సింగిల్ ఛార్జ్‌తో 600 కిమీ.. పెట్రోల్, డీజిల్ బాధలకు గుడ్‌బై.. మార్కెట్లోకి రాబోతున్న టాప్ 5 కార్లు ఇవే
భారతదేశంలో ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది సామాన్య వాహనదారుడి ఆర్థిక బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఖర్చుల నుంచి ఎప్పటికీ తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లు (EVs) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారాయి. అందుకు తగ్గట్టుగానే రాబోయే కొన్ని నెలల్లో భారత మార్కెట్లోకి 5 సరికొత్త, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు (SUVs) ప్రవేశించబోతున్నాయి. ఇవి బడ్జెట్ ధరలో లభించడమే కాకుండా, లాంగ్ రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.
టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)
ఈ లైనప్‌లో అందరికంటే ముందుగా టాటా మోటార్స్ తన ఐకానిక్ టాటా సియెర్రా ఈవీని జూన్ 30వ తేదీనే లాంచ్ చేయడానికి సిద్ధం చేసింది. దీని లుక్ రెగ్యులర్ మోడల్‌లాగే చాలా అట్రాక్టివ్‌గా ఉంటూనే, క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్లతో రానుంది. కారు లోపల 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 627 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చు.

కియా సైరోస్ ఈవీ (Kia syros EV)
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ ఈ ఏడాది ఆగస్ట్ నెలలో తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారు నేరుగా టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. దీని డిజైన్ చాలా బోల్డ్, బాక్సీ మరియు కాస్త ఎత్తుగా ఉండబోతోంది. ఇందులో వెహికల్-టు-లోడ్ (V2L) అనే స్పెషల్ ఫీచర్ ఉంటుంది, దీని ద్వారా మీరు కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 42 kWh, 49 kWh బ్యాటరీ ఆప్షన్లతో, రూ. 15 లక్షల నుంచిరూ. 20 లక్షల ధరలో వచ్చే అవకాశం ఉంది.
ఎంజీ స్టార్‌లైట్ ఈవీ (MG Starlight EV)
ఎంజీ మోటార్ ఇండియా ఉమ్మడి, పెద్ద కుటుంబాల ప్రయాణాలను సులభతరం చేయడానికి ఒక సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. ఇది రాబోయే మహింద్రా ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారులో 56.7 kWh సామర్థ్యం గల శక్తివంతమైన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉండబోతోంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ పెద్ద ఫ్యామిలీ ఈవీ కారు ధర రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండవచ్చు.

హ్యుందాయ్ HE1i (Hyundai HE1i)
హ్యుందాయ్ సంస్థ సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఒక చిన్న, అత్యంత చౌకైన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. దీనికి HE1i అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇది మార్కెట్లో ఉన్న టాటా పంచ్ ఈవీతో తలపడనుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ, దీని లోపల రెండు పెద్ద స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఇందులో 42 kWh, 49 kWh బ్యాటరీలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 350 కిమీ రేంజ్ ఇచ్చే ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షల లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)
టాటా మోటార్స్ ఈ ఏడాది పండగ సీజన్ (ఫెస్టివ్ సీజన్) కానుకగా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన సఫారీ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేయనుంది. ఈ ప్రీమియం కారులో ఆటో పార్క్ అసిస్ట్, 540-డిగ్రీ కెమెరా, ఓటీఏ (OTA) అప్‌డేట్స్ వంటి హైటెక్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో కూడా హారియర్ ఈవీ తరహాలోనే 65 kWh, 75 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా కస్టమర్లకు లభించనుంది. ఈ విలాసవంతమైన 7-సీటర్ ఈవీ ధర రూ.26 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications