కోట్లు పోసి కొన్న టయోటా ల్యాండ్ క్రూయిజర్‌కు షాక్.. గ్యారేజీకి పంపమని కస్టమర్లకు కంపెనీ పిలుపు!
ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరుగాంచిన టయోటా (Toyota) కంపెనీకి చెందిన ఒక లగ్జరీ ఎస్‌యూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన పటిష్టమైన నిర్మాణం, మొండితనంతో ఆఫ్-రోడింగ్ కింగ్ అని పిలవబడేటయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Land Cruiser 300) వాహనాలను కంపెనీ వెనక్కి పిలిపిస్తోంది (Recall). కోట్ల రూపాయలు పోసి కొన్న ఈ కారులో టెక్నికల్ లోపం తలెత్తడం ఇప్పుడు వాహన రంగంలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
ఏమిటా సమస్య? ఎందుకు ఈ రీకాల్?
భారతదేశంలో విక్రయించిన దాదాపు 969 యూనిట్ల ల్యాండ్ క్రూయిజర్ 300 ఎస్‌యూవీలను టయోటా కిర్లోస్కర్ మోటార్ వెనక్కి పిలిపిస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో తయారైన వాహనాల్లో ఈ లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ప్రధానంగా ఈ ఎస్‌యూవీలోని 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నిర్వహణను చూసుకునే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లో లోపం తలెత్తింది.

దీని వల్ల గేర్లు మారే సమయంలో ఇబ్బందులు కలగడం లేదా వాహనం పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం టయోటా మాత్రమే కాకుండా, ఇదే ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ వాడుతున్న లెక్సస్ LX ఎస్‌యూవీలను కూడా కంపెనీ రీకాల్ చేసింది. అయితే ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే సరిచేసి ఇస్తుందని, కస్టమర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
ఎస్‌యూవీలకే బాస్
టయొటా ల్యాండ్ క్రూయిజర్ అంటే కేవలం ఒక కారు మాత్రమే కాదు, అదొక హోదా. దీని ధర వింటేనే సామాన్యులు షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ కారు రూ.2.31 కోట్ల నుంచి రూ.2.41 కోట్ల వరకు (ఎక్స్-షోరూమ్) ధర పలుకుతోంది. ఇంత ధర ఉన్నప్పటికీ, ఈ కారును కొనడానికి దేశంలోని సంపన్నులు, సెలబ్రిటీలు క్యూ కడుతుంటారు. ఇది విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే (CBU) మోడల్ కావడం దీనికి ఉన్న డిమాండ్‌కు ఒక కారణం.

పవర్ ప్యాక్డ్ ఇంజిన్.. అదిరే పెర్ఫార్మెన్స్
ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన 3.3 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V6 డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 304 bhp పవర్‌ను, 1,600-2,600 ఆర్‌పీఎమ్ వద్ద 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎలాంటి కొండలనైనా, బురద ప్రాంతాలనైనా ఇది సునాయాసంగా దాటగలదు. దీనికి తోడు 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఫుల్ టైమ్ 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) సిస్టమ్ రైడర్‌కు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.టయోటా ప్రసిద్ధ TNGA-F ప్లాట్‌ఫారమ్‌పై దీనిని నిర్మించారు. ఇది వాహనం బరువును తగ్గించడమే కాకుండా గట్టిదనాన్ని పెంచుతుంది.
లగ్జరీ ఇంటీరియర్, హై-టెక్ ఫీచర్లు
లోపలికి అడుగుపెడితే ఇది ఒక విలాసవంతమైన భవనాన్ని తలపిస్తుంది. ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో ఇంటీరియర్ నిండిపోయింది.
ఇన్ఫోటైన్‌మెంట్: 12.3 అంగుళాల (31.24 సెం.మీ) భారీ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం.
ఆడియో: 14-స్పీకర్ల జేబీఎల్ (JBL) ప్రీమియం ఆడియో సిస్టమ్.

కంఫర్ట్: ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు.
టెక్నాలజీ:టయోటా ఐ-కనెక్ట్ టెలిమాటిక్స్ సిస్టమ్ ద్వారా రిమోట్ లాక్/అన్‌లాక్, లైవ్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు.
సేఫ్టీలో పెట్టని కోట
రక్షణ విషయంలోటయోటా ఎక్కడా రాజీ పడలేదు. ఇందులోటయోటా సేఫ్టీ సెన్స్ 3.0 అనే ADAS టెక్నాలజీని అందించారు.
ప్రీ-కొలిషన్ సిస్టమ్ (PCS): ప్రమాదాలను ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది.
లేన్ డిపార్చర్ అలర్ట్: కారు దారి తప్పుతుంటే హెచ్చరిస్తుంది.
డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్: ముందర వెళ్లే వాహనాల వేగానికి అనుగుణంగా వేగాన్ని అడ్జస్ట్ చేస్తుంది.
ఎయిర్‌బ్యాగ్‌లు: ప్రయాణీకుల రక్షణ కోసం ఏకంగా 10 SRS ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
360-డిగ్రీ కెమెరా: పార్కింగ్, ఇరుకైన సందుల్లో వెళ్లేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.
టయొటా ల్యాండ్ క్రూయిజర్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. మరి ఇంతటి భారీ ఎస్‌యూవీలో ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ లోపాలు సహజమని కొందరు అంటుంటే, కోట్లు ఖరీదు చేసే కారులో ఇలాంటివి రాకూడదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా సమస్యను గుర్తించి వెంటనే రీకాల్ ప్రకటించడం ద్వారాటయోటా తన కస్టమర్ల సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి నిరూపించుకుంది.


Click it and Unblock the Notifications








