బడ్జెట్ తక్కువ..బిల్డప్ ఎక్కువ..రూ.82,000కే అదిరిపోయే స్పోర్ట్స్ బైక్..ఇంతకంటే గొప్ప బైక్ ఇంకోటి లేదు

యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడంలో టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) బైక్ ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. 125సీసీ సెగ్మెంట్‌లో స్పోర్టీ లుక్ కావాలనుకునే వారి మొదటి ఛాయిస్ ఇదే. అయితే, అందరికీ ఖరీదైన వేరియంట్లు కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం టీవీఎస్ కంపెనీ డ్రమ్ వేరియంట్‎ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన మోడల్. తక్కువ ధరలో అద్భుతమైన డిజైన్, నమ్మకమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఒకసారి ఈ బేస్ మోడల్ ధర, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ వివరాలను తెలుసుకుందాం.

టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.82,000 గా ఉంది. ఇదే మోడల్‌లో టాప్ ఎండ్ వేరియంట్ అయిన TFT వెర్షన్ ధర రూ.97,000 వరకు ఉంటుంది. అంటే బేస్ మోడల్‌కు, టాప్ మోడల్‌కు మధ్య దాదాపు రూ.15,000 వ్యత్యాసం ఉంది. మధ్యతరగతి కుర్రాళ్లకు, తక్కువ ఈఎంఐలో స్పోర్టీ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ డ్రమ్ వేరియంట్ ఒక వరం లాంటిది. ధర తక్కువైనా, బైక్ ఇచ్చే కిక్కులో మాత్రం ఎలాంటి రాజీ ఉండదు.

TVS Raider 125 Drum Variant The Most Affordable Sporty Bike for Budget Riders

బేస్ వేరియంట్ కదా అని దీని లుక్ ఏమీ తక్కువగా ఉండదు. ఖరీదైన మోడళ్లలో ఉండే అదే షార్ప్ అండ్ అగ్రెసివ్ డిజైన్ ఇందులోనూ కనిపిస్తుంది. సిగ్నేచర్ స్టైల్ LED హెడ్ల్యాంప్స్, స్టైలిష్ DRLs ఈ బైక్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ట్యాంక్ దగ్గర ఉండే స్పోర్టీ ఎక్స్‌టెన్షన్లు, ఇంజిన్ కౌల్ దీనిని ఒక స్పోర్ట్స్ బైక్‌లా మార్చేస్తాయి. ప్రస్తుతానికి ఈ డ్రమ్ వేరియంట్‌ను స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ రంగుల్లో కంపెనీ విక్రయిస్తోంది. కుర్రాళ్లు రోడ్డు మీద వెళ్తుంటే అందరి కళ్లు ఈ బైక్ పైనే పడటం ఖాయం.

బడ్జెట్ ధరలో ఉన్నప్పటికీ, టీవీఎస్ ఇందులో అవసరమైన అన్ని డిజిటల్ ఫీచర్లను అందించింది. ఇందులో రివర్స్ LCD డిజిటల్ కన్సోల్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ (ట్యాంక్‌లోని పెట్రోల్‌కు ఇంకెంత దూరం వెళ్తుంది), యావరేజ్ మైలేజ్ వంటి వివరాలన్నీ డిస్‌ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి.

TVS Raider 125 Drum Variant The Most Affordable Sporty Bike for Budget Riders

అంతేకాకుండా, సైలెంట్ స్టార్ట్ కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీని కూడా వాడారు. స్మార్ట్ కనెక్టివిటీ, బ్లూటూత్ వంటి హై-టెక్ ఫీచర్లు ఇందులో ఉండవు కానీ, రోజువారీ అవసరాలకు కావాల్సినవన్నీ పక్కాగా ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉండటం ఒక ప్లస్ పాయింట్.

ఈ బైక్‌లో 124.8cc, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 11.38 PS పవర్, 11.2 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ సహాయంతో సిటీ ట్రాఫిక్‌లో ఈ బైక్ చాలా స్మూత్‌గా వెళ్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకోగల సత్తా దీనికి ఉంది. మైలేజ్ విషయంలో కూడా టీవీఎస్ రైడర్ నిరాశపరచదు. లీటరుకు సుమారు 60 నుంచి 65 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని యూజర్లు చెబుతున్నారు.

డ్రమ్ వేరియంట్ కావడంతో ఇందులో రెండు వైపులా 130mm డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. దీనికి సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (CBS) తోడవ్వడం వల్ల బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. దీనివల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లాంగ్ రైడ్లకు కూడా ఇది అనువుగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 17, 2026, 12:17 [IST]
English summary
Tvs raider 125 drum variant the most affordable sporty bike for budget riders
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+