బంగారం రేటు పెరిగినట్టే ఈ కారుకు ఫుల్ డిమాండ్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రస్తుతం భారత SUV మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఒకటిగా మారింది. ఈ SUVకు వస్తున్న క్రేజ్‌ను చూస్తే, బంగారానికి డిమాండ్ ఎలా రోజురోజుకీ పెరుగుతుందో, అదే తరహాలో హైరైడర్‌కు కూడా వినియోగదారుల ఆసక్తి నిరంతరం పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్టైలిష్ డిజైన్, విశ్వసనీయ టయోటా బ్రాండ్ విలువ, మైలేజ్‌కు అనుకూలమైన ఇంజిన్ ఆప్షన్ల కారణంగా వినియోగదారులు ఈ కారును ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నాయి. గత నెల, అంటే డిసెంబర్ 2025లో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారీ అమ్మకాలను నమోదు చేసింది. ఆ ఒక్క నెలలోనే మొత్తం 7,022 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.

ఇది ఈ SUVకి ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి సరిపోతుంది. ఇదే కాలాన్ని గత సంవత్సరంతో పోలిస్తే, అంటే డిసెంబర్ 2024లో, హైరైడర్ అమ్మకాలు 4,770 యూనిట్ల వద్దనే నిలిచాయి. అయితే, 2025 డిసెంబర్‌లో నమోదైన సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, 47.21 శాతం వృద్ధి. ఈ స్థాయి గ్రోత్ ఏ కారుకు వచ్చినా అది మార్కెట్‌లో ఎంత బలమైన స్థానం సంపాదించిందో చెప్పే స్పష్టమైన సూచనగా చెప్పుకోవచ్చు.

Toyota Urban Cruiser Hyryder Sales Rise Like Gold Demand

డిసెంబర్ నెలలో టహైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధాన కారణంగా సెప్టెంబర్ నెలలో జరిగిన జీఎస్‌టీ సవరణను చెప్పుకోవచ్చు. ఈ సవరణల అనంతరం టయోటా కంపెనీ హైరైడర్ ధరలను తగ్గించడం వినియోగదారులపై స్పష్టమైన ప్రభావం చూపింది. ధర తగ్గడంతో పాటు విలువ పెరిగినట్లుగా భావించిన వినియోగదారులు ఈ SUV వైపు మరింత ఆకర్షితులయ్యారు.

అత్యంత ముఖ్యంగా, ఈ SUV ఇప్పుడు వినియోగదారులకు మరింత సరసమైన ధరకు అందుబాటులోకి రావడం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రస్తుతం టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధర ఎక్స్-షోరూమ్ పరంగా రూ.10.95 లక్షల నుండి రూ.19.76 లక్షల మధ్య ఉంది. ఈ ధర శ్రేణి మిడిల్ క్లాస్, అప్‌పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలను ఆకర్షించేలా ఉందని చెప్పుకోవచ్చు.

Toyota Urban Cruiser Hyryder Sales Rise Like Gold Demand

ఒక ఆసక్తికరమైన పోలిక వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1.40 లక్షల వరకు చేరుకుంది. ఈ లెక్కన 80 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.11.20 లక్షలు అవుతుంది. అంటే, అంత మొత్తం ఖర్చు చేసి బంగారం కొనుగోలు చేసే డబ్బులతో, అదే ధరకు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.

ఇది శక్తివంతమైన 3-సిలిండర్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 116 bhp పవర్, 141 Nm టార్క్‌ను అందిస్తూ మంచి మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే, 1.5-లీటర్ CNG ఇంజన్ కూడా ఉంది, ఇది 88 bhp పవర్, 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Toyota Urban Cruiser Hyryder Sales Rise Like Gold Demand

ఈ SUV 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మైలేజ్ పరంగా ఇది 19 నుంచి 28 kmpl వరకు ఇస్తుంది. గరిష్ట వేగం 180 kmph కాగా, 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 12.4 సెకన్లలో చేరుకోగలదు. మొత్తంగా చూస్తే, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ శక్తివంతమైన ఇంజన్ ఎంపికలు, ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజ్ SUVగా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2026, 16:43 [IST]
English summary
Toyota urban cruiser hyryder sales rise like gold demand
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+