ఈ కారు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి...టెస్టులో ఘోరంగా ఫెయిల్

భారత మార్కెట్లో టయోటా అంటేనే నమ్మకం, భద్రత అని చాలామంది భావిస్తారు. కానీ ఇప్పుడు అదే కంపెనీకి చెందిన ఒక కారు క్రాష్ టెస్టులో దారుణంగా విఫలమవడం ఆటో రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద ఎత్తున అమ్ముడవుతున్న ఈ కారు అడల్ట్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సాధించడం వినియోగదారులను షాక్‌కు గురిచేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కార్ల భద్రతను పరీక్షించే గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన తాజా క్రాష్ టెస్టులో టయోటా స్టార్‌లెట్ కారు తీవ్ర నిరాశ కలిగించింది. పెద్దల భద్రత విషయంలో ఈ కారుకు ఏకంగా జీరో స్టార్ రేటింగ్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ కారు భారతదేశంలో అమ్ముడవుతున్న మారుతి బలెనో ఆధారంగా తయారవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది.

toyota starlet crash test zero star rating global ncap safety report telugu

మన దేశంలో ఇదే కారు మరో పేరుతో అమ్మకం
దక్షిణాఫ్రికా మార్కెట్‌లో స్టార్‌లెట్ పేరుతో విక్రయిస్తున్న ఈ కారు.. భారతదేశంలో మాత్రం టయోటా గ్లాంజా పేరుతో అమ్ముడవుతోంది. మారుతి సుజుకితో భాగస్వామ్యంలో టయోటా ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. బయట డిజైన్‌లో చిన్న మార్పులు తప్పితే, లోపలి నిర్మాణం బాలెనోతో చాలా వరకు ఒకేలా ఉంటుంది.

ఎక్కడ తేలిపోయిందంటే..
క్రాష్ టెస్టులో కారు బాడీ షెల్, ఫుట్‌వెల్ ప్రాంతం బలహీనంగా ఉన్నట్టు గ్లోబల్ ఎన్‌క్యాప్ వెల్లడించింది. ముందు నుంచి ఢీకొన్న సమయంలో డ్రైవర్, ప్యాసింజర్ ఛాతీ రక్షణ సరాసరి స్థాయిలో మాత్రమే ఉండగా.. మోకాళ్ల రక్షణ మాత్రం ప్రమాదకరంగా ఉందని తెలిపింది. డ్యాష్‌బోర్డ్ వెనుక భాగంలోని కఠిన నిర్మాణాలు గాయాలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

సైడ్ ఇంపాక్ట్‌లో మరింత ప్రమాదం
పక్క నుంచి జరిగిన ఢీకొట్టే పరీక్షల్లో పరిస్థితి ఇంకా దారుణంగా కనిపించింది. ముఖ్యంగా తల, ఛాతీ రక్షణ చాలా బలహీనంగా నమోదైంది. ఈ వాహనంలో సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ లేకపోవడం కూడా పెద్ద మైనస్‌గా మారింది. అందుకే సైడ్ పోల్ఇంపాక్ట్ టెస్ట్ కూడా నిర్వహించలేదని సమాచారం.

toyota starlet crash test zero star rating global ncap safety report telugu

పిల్లల భద్రతలో మాత్రం కాస్త మెరుగైన ఫలితం
పిల్లల రక్షణ విభాగంలో ఈ కారుకు మూడు స్టార్ రేటింగ్ లభించింది. అయితే చిన్నారి డమ్మీ తల కారు లోపలి భాగాలకు తగలడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. మొత్తం 49 మార్కులకు గాను 29.33 పాయింట్లు మాత్రమే రావడం గమనార్హం.

కొత్త వెర్షన్‌లో అదనపు సేఫ్టీ ఫీచర్లు
ఈ ఫలితాల తర్వాత టయోటా కంపెనీ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో అదనపు భద్రతా ఫీచర్లు జోడించినట్టు సమాచారం. సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను చేర్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ కొత్త మోడల్‌పై మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

కారు కొనేటప్పుడు లుక్ కాదు.. సేఫ్టీ ముఖ్యం
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా మైలేజ్, ఫీచర్లు, లుక్ మాత్రమే చూస్తున్నారు. కానీ తాజా క్రాష్ టెస్ట్ ఫలితాలు చూసిన తర్వాత భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో ప్రయాణించే వారు కచ్చితంగా ఎన్‌క్యాప్ రేటింగ్ పరిశీలించిన తర్వాతే కారు కొనాలని సూచిస్తున్నారు.

Article Published On: Wednesday, May 13, 2026, 17:13 [IST]
English summary
Toyota starlet crash test zero star rating global ncap safety report telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+