ఫ్యూచరిస్టిక్ డిజైన్, 500 కి.మీ రేంజ్‌తో టయోటా తొలి ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో, టయోటా నుంచి వచ్చే ఒక కీలక అప్‌డేట్ కస్టమర్లలో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ EV కోసం ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ ఎదురుచూపులకు మరింత బలం చేకూర్చేలా టయోటా ఇండియా ఈ కారు మొదటి టీజర్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV అతి త్వరలోనే మార్కెట్లోకి రానుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు టయోటా ఇండియా హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతూ, అర్బన్ క్రూయిజర్ EVను తీసుకురావడం ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇది భారతదేశంలో టయోటా నుంచి వచ్చే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV కావడం వల్ల, ఈ లాంచ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఏర్పడింది. టీజర్ వీడియోలో చూపించిన డిజైన్ ఎలిమెంట్స్ చూస్తే, ఈ కొత్త అర్బన్ క్రూయిజర్ EV ఆధునిక స్టైలింగ్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ టచ్‌ను కలిగి ఉండబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం ప్రీమియం కస్టమర్లకే కాకుండా, సాధారణ మధ్యతరగతి కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVను జనవరి 19 లేదా 20న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ వీడియోతో అంచనాలు పెరిగిపోయిన నేపథ్యంలో, లాంచ్ డేట్ దగ్గరపడుతుండటంతో కస్టమర్లలో ఆసక్తి మరింత పెరుగుతోంది. ధరల విషయానికి వస్తే, టయోటా అర్బన్ క్రూయిజర్ EV రూ.18 లక్షల నుండి రూ.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఉండొచ్చని అంచనా వేయబడుతోంది.
ఈ ధర చూస్తే, ఇది పూర్తిగా మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూనే, ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో కూడా పోటీ ఇవ్వాలన్న టయోటా వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. అర్బన్ క్రూయిజర్ EV పనితీరు విషయంలో కూడా బలంగా ఉండబోతుంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించనుంది. వీటి వల్ల వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్లుగా వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

కంపెనీ సమాచారం ప్రకారం, ఈ EV పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు మించిన రేంజ్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే, రోజువారీ నగర వినియోగంతో పాటు లాంగ్ డ్రైవ్‌లకూ ఇది అనుకూలంగా మారనుంది. మొత్తం మీద, పవర్, రేంజ్ రెండింట్లోనూ టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఒక విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ SUVగా నిలవబోతుందనే అంచనాలు బలపడుతున్నాయి.
టీజర్‌లో కనిపించిన వివరాల ప్రకారం, కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ EV ముందు భాగం చాలా మోడ్రన్‌గా డిజైన్ చేయబడింది. ఇందులో LED DRLలతో కూడిన స్లిమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ముందు ఫెండర్‌పై ఉంచిన BEV బ్యాడ్జ్ ఈ SUV ఎలక్ట్రిక్ వాహనం అని చెప్పడమే కాకుండా, ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ ఉందో సూచించే విధంగా డిజైన్ చేశారు.

ఫీచర్ల విషయానికి వస్తే, క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, దీనికి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందిస్తున్నారు. భద్రత విషయంలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS ప్యాకేజీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి ఉంటాయి.


Click it and Unblock the Notifications








