తూచ్ అవన్నీ వట్టి పుకార్లే.. సోషల్ మీడియాలో ఇన్నోవా క్రిస్టా గురించి వస్తున్న వార్తలో నిజం లేదు

భారతదేశంలో టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసే వారు, టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ఈ ఎమ్‌పీవీ (MPV) డీజిల్ వేరియంట్‌ను ఎంతో నమ్ముకుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా దేశంలో రాబోతున్న కఠినమైన కాలుష్య నిబంధనల (Emission Norms) కారణంగా టయోటా కంపెనీ ఈ ఐకానిక్ మోడల్‌ను ఎప్పటికీ నిలిపివేయబోతోందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలు ఇన్నోవా లవర్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేయగా, తాజాగా టయోటా కంపెనీ స్వయంగా స్పందించి ఈ పుకార్లకు చెక్ పెట్టింది.

అఫీషియల్ ఇంటర్వ్యూతో క్లారిటీ ఇచ్చిన కంపెనీ హెడ్
ఈ సస్పెన్స్ కు తెరదించుతూటయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంట్రీ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటి ఒక ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో అసలు నిజం వెల్లడించారు. ఇన్నోవా క్రిస్టా ఉత్పత్తిని నిలిపివేయడం, డీజిల్ ఇంజిన్‌లను పూర్తిగా బంద్ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. మార్కెట్లో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, క్రిస్టాను బంద్ చేసే ఆలోచన కంపెనీకి అస్సలు లేదని ఆయన క్లియర్ గా ప్రకటించారు.

Toyota Innova Crysta is NOT Discontinuing Company Clarifies Future Plan for Diesel MPV

భారతదేశంలో డీజిల్ కార్లకు తగ్గని క్రేజ్
భారత మార్కెట్లో డీజిల్ వాహనాల ప్రాముఖ్యత గురించి విక్రమ్ గులాటి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు. దేశంలో ఇప్పటికీ డీజిల్ కార్లకు చాలా బలమైన డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ, ప్రతి నెలా లాంగ్ జర్నీలు చేసే వారికి, వాహనంలో పవర్‌ఫుల్ టాప్ టార్క్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆశించే వారికి డీజిల్ కార్లు ఒక అనివార్యమైన అవసరమని చెప్పారు. కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే కావాలని కోరుకునే ప్రత్యేక కస్టమర్ బేస్డ్ టయోటాకు ఉందని, అందువల్ల క్రిస్టాను రీప్లేస్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

డీజిల్ ఇంజిన్లపై ఉన్న అపోహలు ఇవే
సాధారణంగా పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలతో పోలిస్తే డీజిల్ కార్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయనే ఒక గట్టి అపోహ మార్కెట్లో ఉంది. ఈ తప్పుడు భావనను కూడా గులాటి క్లియర్ గా తుడిచిపెట్టారు. దేశంలో బీఎస్6 (BS6) ఎమిషన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత సరికొత్త టెక్నాలజీ సహాయంతో డీజిల్ కార్లు కూడా పెట్రోల్ లేదా సీఎన్‌జీ కార్లంతే స్వచ్ఛంగా, పర్యావరణహితంగా మారాయని ఆయన గుర్తుచేశారు. కాలుష్యం పరంగా ఇప్పుడు అన్నీ సమానమేనని, పైగా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ మైలేజ్, మెరుగైన లైఫ్ ఇస్తాయని తెలిపారు.

Toyota Innova Crysta is NOT Discontinuing Company Clarifies Future Plan for Diesel MPV

టయోటా భవిష్యత్తు వ్యూహం, మల్టీ-ఫ్యూయల్ విజన్
దేశంలోని చాలా పెద్ద పెద్ద కార్ల తయారీ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియో నుంచి డీజిల్ కార్లను పూర్తిగా తొలగించి కేవలం పెట్రోల్, ఈవీ వైపు వెళ్తున్న తరుణంలో టయోటా తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. టయోటా ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. టయోటా ప్రస్తుతం కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా ఫ్లెక్స్-ఫ్యూయల్, హైబ్రిడ్, హైడ్రోజన్ టెక్నాలజీలపై కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారతీయ ఆటోమొబైల్ భవిష్యత్తు కేవలం ఒకే రకమైన ఇంధనంపై కాకుండా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ,హైబ్రిడ్ లతో కూడిన మల్టీ-ఫ్యూయల్ వ్యవస్థగా ఉంటుందని టయోటా గట్టిగా నమ్ముతోంది.

Article Published On: Wednesday, June 24, 2026, 10:30 [IST]
English summary
Toyota innova crysta is not discontinuing company clarifies future plan for diesel mpv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+