దాదాపు 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రయాణం మొదట్లో అంత సులభం కాదు. భారతీయ వినియోగదారుల అభిరుచులు, ధరలపై సున్నితత్వం, స్థానిక పోటీదారుల బలమైన స్థానం కారణంగా టయోటా తన స్థిరమైన పట్టు సాధించడానికి కొంత సమయం తీసుకుంది. కానీ కాలక్రమేణా వ్యూహాలను మార్చుకుంటూ మెల్లగా తన స్థాయిని బలోపేతం చేసుకుంది. ఈ విజయానికి కీలక పాత్ర పోషించినది టీకెంఎమ్ (Toyota Kirloskar Motor). జపాన్‌కు చెందిన టయోటా మోటార్, భారతదేశానికి చెందిన కిర్లోస్కర్ సిస్టమ్స్ మధ్య ఏర్పడిన సంయుక్త సంస్థ, భారత మార్కెట్‌కు సరిపోయే విధంగా ఉత్పత్తులు, వ్యూహాలను అమలు చేసింది.
ఫలితంగా, ప్రారంభంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, టయోటా ఇప్పుడు భారత మార్కెట్‌లో ఒక బలమైన, విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచింది. ఇటీవలి సంవత్సరాల్లో టయోటా అమ్మకాలలో కనిపిస్తున్న పెరుగుదల, ఈ మార్పుకు స్పష్టమైన సూచిక. ముఖ్యంగా 31 మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రదర్శించిన పనితీరు గమనించదగ్గది. ఈ కాలంలో దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల్లో కూడా మంచి వృద్ధి సాధించింది.

తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, మొత్తంగా 4 లక్షలకు పైగా వాహనాలను విక్రయించడం కంపెనీకి ఒక కీలక మైలురాయి. ఇది కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాదు, భారత మార్కెట్‌లో టయోటా సాధించిన స్థిరత్వం, వినియోగదారుల విశ్వాసానికి ప్రతిబింబం. టయోటా విజయానికి మరో ముఖ్య కారణం ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చులు, హైబ్రిడ్ టెక్నాలజీపై దృష్టి పెట్టడం ద్వారా టయోటా భవిష్యత్తు మొబిలిటీ దిశగా కూడా ముందడుగు వేసింది.
2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు జరిగిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,06,081 కార్లను రవాణా చేయడం ద్వారా టయోటా గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (FY2025)లో విక్రయించిన 3,37,148 యూనిట్లతో పోలిస్తే ఇది సుమారు 20 శాతం వృద్ధి. ఈ మొత్తంలో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కూడా టయోటా బలమైన ప్రస్థానాన్ని చూపిస్తున్నాయి.

మొత్తం 4,06,081 యూనిట్లలో 3,67,107 కార్లు భారతదేశంలోనే విక్రయించబడటం, స్థానిక మార్కెట్‌లో టయోటాకు ఉన్న విశ్వసనీయతను తెలియజేస్తోంది. అదే సమయంలో, 38,974 కార్లు భారత్‌లో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం, 'మేక్ ఇన్ ఇండియా' దిశగా కంపెనీ చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తోంది. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు టయోటా మొత్తం 27,640 కార్లను విదేశాలకు ఎగుమతి చేయగా, భారతదేశంలో 3,09,508 కార్లను విక్రయించింది.
గత ఏడాదితో పోలిస్తే టయోటా ఎగుమతుల్లో 41 శాతం వృద్ధి నమోదు కావడం. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశంలో తయారైన టయోటా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. అదే సమయంలో దేశీయ అమ్మకాలు 19 శాతం పెరగడం విశేషం. ఇక మార్చి 2026 నెల విషయానికి వస్తే, దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కలిపి మొత్తం 37,194 యూనిట్లు అమ్ముడవడం, ఈ నెలను టయోటాకు మరొక విజయవంతమైన దశగా నిలబెట్టింది.

గత ఏడాది ఇదే కాలంలో మొత్తం 30,043 కార్లు మాత్రమే అమ్ముడవగా, ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. ఇది కేవలం ఒక నెలలో వచ్చిన పెరుగుదల మాత్రమే కాకుండా, టయోటా భారత మార్కెట్‌లో క్రమంగా బలోపేతం అవుతున్నదనే స్పష్టమైన సంకేతం. మొత్తం మీద చూస్తే, దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండింటిలోనూ సమతుల్య వృద్ధి సాధించడం ద్వారా టయోటా తన దూకుడును కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications








