రూ.7.21 లక్షలకే 29కిమీ మైలేజ్ ఇచ్చే SUV..దీనికోసం షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్న జనం
టయోటా అంటేనే నమ్మకానికి మారుపేరు. క్వాలిస్ నుంచి ఫార్చ్యూనర్ వరకు ఎన్నో ఐకానిక్ కార్లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు బడ్జెట్ కార్ల విభాగంలోనూ దుమ్మురేపుతోంది. మరీ ముఖ్యంగా మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా వచ్చిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్(Toyota Taisor) అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.7.21 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారుకు జనం ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ.
భారతీయ రోడ్లపై టయోటా లోగో కనిపిస్తే చాలు, ఆ కారుపై కస్టమర్లకు ఒక రకమైన భరోసా ఉంటుంది. ఒకప్పుడు కేవలం ఖరీదైన కార్లకే పరిమితమైన టయోటా, ఇప్పుడు మారుతి సుజుకి భాగస్వామ్యంతో సామాన్యుడి బడ్జెట్‌లోనూ కార్లను అందిస్తోంది.

బలేనోను గ్లాంజాగా, ఎర్టిగాను రూమియన్గా మార్చినట్లే, మారుతి ఫ్రాంక్స్‌ను టైజర్ పేరుతో రీ-బ్యాడ్జ్ చేసి విపణిలోకి తెచ్చింది. 2025 డిసెంబర్ నెలలో టొయోటా ఏకంగా 34,159 కార్లను అమ్మి రికార్డు సృష్టించగా, అందులో టైజర్ వాటా చాలా కీలకంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే టైజర్ అమ్మకాలు ఏకంగా 70 శాతం పెరగడం విశేషం.
భారతీయులు కారు కొనేటప్పుడు ముందుగా అడిగే ప్రశ్న మైలేజ్ ఎంత?. టైజర్ విషయంలో ఆ చింతే అక్కర్లేదు. ఇందులో మారుతికి చెందిన నమ్మకమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే పవర్‌ఫుల్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
పెట్రోల్ వెర్షన్లు లీటరుకు సుమారు 21.5 నుంచి 22.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఇక పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి సిఎన్జీ మోడల్ కూడా ఉంది. ఇది కేజీ గ్యాస్‌కు ఏకంగా 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుంది.

ఇటీవలి కాలంలో కస్టమర్లు సేఫ్టీకి పెద్దపీట వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టయోటా తన టైజర్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డుగా చేర్చింది.
అది బేస్ మోడల్ అయినా, టాప్ ఎండ్ మోడల్ అయినా ఆరు ఎయిర్‌బ్యాగులు ఉండటం వల్ల ప్రయాణికులకు పూర్తి రక్షణ లభిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగులు ఇందులో ఉన్నాయి. ఈ నిర్ణయమే టైజర్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
టైజర్ కారు బయట నుంచి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. టయోటా సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్‌లు, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ దీనికి కొత్త రూపాన్ని ఇచ్చాయి.
లోపల కూడా 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంటే తక్కువ ధరలో ఒక లగ్జరీ కారులో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను టొయోటా ఇందులో పొందుపరిచింది.
టయోటా తన కస్టమర్ల కోసం 3 సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వారెంటీని ఇస్తోంది. దీనిని 5 ఏళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎక్స్‌ప్రెస్ మెయింటెనెన్స్ వంటి సేవలతో కస్టమర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రూ.7.21 లక్షల నుంచి రూ. 12.06 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తున్న ఈ కారు, ఎస్‌యూవీ కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఒక అద్భుతమైన ఆప్షన్.


Click it and Unblock the Notifications








