కార్ లవర్స్‌కు జూన్ నెల పూనకాలే.. మార్కెట్లోకి వస్తున్న 5 అదిరిపోయే సరికొత్త కార్లు ఇవే

కొత్తగా లగ్జరీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు జూన్ నెల కరెక్ట్ టైం. ఈ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఐదు సరికొత్త కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో మధ్యతరగతి వారిని ఆకట్టుకునే ఎలక్ట్రికల్ ఎస్‌యూవీల నుంచి కోటీశ్వరులు మెచ్చే ప్రీమియం లగ్జరీ కార్ల వరకు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశీ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ ఈ నెలే రాబోతోంది. దాంతో పాటు గ్లోబల్ బ్రాండ్లయిన బీవైడీ, స్కోడా, మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కూడా తమ పవర్‌ఫుల్ మోడళ్లను దించడానికి సిద్ధమయ్యాయి. అవి ఏంటంటే..

1. టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)
టాటా మోటార్స్ కంపెనీ 2026 టియాగో ఈవీని విజయవంతంగా లాంచ్ చేసిన తర్వాత, తన తదుపరి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్‌గా సియెర్రా ఈవీని జూన్ 2026లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. టాటా లైనప్‌లో ఇది హారియర్ ఈవీ కంటే కొంచెం తక్కువ సెగ్మెంట్‌లో రానుంది. కంపెనీ ఈ కారును రేర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో కస్టమర్లకు ఆఫర్ చేయబోతోంది. ఈ కారు బ్యాటరీ ప్యాక్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సింగిల్ ఛార్జ్‌పై ఇది ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రియల్ రేంజ్ ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw telugu

లుక్స్ పరంగా చూస్తే, ఈ సియెర్రా ఈవీ పాత ఐసీఈ (ICE) వెర్షన్ లాగే గంభీరంగా ఉంటుంది. అయితే లేటెస్ట్ టీజర్ల ప్రకారం దీనికి క్లోజ్డ్ గ్రిల్, సరికొత్త బంపర్ డిజైన్, ఏరోడైనమిక్ రిమ్స్ ఇస్తున్నారు. కారు లోపల లైట్ కలర్ థీమ్‌తో కూడిన ప్రీమియం క్యాబిన్ మనకు కనిపిస్తుంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బిఈ 6, మారుతి సుజుకి ఈ విటారా, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి గట్టి మోడళ్లతో పోటీ పడనుంది.

2. న్యూ బీవైడీ పీహెచ్ఈవీ (New BYD PHEV)
ప్రముఖ ఈవీ తయారీ సంస్థ బీవైడీ (BYD) ఇండియా, మన దేశంలో తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారును లాంచ్ చేయడానికి టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ కారు పేరును కంపెనీ ఇంకా సీక్రెట్‌గా ఉంచింది. గ్లోబల్ మార్కెట్లో బీవైడీ సంస్థ అట్టో 2 (Atto 2), సీల్యాన్ 6 (Sealion 6) మోడళ్లను ఈ హైబ్రిడ్ ఇంజన్‌తో అమ్ముతోంది. అంతర్జాతీయంగా అట్టో 2 మోడల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 7.8kWh లేదా 18kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇది ఏకంగా 998 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది.

upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw telugu

మరోవైపు సీల్యాన్ 6 మోడల్‌లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 18.3kWh లేదా 26.6kWh బ్యాటరీతో వస్తూ, ఏకంగా 1,092 కిలోమీటర్ల మైండ్ బ్లోయింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ అద్భుతమైన హైబ్రిడ్ కారును టయోటా సంస్థ ఈ జూన్ నెలలోనే అధికారికంగా ఇండియాలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

3. స్కోడా కొడియాక్ ఆర్‌ఎస్ (Skoda Kodiaq RS)
స్కోడా ప్రియులకు ఒక గుడ్ న్యూస్. ఆక్టేవియా ఆర్‌ఎస్ తర్వాత, ఆర్‌ఎస్(RS) బ్యాజ్‌తో వస్తున్న స్కోడా నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కొడియాక్ ఎస్‌యూవీ. ఇది భారతదేశంలో స్కోడా నుంచి వస్తున్న మొదటి ఆర్‌ఎస్ ఎస్‌యూవీ కావడం విశేషం. దీనిని కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో విదేశాల నుంచి నేరుగా ఇండియాకు దిగుమతి చేయనున్నారు. ఇంటర్నేషనల్ వెర్షన్ కొడియాక్ ఆర్‌ఎస్‌లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. ఇది మామూలు కొడియాక్ కంటే 60 హార్స్‌పవర్, 80 ఎన్ఎమ్ అదనపు టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw telugu

ఇందులో 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్ ఉంటుంది, ఇది నాలుగు చక్రాలకు (AWD) పవర్‌ను అందిస్తుంది. దీని డిజైన్‌లో స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ గ్రిల్, అగ్రెసివ్ బంపర్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, 20 ఇంచుల భారీ రిమ్స్ ఇస్తున్నారు. కారు లోపల కూడా రెడ్ స్టిచ్చింగ్‌తో కూడిన ఆల్-బ్లాక్ లగ్జరీ క్యాబిన్, స్పోర్టీ ఫ్రంట్ సీట్లు ఉండబోతున్నాయి.

4. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz S-Class Facelift)
లగ్జరీ కార్ల రారాజు మెర్సిడెస్ బెంజ్ తన ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 15, 2026న భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇండియాలో లాంచ్ కాబోతున్న ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ S 450E వేరియంట్‌లో 3.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్ ఉంటుంది. ఇది 22 kWh బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ అయి ఉంటుంది.

upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw telugu

ఇది భారతదేశంలోనే మొదటి పీహెచ్ఈవీ (PHEV) ఎస్-క్లాస్ కారు కావడం విశేషం. ఇది ఏకంగా 435 హార్స్‌పవర్, 680 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో ఇందులో ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా రానుంది.

5. బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎమ్‌60ఐ (BMW X6 M60i)
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ (BMW) తన పవర్‌ఫుల్ మోడల్ X6 M60i కోసం ఇండియాలో ప్రీ-బుకింగ్స్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు జూన్ 2026 లోనే లాంచ్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అల్ట్రా లగ్జరీ కారులో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది రోడ్డుపై ఏకంగా 523 హార్స్‌పవర్, 750 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw telugu

దీనికి ఉన్న 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AWD) కారులోని నాలుగు చక్రాలకు సమానంగా పవర్‌ను సప్లై చేస్తుంది. ఈ రాకెట్ లాంటి కారు కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని ఎలక్ట్రానికల్ మాక్సిమం స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా కంపెనీ డిజైన్ చేసింది.

Article Published On: Monday, June 1, 2026, 14:44 [IST]
English summary
Upcoming 5 new cars launching in june 2026 tata sierra ev byd phev skoda kodiaq rs mercedes bmw
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+