సింగిల్ చార్జ్‌తో 543 కిమీ మైలేజ్.. మార్కెట్లోకి వచ్చిన మొదటి నెలలోనే దుమ్మురేపిన ఈబెల్లా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), తన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. టయోటా భారతీయ పోర్ట్‌ఫోలియోలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా టయోటా అర్బన్ క్రూజర్ ఈబెల్లా (Toyota Urban Cruiser Ebella)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారును మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్‌పై ఉమ్మడిగా సిద్ధం చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సరికొత్త ఎస్‌యూవీ డెలివరీలను కూడా అధికారికంగా ప్రారంభించేసింది.

మొదటి నెలలోనే సాలిడ్ బోణీ
ఈబెల్లా ఈవీ అమ్మకాల పరంగా మార్కెట్లో మంచి బోణీ కొట్టింది. మే 2026 నెలలో కంపెనీ 45 యూనిట్ల ఫ్యాక్టరీ డిస్పాచ్‌తో తన హోల్‌సేల్ అమ్మకాలను విజయవంతంగా ప్రారంభించింది. మే 2026లో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశవ్యాప్తంగా మొత్తం 30,560 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా (గతేడాదితో పోలిస్తే 4.55 శాతం వృద్ధి), అందులో కొత్తగా వచ్చిన ఈబెల్లా కారు 0.14 శాతం వాటాను సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పుంజుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

toyota urban cruiser ebella electric suv launched india price range features news

ధరలు, వేరియంట్ల వివరాలు
టయోటా ఈబెల్లా కారును మొత్తం మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అవి E1, E2, E3 వేరియంట్లు. ప్రస్తుతం కంపెనీ ఇందులో టాప్ ఎండ్ వెర్షన్ అయిన E3 వేరియంట్ ధరను మాత్రమే అధికారికంగా ప్రకటించింది. 61kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ హై-ఎండ్ వేరియంట్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ.23.60 లక్షలుగా నిర్ణయించారు. దీనికి పోటీగా ఉన్న మారుతి ఈ-విటారా ప్రారంభ ధర మార్కెట్లో రూ.15.99 లక్షలుగా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం.. మైండ్ బ్లోయింగ్ రేంజ్
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు రకాల ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) బ్యాటరీ ఆప్షన్లను కస్టమర్ల కోసం అందించనున్నారు. మొదటిది 49 kWh బ్యాటరీ ప్యాక్, ఇది సుమారు 142 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక రెండవది పెద్దదైన 61 kWh బ్యాటరీ ప్యాక్, ఇది 171.5 bhp పవర్‌ను, 189 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెద్ద బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 543 కిలోమీటర్ల అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో సాధారణ ఏసీ (AC) చార్జింగ్‌తో పాటు CCS2 డీసీ (DC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

toyota urban cruiser ebella electric suv launched india price range features news

లగ్జరీ ఇంటీరియర్.. అదిరిపోయే ఫీచర్లు
కారు ఇంటీరియర్ కేబిన్‌ను చాలా ప్రీమియం లుక్‌తో డిజైన్ చేశారు. ఇందులో మనకు డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్ కనిపిస్తుంది. దీనిలో 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్న 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీని టాప్ వేరియంట్లలో వెంట్ిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ చుట్టూ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ మొబైల్ చార్జింగ్, అద్భుతమైన మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రీమియం జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే వెనుక సీట్లను అవసరాన్ని బట్టి స్లైడింగ్, రిక్లైనింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

7 ఎయిర్‌బ్యాగ్‌లు.. అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ
సేఫ్టీ విషయంలో టయోటా ఏమాత్రం రాజీ పడలేదు. ఈ 5-సీటర్ ఎస్‌యూవీలో ప్రయాణికుల రక్షణ కోసం బేస్ వేరియంట్ నుంచి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అత్యంత బలమైన బాడీ స్ట్రక్చర్‌ను అందించారు. దీని టాప్ వేరియంట్‌లో అత్యాధునిక అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, కొలిజన్ అవాయిడెన్స్ (ఢీకొనకుండా ఆపే వ్యవస్థ), పార్కింగ్ కోసం 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బయటి డిజైన్ చూస్తే.. ఎల్‌ఈడీ లైటింగ్, 18-ఇంచుల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో కారు రోడ్డుపై చాలా షార్ప్ లుక్‌తో కనిపిస్తుంది. మార్కెట్లో ఇది హుంద్యాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ, ఎమ్‌జీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Article Published On: Thursday, June 25, 2026, 12:20 [IST]
English summary
Toyota urban cruiser ebella electric suv launched india price range features news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+