28 కి.మీ మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్..మధ్యతరగతి ప్రజలు కోరుకునే కారు ఇదే

భారతదేశంలోని వెహికల్ మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీల హవా నడుస్తోంది. అయితే బడ్జెట్ పరిమితుల వల్ల చాలా మంది మధ్యతరగతి ప్రజలు మంచి కారును సెలక్ట్ చేసుకోవడంలో తటపటాయిస్తుంటారు. వారి సమస్యలన్నింటికీ పరిష్కారంగా టయోట సంస్థ అర్బన్ క్రూజర్ టైజర్‎ను రంగంలోకి దించింది.

ఈ కారు కేవలం లుక్ పరంగానే కాకుండా, ఇంజిన్ కెపాసిటీ, భద్రతా ప్రమాణాల పరంగా కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. ముఖ్యంగా టయోటా సర్వీస్, రీసేల్ వ్యాల్యూ ఈ కారును మరింత ప్రత్యేకం చేస్తాయి. ధర విషయానికి వస్తే.. టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.21 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ రూ.12.06 లక్షల వరకు ఉంది.

Toyota Urban Cruiser Taisor Best Budget SUV for Middle Class Price Mileage Features

ఇందులో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్ E MT ధర రూ.7,21,200 కాగా, మీడియం వేరియంట్లు అయిన S MT రూ.7,99,900, S+ MT రూ.8,32,800 ధరల్లో లభిస్తున్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కోరుకునే వారి కోసం AMT వేరియంట్లు రూ.8.52 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

టర్బో ఇంజిన్ కావాలనుకునే వారు G Turbo లేదా V Turbo మోడళ్లను సెలక్ట్ చేసుకోవచ్చు. వీటి ధర రూ.9.79 లక్షల నుంచి రూ.12.06 లక్షల మధ్యలో ఉంది. డ్యూయల్ టోన్ ఆప్షన్ల కోసం కొంచెం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Toyota Urban Cruiser Taisor Best Budget SUV for Middle Class Price Mileage Features

ఇంజిన్, పర్ఫామెన్స్ పరంగా టయోటా ఇందులో రెండు రకాల పెట్రోల్ ఇంజిన్లను అందిస్తోంది. మొదటిది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, ఇది 89 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది మరింత పవర్ ఫుల్ అయిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 100 hp పవర్‌ను అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, AMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లు ఉన్నాయి. ఇది సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి, హైవేలపై వేగంగా దూసుకుపోవడానికి అనువైనదిగా రూపొందించబడింది.

Toyota Urban Cruiser Taisor Best Budget SUV for Middle Class Price Mileage Features

మైలేజీ విషయంలో టైజర్ వినియోగదారులను అస్సలు నిరాశపరచదు. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు సుమారు 20 నుంచి 22.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, టర్బో వేరియంట్లు 19.86 నుంచి 21.18 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. అయితే అసలైన మ్యాజిక్ సిఎన్‌జి వేరియంట్ వద్ద కనిపిస్తుంది. ఇది కిలో గ్యాస్‌కు ఏకంగా 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ప్రస్తుత పెట్రోల్ ధరలతో విసిగిపోయిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. రియల్ వరల్డ్ కండిషన్స్ లో కూడా ఈ కారు నమ్మశక్యం కాని మైలేజీని ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Toyota Urban Cruiser Taisor Best Budget SUV for Middle Class Price Mileage Features

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 9-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీకి పెద్ద పీట వేస్తూ టయోటా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. దీనితో పాటు ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. పిల్లల భద్రత కోసం ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉండటం గమనార్హం.

మొత్తానికి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఎందుకు కొనాలి అంటే.. దాని స్టైలిష్ లుక్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మదగ్గ ఇంజిన్, అద్భుతమైన మైలేజ్ అని చెప్పొచ్చు.

మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి దిగ్గజ కార్లు ఉన్నప్పటికీ, టయోటా తనదైన ముద్ర వేయడంలో విజయవంతమైంది. తక్కువ బడ్జెట్ లో ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి టైజర్ మించిన ఆల్టర్నేటివ్ మరొకటి లేదు.

More from DriveSpark

Article Published On: Friday, January 23, 2026, 7:37 [IST]
English summary
Toyota urban cruiser taisor best budget suv for middle class price mileage features
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+