నెల రోజుల్లో 2521 మంది ఇదే కారును ఎంచుకున్నారు.. రూ.7.25 లక్షలు.. 28 కి.మీ మైలేజ్

భారతీయ SUV మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభం నుంచే ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. స్టైలిష్ డిజైన్, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఆధునిక ఫీచర్ల కలయికతో, టైజర్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు జనవరి 2026లో కూడా అదే ఊపును కొనసాగించింది. తాజా గణాంకాల ప్రకారం, ఆ నెలలో మొత్తం 2,521 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పమైనప్పటికీ గమనించదగిన వృద్ధి.

2025 జనవరిలో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ 2,470 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే నెలలో అమ్మకాలు పెరిగి 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ అమ్మకాల పెరుగుదల వెనుక ప్రధానంగా టయోటా అందిస్తున్న నాణ్యత, వినియోగదారులకు సరిపోయే ధర-ఫీచర్లు. పోటీ ఎక్కువగా ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలో కూడా టైజర్ తన స్థానం నిలబెట్టుకోవడం ఈ కారుపై ఉన్న వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Toyota Urban Cruiser Taisor January 2026 Sales Report 2 Percent Growth Details

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ పెద్ద సంఖ్యల్లో రికార్డులు సృష్టించకపోయినా, స్థిరమైన అమ్మకాలతో మార్కెట్లో తన ఉనికిని బలంగా కొనసాగిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే రాబోయే నెలల్లో కూడా ఈ SUV మరింత మెరుగైన ప్రదర్శన చూపే అవకాశాలు ఉన్నాయని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ధర రూ. 7.25 లక్షల నుంచి రూ. 12.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండటంతో, మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా మారింది.

డిజైన్ పరంగా చూస్తే, ఈ SUV తొలి చూపులోనే ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముందు భాగంలో స్టైలిష్ హెడ్‌ల్యాంప్‌లు, ఆధునిక LED DRLలు కారు లుక్‌కు ప్రీమియం టచ్‌ను ఇస్తాయి. వెనుక వైపు LED టెయిల్ ల్యాంప్‌లు, అలాగే 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ SUVకి స్పోర్టీగా, మోడ్రన్‌గా కనిపించేలా చేస్తాయి. మొత్తంగా, ధరను దృష్టిలో ఉంచుకుంటే ఈ డిజైన్ ఈ సెగ్మెంట్‌లో బాగా పోటీ పడగలిగినట్టే ఉంది.

Toyota Urban Cruiser Taisor January 2026 Sales Report 2 Percent Growth Details

పవర్‌ట్రెయిన్ విషయంలో 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 PS పవర్‌తో పాటు 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ వినియోగదారుల కోసం 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది, ఇది 77.5 PS పవర్, 98.5 Nm టార్క్‌ను అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో కూడా ఈ SUV విస్తృత అవకాశాలను అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు లభిస్తున్నాయి. దీని వల్ల నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఇది అనుకూలంగా మారింది. మైలేజ్ విషయంలో ఈ కారు నిజంగా ఆకట్టుకుంటుంది. ఇది 20.1 నుంచి 28.51 kmpl వరకు మైలేజ్ అందించడం విశేషం.

Toyota Urban Cruiser Taisor January 2026 Sales Report 2 Percent Growth Details

కొత్త టయోటా టైజర్ క్యాబిన్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 10, 2026, 18:39 [IST]
English summary
Toyota urban cruiser taisor january 2026 sales report 2 percent growth details
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+