ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం.. మూడు శక్తివంతమైన 7-సీటర్ SUVలు త్వరలో ఎంట్రీ! పెద్ద ఫ్యామిలీలకు పండగే!

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ చాలా బలంగా ఉండటంతో పెద్ద సైజు కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకే కారులో కుటుంబ సభ్యులంతా కలిసి సౌకర్యంగా ప్రయాణించాలనే ఆలోచనతో చాలా మంది 7-సీటర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ వినియోగంతో పాటు పండుగలు, ఫ్యామిలీ ట్రిప్స్, లాంగ్ జర్నీలు వంటి సందర్భాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సౌకర్యం ఉండటం ఈ వాహనాల ప్రధాన ఆకర్షణగా మారింది. దీంతో భారత మార్కెట్లో 7-సీటర్ కార్లకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ముఖ్యంగా SUVలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, స్టైలిష్ డిజైన్‌తో పాటు 7-సీటింగ్ సౌకర్యం కలిగిన కొత్త మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ కథణంలో రానున్న రోజుల్లో లాంచ్ కాబోయే శక్తివంతమైన 7 సీటర్ కార్ల గురించి చూద్దాం.

MG Majestor: భారత మార్కెట్లో త్వరలో విడుదల కానున్న 7-సీటర్ SUVలలో MG Motor తీసుకొస్తున్న ఎంజీ మెజెస్టర్ ఒకటి. ఇప్పటికే ఈ ఫుల్ సైజ్ SUVను కంపెనీ ప్రదర్శించగా, త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న గ్లోస్టర్ స్థానంలో ఈ మోడల్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఇది అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌తో రానుంది.

Upcoming 7 Seater SUVs Launching Soon In India From Mahindra Toyota MG

ఈ SUVలో 2.0-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇది 215 హార్స్‌పవర్, 478 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో RWD, 4WD ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4WD వెర్షన్‌లో 10 ఆఫ్ రోడ్ మోడ్‌లు, ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్‌లు, 810 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యం వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయి. ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Mahindra Scorpio: మహీంద్రా త్వరలో తన ప్రముఖ SUVలు అయిన స్కార్పియె క్లాసిక్, స్కార్పియో ఎన్ మోడళ్లను అప్‌డేట్ చేయనుంది. ఈ కొత్త వెర్షన్లలో మెకానికల్ మార్పులు పెద్దగా లేకపోయినా, డిజైన్, ఫీచర్ల పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్లు ఉండనున్నాయి. ముఖ్యంగా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనిలో లెవెల్ 2 ADAS వంటి సేఫ్టీ టెక్నాలజీని కంపెనీ జోడించే అవకాశం ఉంది.

Upcoming 7 Seater SUVs Launching Soon In India From Mahindra Toyota MG

ఇప్పటికే టెస్టింగ్ సమయంలో పలుమార్లు కనిపించిన ఈ SUVలో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన LED హెడ్‌లైట్లు, కొత్త స్కిడ్ ప్లేట్‌తో కూడిన ఫ్రంట్ బంపర్, అలాగే కొత్త ఫాగ్ ల్యాంప్‌లు ఉండనున్నట్లు స్పై ఫోటోలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఇంటీరియర్‌లో కొత్త స్కార్పియో-ఎన్‌లో 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి రావచ్చని అంచనా.

Toyota Urban Cruiser Hyryder: టయోటా త్వరలో తన ప్రముఖ SUV అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు 7-సీటర్ వెర్షన్‌ను తీసుకురానుంది. పెద్ద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ SUV ఈ ఏడాది పండుగ సీజన్‌లో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన టెస్ట్ మ్యూల్స్ పలుమార్లు రోడ్లపై కనిపించడంతో కారుపై ఆసక్తి మరింత పెరిగింది.

Upcoming 7 Seater SUVs Launching Soon In India From Mahindra Toyota MG

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 103 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, మరింత శక్తివంతమైన హైబ్రిడ్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం 116 bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. కొన్ని వేరియంట్లలో ఆల్ వీల్ డ్రైవ్(AWD) సిస్టమ్ కూడా అందించనున్నట్లు సమాచారం. దీని ధర సుమారు రూ.16 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా.

Article Published On: Monday, May 25, 2026, 18:37 [IST]
English summary
Upcoming 7 seater suvs launching soon in india from mahindra toyota mg
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+