ఈ కారు కొన్నాక బస్సులు, రైళ్లు అన్నీ మర్చిపోతున్నారు.. ఎలాంటి టికెట్లు లేకుండా మొత్తం ఫ్యామిలీ వెళ్లొచ్చు
ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో నాణ్యత, నమ్మకం, దీర్ఘకాలిక పనితీరు వంటి అంశాలకు ప్రతీకగా నిలిచిన టయోటా (Toyota) బ్రాండ్‌కు భారత మార్కెట్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు అనువైన కార్ల విషయంలో టయోటా పేరు వినగానే చాలా మంది వినియోగదారుల్లో ఒక నమ్మకం కనిపిస్తుంది. అదే నమ్మకాన్ని మరింత బలపరుస్తూ భారత మార్కెట్లో ప్రవేశించిన రూమియన్ (Rumion) ఇప్పుడు ఫ్యామిలీ MPV సెగ్మెంట్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకుంటోంది. భారతదేశంలో ఇప్పటికే భారీ డిమాండ్ కలిగిన Maruti Suzuki Ertiga ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ రూమియన్, రీబ్యాడ్జ్ మోడల్ అయినప్పటికీ కేవలం "ఇంకో ఎర్టిగా"గా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది.
టయోటా బ్రాండ్ నమ్మకం, అలాగే కుటుంబాలకు అనువైన విశాలమైన క్యాబిన్ కారణంగా ఈ MPVకి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా రూమియన్‌కు మార్కెట్లో ఉన్న స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో ఈ MPV మొత్తం 2,585 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2,462 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు మెరుగయ్యాయి.

అంటే సంవత్సర ప్రాతిపదికన చూస్తే 123 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదవగా, శాతంగా ఇది సుమారు 5 శాతం వృద్ధి. ప్రస్తుతం భారత మార్కెట్లో కుటుంబ వినియోగానికి అనువైన 7-సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రూమియన్ వంటి మోడళ్లకు మరింత ఆదరణ లభిస్తోంది. మంచి మైలేజ్, విశాలమైన ఇంటీరియర్, తక్కువ నిర్వహణ ఖర్చు, అలాగే టయోటా బ్రాండ్ నమ్మకం కలిసి ఈ MPVని వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి.
టయోటా రూమియన్ రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించేందుకు సరిపోయే విశాలమైన సీటింగ్ అమరికతో రూపొందించబడింది. ఫ్యామిలీ యూజ్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఈ MPV, స్పేస్, కంఫర్ట్, ప్రాక్టికాలిటీకి మంచి ప్రాధాన్యం ఇస్తుంది. ధర విషయానికి వస్తే, రూమియన్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.55 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌లో రూ.13.86 లక్షల వరకు ఉంటుంది.

ఈ ధర పరిధి కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 102 bhp శక్తిని మరియు 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విశ్వసనీయమైన పనితీరు, స్మూత్ డ్రైవింగ్ అనుభూతి ఇవ్వడం దీని ప్రధాన ప్రత్యేకత.
డ్రైవింగ్ సౌలభ్యం కోసం 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్‌లో సుమారు 20.11 kmpl, ఆటోమేటిక్ వేరియంట్‌లో 20.51 kmpl వరకు ఇంధన సామర్థ్యం లభిస్తుంది. ఇక పెరుగుతున్న ఇంధన ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ CNG బై-ఫ్యూయల్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.

CNG మోడ్‌లో పవర్ కొంత తగ్గినా, సుమారు 26.11 km/kg వరకు మైలేజ్ అందించడం ఈ MPVను మరింత ఆర్థికంగా ఉపయోగపడే వాహనంగా మార్చుతోంది. ఈ కారు చూడటానికి అచ్చం ఏనుగు సైజులో ఉంటుంది. కారులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన ఫీచర్స్ కూడా టయోటా రూమియన్‌లో అందించడం జరిగింది.


Click it and Unblock the Notifications