రూ.4.99 లక్షలే, 33 కిమీ మైలేజీ.. డాక్టర్లు, ఇంజనీర్లు ఎగబడి కొంటున్న కారు.. నిజంగా ఇదో అద్భుతం

భారత కార్ మార్కెట్లోకి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా, ఎన్ని ఎస్యూవీలు రాజ్యమేలుతున్నా.. సామాన్యుడికి మాత్రం ఇప్పటికీ మారుతి సుజుకి అంటేనే ఒక నమ్మకం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన మారుతి వ్యాగన్ ఆర్ (Maruti WagonR) తాజాగా మరోసారి తన సత్తా చాటుకుంది. ఏప్రిల్ 2026 నెలవారీ అమ్మకాలలో మారుతి వ్యాగన్ ఆర్ కారు తన ప్రత్యర్థులైన స్విఫ్ట్, బాలెనోలను కూడా వెనక్కి నెట్టి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తక్కువ ధర, భారీ మైలేజీతో ఈ కారు భారతీయ రోడ్లపై రారాజులా దూసుకెళ్తుంది.

ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. గడిచిన నెలలో ఈ కారును ఏకంగా 18,648 మంది కొనుగోలు చేశారు. గతేడాది ఏప్రిల్ (2025)లో ఈ సంఖ్య 13,414 యూనిట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 39 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మొత్తం కార్ల అమ్మకాల్లో మారుతి డిజైర్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో మాత్రం వ్యాగన్ ఆర్ తిరుగులేని విజేతగా నిలిచింది.

Unbeatable King Maruti WagonR Crushes Swift Baleno with 33km Mileage at Just Rs 4 99 Lakh

దశాబ్దాలుగా వ్యాగన్ ఆర్ సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణం దాని టాల్ బాయ్ డిజైన్. కారు లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఎంతో సౌకర్యంగా ఉండటం వల్ల వృద్ధులు, పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది మొదటి ప్రాధాన్యత. 2026 మోడల్ లో మారుతి సుజుకి అత్యాధునిక ఫీచర్లను జోడించింది. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ, 341 లీటర్ల భారీ బూట్ స్పేస్ దీని ప్రత్యేకతలు.

మారుతి వ్యాగన్ ఆర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.0-లీటర్ కె-సిరీస్ ఇంజిన్, కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 1.2-లీటర్ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఇస్తోంది. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుంచి 25.19 కి.మీ వరకు ఇస్తుంది. ఇక సిఎన్‌జీ (CNG) వేరియంట్ అయితే కిలోకు 33.47 కి.మీ మైలేజీని ఇచ్చి వాహనదారుల జేబుకు భారం తగ్గించడంలో నంబర్ 1 గా నిలుస్తోంది.

Unbeatable King Maruti WagonR Crushes Swift Baleno with 33km Mileage at Just Rs 4 99 Lakh

ఈ కారును మారుతి తన ఐకానిక్ హార్టెక్ (HEARTECT) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) రేటింగ్‌లో ఇది కేవలం 1-స్టార్ మాత్రమే సాధించినప్పటికీ, కంపెనీ బేసిక్ సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తోంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ కారుగా దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా మారుతి భద్రతపై మరింత దృష్టి సారిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ ఆర్‌కు మారుతి సెలెరియో, టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, రెనాల్ట్ క్విడ్ వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఉంది. అయినప్పటికీ వ్యాగన్ ఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ రూ.7.45 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

కొత్త కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఈ మే నెలలో తీపి కబురు చెప్పింది. వ్యాగన్ ఆర్ మోడల్ పై ప్రస్తుతం గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు (Cash Discount) తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిపి ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. వేసవిలో ఫ్యామిలీతో ట్రిప్పులకు వెళ్లాలనుకునే వారికి ఈ డీల్ మంచి అవకాశమని చెప్పాలి.

Article Published On: Thursday, May 7, 2026, 15:32 [IST]
English summary
Unbeatable king maruti wagonr crushes swift baleno with 33km mileage at just rs 4 99 lakh
Read more on: #maruti suzuki #wagnor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+