ఇక గేర్లు మార్చే తిప్పలుండవు.. రైడర్లకు పండగే పండగ.. బైక్ లాంటి పవర్ ఉన్న స్కూటర్ తెస్తున్న టీవీఎస్

భారత టూవీలర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెచ్చుకున్న ప్రముఖ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం దేశంలో ప్రీమియం, మ్యాక్సీ స్కూటర్లకు (Maxi Scooters) క్రేజ్ విపరీతంగా పెరుగుతుండటంతో.. టీవీఎస్ కూడా ఈ సెగ్మెంట్‌పై కన్నేసింది.

ఇందులో భాగంగానే సరికొత్త 160సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని, రాబోయే రోజుల్లో ఇది కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత అడ్వాన్స్‌డ్ స్కూటర్‌గా నిలవనుందని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి.

TVS Working on Powerful 160cc Maxi Scooter to Take on Yamaha Aerox and Hero Xoom

ఈ సరికొత్త 160సీసీ మ్యాక్సీ స్కూటర్ కోసం టీవీఎస్ ఒక సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తోంది. దీనివల్ల రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా మారిపోనుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో సరికొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌‎ను (Liquid-Cooled Engine) వాడబోతున్నారు. టెక్నికల్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కానీ మార్కెట్లో ఉన్న రైవల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే రేంజ్‌లోనే దీని పవర్ అవుట్‌పుట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా ఎరాక్స్ 155, హీరో జూమ్ 160 స్కూటర్లు దాదాపు 14 నుంచి 15 హార్స్‌పవర్ (HP) శక్తిని జనరేట్ చేస్తాయి. టీవీఎస్ కూడా అదే లీగ్‌లో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేయనుంది.

ఈ అప్‌కమింగ్ స్కూటర్ డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై మార్కెట్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. యమహా ఎరాక్స్ లాగా ఒక అగ్రెసివ్ స్పోర్టీ లుక్‌తో వస్తుందా లేదా హీరో జూమ్ 160 లాగా అడ్వెంచర్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇండియన్ కస్టమర్లు ఈ రెండు రకాల డిజైన్లను బాగా ఇష్టపడుతున్నారు.

TVS Working on Powerful 160cc Maxi Scooter to Take on Yamaha Aerox and Hero Xoom

అయితే లీకైన సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్‌లో 14 ఇంచుల పెద్ద వీల్స్ (పెద్ద టైర్లు), రైడర్‌కు గాలి తగలకుండా అద్భుతమైన విండ్ ప్రొటెక్షన్, అలాగే లాంగ్ వీల్‌బేస్ ఉండబోతున్నాయి. దీనివల్ల రోజువారీ సిటీ ట్రాఫిక్‌లోనే కాకుండా లాంగ్ రైడ్స్ లేదా హైవే టూరింగ్‌కు కూడా ఈ స్కూటర్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్‌లో కూడా సరికొత్త కనెక్టెడ్ టెక్నాలజీని వాడనున్నారు. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఇవే కాకుండా సేఫ్టీ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఏబీఎస్ (ABS) టెక్నాలజీ , లగేజ్ పెట్టుకోవడానికి వీలుగా సీటు కింద చాలా పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందించబోతున్నారు. ఈ సరికొత్త టీవీఎస్ 160సీసీ మ్యాక్సీ స్కూటర్ మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. నివేదికల ప్రకారం ఈ ప్రీమియం స్కూటర్ 2027 చివరి నాటికి అధికారికంగా రోడ్లపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది గనుక లాంచ్ అయితే మార్కెట్లో ఇప్పటికే పాగా వేసిన యమహా ఎరాక్స్ 155 (Yamaha Aerox 155), హీరో జూమ్ 160 (Hero Xoom 160)లతో పాటు త్వరలోనే రాబోతున్న హోండా ADV160 స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుంది. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ సరికొత్త వాహనం టీవీఎస్ సంస్థకు ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Article Published On: Monday, June 8, 2026, 10:11 [IST]
English summary
Tvs working on powerful 160cc maxi scooter to take on yamaha aerox and hero xoom
Read more on: #tvs #tvs motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+