ఏకంగా 25 కిమీలకు పైగా మైలేజీ.. మార్కెట్‌ను షేక్ చేయనున్న టాప్ 4 కొత్త CNG కార్స్ ఇవే
మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో సామాన్యుడి చూపు సిఎన్‌జి కార్ల వైపు మళ్లుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండటంతో దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు సరికొత్త సిఎన్‌జి మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, స్కోడా, రెనాల్ట్ కంపెనీలు తమ పాపులర్ కార్లను సీఎన్జీ వెర్షన్లో లాంచ్ చేయడానికి రెడీ అయ్యాయి. మీరు కూడా కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే, మరికొద్ది రోజులు ఆగడం మంచిది. ఎందుకంటే రాబోయే ఈ నాలుగు కార్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టించబోతున్నాయి.
రెనాల్ట్ ట్రైబర్ సిఎన్‌జి:
రెనాల్ట్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన 7 సీటర్ ఎంపివి ట్రైబర్‌ను సిఎన్‌జి వెర్షన్‌లో తీసుకువస్తోంది. సాధారణంగా సిఎన్‌జి కార్లలో సిలిండర్ వల్ల బూట్ స్పేస్ తగ్గిపోతుంది, కానీ రెనాల్ట్ కొత్త డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని వాడుతోంది. దీనివల్ల ఏడుగురు కూర్చున్నా సరే, లగేజీ పెట్టుకోవడానికి కావల్సినంత స్పేస్ ఉంటుంది. ఇందులో ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సిఎన్‌జిపై కేజీకి 25 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. దీని ధర సుమారు ఎనిమిది నుంచి పది లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి:
సిఎన్‌జి కార్ల అనగానే గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. ఇప్పుడు తన పాపులర్ ఎస్‌యూవీ బ్రెజ్జాలో కూడా అత్యాధునిక మార్పులు చేస్తోంది. కొత్తగా రాబోయే బ్రెజ్జా సిఎన్‌జిలో 1.5 లీటర్ల కె15సి ఇంజిన్‌ను అమర్చబోతున్నారు. ఇది పవర్ఫుల్ పర్ఫామెన్సుతో పాటు కేజీకి సుమారు 25.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి తన సిగ్నేచర్ ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో దీనిని రూపొందిస్తోంది. దీనివల్ల కారు వేగంగా వెళ్తున్నా ఇంజిన్ సౌండ్ రాదు. సేఫ్టీ పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది. స్టైల్, మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

హ్యుందాయ్ బేయాన్ సిఎన్‌జి:
హ్యుందాయ్ కంపెనీ విదేశాల్లో బాగా సక్సెస్ అయిన బేయాన్ మోడల్‌ను భారత్‌కు తీసుకువస్తోంది. ఇది వెన్యూ, క్రెటా కార్ల మధ్య విభాగంలో ఉండబోతోంది. స్పోర్టీ లుక్, అదిరిపోయే ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల డిక్కీ స్పేస్ విషయంలో రాజీ పడక్కర్లేదు. ఐ20 కారులో ఉండే అదే 1.2 లీటర్ల ఇంజిన్‌ను ఇక్కడ కూడా వాడే అవకాశం ఉంది. ఇది కేజీకి 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని అంచనా. ప్రీమియం లుక్ కోరుకునే కుర్రకారుకు ఈ కారు బాగా నచ్చుతుంది.

స్కోడా కైలాక్ సిఎన్‌జి:
టాటా నెక్సాన్ సిఎన్‌జికి గట్టి పోటీ ఇచ్చేందుకు స్కోడా తన కొత్త కారు కైలాక్‌ను సిఎన్‌జి వేరియంట్‌లో లాంచ్ చేస్తోంది. స్కోడా అంటేనే పటిష్టమైన బాడీ, సేఫ్టీకి మారుపేరు. ఒక లీటర్ టర్బో ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు, సిఎన్‌జి సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన కారుగా నిలవనుంది. ఇది సుమారు 114 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిఎన్‌జి కారు నడుపుతున్నా సరే, పికప్ విషయంలో ఏమాత్రం లోటు ఉండదు. సుమారు 20 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ కారు ధర పది లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications