లీటరుకు 27.97 కి.మీ మైలేజ్.. షోరూమ్‌కి వెళ్లినవాళ్లంతా ఇదే కారు కొంటున్నారు! హైబ్రిడ్ కార్లకు ఇదే భవిష్యత్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. కంపెనీకి చెందిన మోడళ్లు వరుసగా మంచి అమ్మకాలు సాధిస్తూ, మార్కెట్లో తన బలాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా నిలుస్తోంది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder). ఈ SUV దేశవ్యాప్తంగా భారీ ఆదరణను సంపాదించుకుంటూ, టయోటా లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 2026 నెల ముగియగానే బయటకు వచ్చిన అమ్మకాల గణాంకాలు ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో హైరైడర్ మొత్తం 10,206 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది ఇదే మార్చి నెలలో ఈ కారు కేవలం 5,286 యూనిట్లకే పరిమితమై ఉండగా, ఈసారి అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం నిజంగా విశేషం.

ఏడాది ప్రాతిపదికన చూస్తే, ఇది సుమారు 93 శాతం భారీ వృద్ధిని నమోదు చేసినట్లే. ఇలాంటి గ్రోత్ సాధించడం సాదారణ విషయం కాదు. మార్కెట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో కూడా ఈ స్థాయి వృద్ధి రావడం, హైరైడర్‌కు ఉన్న ప్రత్యేకతను స్పష్టం చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు ఇవి కలిసి ఈ SUVను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

Toyota Urban Cruiser Hyryder 93 Percent Sales Growth In March 2026

ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, హైబ్రిడ్ కార్లపై వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపడం కూడా ఈ మోడల్ విజయానికి కారణంగా చెప్పవచ్చు. ఈ అమ్మకాల పెరుగుదలతో, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు టయోటా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. ఇది కేవలం ఒక SUV విజయమే కాదు, భారత మార్కెట్లో హైబ్రిడ్ టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణకు కూడా ఇది నిదర్శనం.

మరో కీలక విషయం ఏమిటంటే, ఏడాది పరంగా వృద్ధి సాధించడం మాత్రమే కాకుండా నెలవారీగా కూడా ఈ ఎస్‌యూవీ మెరుగైన గణంకాలను నమోదు చేసింది. నివేదిక ప్రకారం, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫిబ్రవరి నెలలో 9,359 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఒక నెల ముగియగానే అంటే, మార్చిలో ఈ సంఖ్య 10 వేల యూనిట్లను దాటడం గమనార్హం. ఇది నెలవారీ ప్రాతిపదికన చూస్తే, 9 శాతం వృద్ధిగా నమోదు అయింది.

Toyota Urban Cruiser Hyryder 93 Percent Sales Growth In March 2026

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ డిజైన్ పరంగా చూస్తే, ఇది ఒక ప్రీమియం, స్టైలిష్ SUVగా వెంటనే ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో ఉన్న క్రిస్టల్ యాక్రిలిక్ గ్రిల్, సిగ్నేచర్ ట్విన్ LED DRLలు కారు లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈ SUVకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా డిజైన్ చేశారు. ఇంటీరియర్‌లోకి అడుగుపెడితే, ఒక ప్రీమియం ఫీల్ స్పష్టంగా కనిపిస్తుంది.

క్యాబిన్‌లో వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత కంఫర్ట్‌గా మారుస్తాయి. డ్రైవింగ్‌ను సులభంగా చేయడానికి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్ కూడా అందించడం మరో ప్లస్ పాయింట్. ధర పరంగా చూస్తే, ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిలో అందిస్తున్న టెక్నాలజీ ఈ ధరను న్యాయపరుస్తుంది.

Toyota Urban Cruiser Hyryder 93 Percent Sales Growth In March 2026

ముఖ్యంగా సెల్ఫ్-ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో కూడిన ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ ఈ కారు ప్రధాన హైలైట్. ఈ టెక్నాలజీ వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, డ్రైవింగ్ చాలా స్మూత్‌గా, నిశ్శబ్దంగా ఉంటుంది. మైలేజ్ విషయంలో కూడా ఈ SUV ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది లీటరుకు సుమారు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, ఈ స్థాయి మైలేజ్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 8, 2026, 18:38 [IST]
English summary
Toyota urban cruiser hyryder 93 percent sales growth in march 2026
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+