ఈ కారుకే పట్టాభిషేకం.. 23.24 కి.మీ మైలేజీ ఇచ్చే భారీ 7 సీటర్.. హైబ్రిడ్ కార్లలో ఇదే కింగ్!

భారతదేశంలో మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు టయోటా ఇన్నోవానే. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, ట్రావెల్ ఆపరేటర్లు, కార్పొరేట్ వర్గాలు ఇలా ప్రతి సెగ్మెంట్‌లోనూ ఇన్నోవా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బలమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరు, విశాలమైన క్యాబిన్, దీర్ఘకాలిక నమ్మకం ఇవన్నీ కలిసి ఇన్నోవాను భారత మార్కెట్లో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మార్చాయి. అందుకే MPV మార్కెట్లో ఇప్పటికీ టయోటా ఇన్నోవా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ MPV రెండు ప్రధాన రూపాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఒకటి ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) కాగా, మరొకటి సంప్రదాయ డీజిల్ పవర్‌తో కొనసాగుతున్న ఇన్నోవా క్రిస్టా (Innova Crysta).

ఈ రెండు వేరియంట్లు కూడా వేర్వేరు రకాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్మకాల గణాంకాలు చూసినప్పుడు, ఈ రెండు మోడళ్ల మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా మారిందో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్ విక్రయాలు భారీగా పెరగడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో టయోటా మొత్తం 52,604 ఇన్నోవా హైక్రాస్ యూనిట్లను విక్రయించింది.

Toyota Innova Hycross Sales Rise Shows Growing Hybrid Trend Full Details

అదే సమయంలో ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు 27,672 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంటే హైక్రాస్ అమ్మకాలు దాదాపు క్రిస్టా కంటే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం భారతీయ ప్రీమియం కార్ మార్కెట్లో హైబ్రిడ్ టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణ. పెట్రోల్ ధరలు పెరుగుతుండటం, పర్యావరణంపై అవగాహన పెరగడం, మంచి మైలేజీపై వినియోగదారుల ఆసక్తి పెరగడం వంటి అంశాలు హైబ్రిడ్ వాహనాల వైపు ప్రజలను మళ్లిస్తున్నాయి.

ఈ విషయంలో టయోటా హైబ్రిడ్ టెక్నాలజీపై వినియోగదారుల్లో ఇప్పటికే మంచి నమ్మకాన్ని సంపాదించుకుంది. అందుకే ఇన్నోవా హైక్రాస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. హైక్రాస్‌లో అందిస్తున్న ప్రీమియం డిజైన్, విశాలమైన ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, క్రిస్టా మాత్రం ఇప్పటికీ బలమైన డీజిల్ MPV కోసం చూస్తున్న వారిలో మంచి క్రేజ్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, టూరిజం, కమర్షియల్ వినియోగదారులు ఇప్పటికీ క్రిస్టాపై నమ్మకం ఉంచుతున్నారు.

Toyota Innova Hycross Sales Rise Shows Growing Hybrid Trend Full Details

ప్రస్తుతం మొత్తం ఇన్నోవా అమ్మకాలలో హైక్రాస్ వాటా ఏకంగా 65.5 శాతానికి చేరుకోవడం విశేషం. అంటే ప్రతి మూడు ఇన్నోవా కార్లలో దాదాపు రెండు హైక్రాస్ మోడళ్లే అమ్ముడవుతున్నాయని చెప్పాలి. హైక్రాస్‌కు వస్తున్న ఆదరణకు ప్రధాన కారణం దీని హైబ్రిడ్ సిస్టమ్. సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోలిస్తే హైబ్రిడ్ సిస్టమ్‌తో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గడం వినియోగదారులను బలంగా ఆకట్టుకుంటోంది.

టయోటా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ MPV లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇంత పెద్ద సైజ్ ఉన్న 7-సీటర్ వాహనంలో ఈ స్థాయి ఇంధన రావడం నిజంగా విశేషమే. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశంలో హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం ఆటో రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వృద్ధిలో ఇన్నోవా హైక్రాస్ కీలక పాత్ర పోషించిందని మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.

Toyota Innova Hycross Sales Rise Shows Growing Hybrid Trend Full Details

ఇన్నోవా హైక్రాస్ విస్తృతమైన ధర శ్రేణితో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 18.48 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్లకు వెళ్తే రూ. 31.30 లక్షల వరకు చేరుతుంది. మొత్తానికి, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు కేవలం ఒక MPV మాత్రమే కాదు, భారతీయ ప్రీమియం కుటుంబ కార్ల మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న మోడల్‌గా మారింది.

Article Published On: Thursday, May 7, 2026, 13:05 [IST]
English summary
Toyota innova hycross sales rise shows growing hybrid trend full details
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+