ఏనుగు సైజులో ఉంటుంది.. చీమలా ఫ్యూయల్ తాగుతుంది.. మార్కెట్లో దూకుడు మాత్రం సింహంలా!
7-సీటర్ ఫ్యామిలీ కార్ల విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, టయోటా రూమియన్ (Toyota Rumion) తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. జూన్ 2026లో విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ ఎంపీవీ 2,376 యూనిట్లు విక్రయించి మరోసారి మార్కెట్లో తన సత్తా చాటింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,415 యూనిట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 67.9 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. ఈ అమ్మకాల గణాంకాలు భారతీయ కుటుంబాలు 7-సీటర్ వాహనాల వైపు మరింత ఆసక్తి చూపుతున్నారని వెల్లడిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన మెరుగైన వృద్ధి సాధించడంతో టయోటా బ్రాండ్ సంతోషంలో మునిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో సేల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవానికి రూమియన్, మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా రూపొందించిన మోడల్ అయినప్పటికీ, టయోటా తన ప్రత్యేక ఫ్రంట్ డిజైన్, బ్రాండ్ నమ్మకం, విశ్వసనీయ సర్వీస్ నెట్‌వర్క్‌తో దీనికి భిన్నమైన గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే ఇది కేవలం రీ-బ్యాడ్జ్ కారుగా మాత్రమే కాకుండా, టయోటా బ్రాండ్‌ను కోరుకునే కుటుంబాలకు బాగా నచ్చింది. తాజాగా నమోదైన అమ్మకాల వృద్ధి కూడా మార్కెట్లో ఈ ఎంపీవీకి లభిస్తున్న బలమైన ఆదరణను తెలియజేస్తుంది.

ఈ కారులో 7 మంది హాయిగా కూర్చోని ప్రయాణించగలరు. తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కలిసి వెళ్లడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ ఒక్క కారు కొనుగోలు చేసినట్లయితే, బస్సులు, రైళ్లు, ఆటోలు మీకు అవసరం ఉండదు. జాతర్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లు, విహరయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్లడానికి దీనిలో అందించిన సీటింగ్ సరిపోతుంది. అలాగే, మీ సామాన్లు పెట్టడానికి తగినంత బూట్ స్పెస్ కూడా దీనిలో లభిస్తుంది.
దీని ధర, ఇంజిన్ గురించి చూసినట్లయితే, రూమియన్ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే 7 సీటర్ ఎంపీవీల్లో ఒకటి. బేస్ వేరియంట్ ధర రూ. 9.55 లక్షల నుంచి టాప్-ఎండ్ వేరియంట్ రూ. 13.86 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరలో మంచి క్యాబిన్, ఏడుగురు ప్రయాణించే సీటింగ్ లేఅవుట్, టయోటా బ్రాండ్ నమ్మకం, అవసరమైన ఫీచర్లు ఒకే కారులో లభించడం రూమియన్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే, రూమియన్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ మంచి పనితీరును ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు జతగా రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌లను అందిస్తోంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. దీంతో కొత్త డ్రైవర్లు నుంచి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ సరైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మైలేజ్ విషయంలో కూడా రూమియన్ నిరాశపరచదు. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.11 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగా, ఆటోమేటిక్ వేరియంట్ 20.51 కిలోమీటర్ల వరకు ఇవ్వడం దీని ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఆటోమేటిక్ కార్లలో మైలేజ్ కొంత తగ్గుతుందని భావిస్తారు. కానీ రూమియన్ విషయంలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా మంచి మైలేజ్ అందించడం విశేషం.

అంతేకాకుండా, ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, CNG వేరియంట్ కిలోకు 26.11 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. కుటుంబ ప్రయాణాలతో పాటు ట్యాక్సి లాగా నడపుకోవడానికి కమర్షియల్ అవసరాల కోసం ఈ వేరియంట్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే టయోటా బ్రాండ్ విలువను పెంచడానికి రూమియన్ ప్రస్తుతం 7-సీటర్ ఎంపీవీ విభాగంలో బలమైన పోటీదారుగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications