ఇండియాపై చైనీస్ SUVల దండయాత్ర.. త్వరలో డిఫెండర్ లుక్‌తో ఒకటి, కళ్లు చెదిరే రేంజ్‌తో మరో మూడు కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లు, వినూత్నమైన డిజైన్లతో కూడిన చైనీస్ ఎస్‌యూవీలు (SUVs) క్యూ కడుతున్నాయి. రొటీన్ కార్లకు భిన్నంగా, సరికొత్త టెక్నాలజీతో ప్రయాణించాలనుకునే వారి కోసం మార్కెట్లోకి నాలుగు పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group), బీవైడీ (BYD), ఎంజీ (MG) వంటి ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో వస్తున్న ఈ కార్లలో.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్(PHEV), ప్యూర్ ఎలక్ట్రిక్ (EV) మోడల్స్ ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్ లుక్‌తో వస్తున్న ఒక క్రేజీ కారుతో పాటు రాబోతున్న ఆ టాప్-4 చైనీస్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. బీవైడీ సీల్యాన్ 6 (BYD Sealion 6):
భారత ఈవీ మార్కెట్లో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించిన బీవైడీ (BYD) సంస్థ, ఇప్పుడు సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారు సీలియన్ 6ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే ఈ కారు ఇండియా రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది 1.5-లీటర్ పెట్రలో ఇంజన్‌తో పాటు 18.3kWh లేదా 26.6kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది.

upcoming chinese suvs in india byd sealion 6 jsw jetour t2 mg im6 icar v23 price features telugu

దీని ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడల్ 218hp పవర్‌ను, టర్బో-పెట్రోల్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) మోడల్ ఏకంగా 324hp నుంచి 344hp వరకు పవర్‌ను జనరేట్ చేస్తుంది. బ్యాటరీ, పెట్రోల్ రెండూ కలిపి వాడుకుంటే ఇది ఏకంగా 1,092 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 15.6-ఇంచుల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. ఈ కారు 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.30 లక్షల నుండి రూ.40 లక్షల లోపు ఉండవచ్చు.

2. జేఎస్‌డబ్ల్యూ జెటూర్ టీ2 (JSW Jetour T2):
మీకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) లాంటి భారీ బాక్సీ లుక్ ఉన్న కారు తక్కువ ధరలో కావాలా? అయితే జేఎస్‌డబ్ల్యూ, చెరి (Chery) కంపెనీల భాగస్వామ్యంలో వస్తున్న జెటూర్ టీ2 మీకోసమే. ఇది చూడటానికి హుందాగా, మిలిటరీ గ్రేడ్ లుక్‌తో రగ్గడ్‌గా కనిపిస్తుంది. ఇదొక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు. ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రలో ఇంజన్, 26.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి.

upcoming chinese suvs in india byd sealion 6 jsw jetour t2 mg im6 icar v23 price features telugu

ఇవి రెండు కలిసి 381 హార్స్‌పవర్, 610 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను అందిస్తాయి. ఫుల్ ట్యాంక్ ఇంధనం, ఫుల్ ఛార్జింగ్‌తో ఈ కారు ఏకంగా 1,200 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కేవలం బ్యాటరీ (Electric-only) సహాయంతోనే సిటీలో 139 కిమీ వరకు ప్రయాణించవచ్చు. లోపల 15.6-ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఏడాది దివాళి పండుగ (2026) నాటికి ఇది ఇండియాలో లాంచ్ కానుంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కారు ధర రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చు.

3. ఎంజీ ఐఎమ్6 (MG IM6):
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నుంచి వస్తున్న సరికొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ-కూపే కారు ఎంజీ ఐఎమ్6 (MG IM6). ఇది గ్లోబల్ మార్కెట్లో IM LS6గా పాపులర్ అయింది. దీన్ని విదేశాల నుంచి నేరుగా సిబియు (CBU) రూపంలో భారత్‌కు దిగుమతి చేయనున్నారు. ఇందులో భారీ 100 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్ 401 బిహెచ్‌పి పవర్‌తో సింగిల్ ఛార్జ్‌పై 625 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

upcoming chinese suvs in india byd sealion 6 jsw jetour t2 mg im6 icar v23 price features telugu

అదే సమయంలో దీని ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ ఏకంగా 741 బిహెచ్‌పి పవర్, 802 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తూ కేవలం కొన్ని సెకన్లలోనే బుల్లెట్‌లా దూసుకుపోతుంది. దీని రేంజ్ 505 కిమీ. ఇందులో లిడార్ (LiDAR) ఆధారిత అడ్వాన్స్‌డ్ అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రీమియం కారు ఆగస్ట్ 2026 లో లాంచ్ కానుంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

4. ఐకార్ వీ23 (iCar V23):
చెరి (Chery) సబ్ బ్రాండ్ అయిన ఐకార్ నుంచి వస్తున్న వీ23 మోడల్ చిన్న సైజ్ బాక్సీ డిజైన్‌తో మెర్సిడెస్ జె-క్లాస్ (G-Class) కారును పోలి ఉంటుంది. దీని పొడవు 4.2 మీటర్లు ఉంటుంది. దీన్ని ఛత్రపతి శంభాజీనగర్‌లోని జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌లో అసెంబల్ చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.

upcoming chinese suvs in india byd sealion 6 jsw jetour t2 mg im6 icar v23 price features telugu

59.93kWh బ్యాటరీ వెర్షన్ 136hp పవర్‌తో 401 కిమీ రేంజ్ ఇస్తుంది. అలాగే పెద్దదైన 81.76kWh బ్యాటరీ వెర్షన్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో 211hp పవర్‌ను జనరేట్ చేస్తూ సింగిల్ ఛార్జ్‌పై 510 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 15.4-ఇంచుల టచ్‌స్క్రీన్, లెవెల్-2 అడాస్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు భారత మార్కెట్లోకి 2028 ప్రారంభంలో లాంచ్ కానుంది. దీని ధర మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా రూ.20 లక్షల లోపే ఉండబోతోందని టాక్.

Article Published On: Wednesday, May 20, 2026, 15:15 [IST]
English summary
Upcoming chinese suvs in india byd sealion 6 jsw jetour t2 mg im6 icar v23 price features telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+