పెట్రోల్ ఖర్చు సగం తగ్గించే కార్లు.. మధ్యతరగతి వాళ్ల బడ్జెట్లో మార్కెట్లోకి రాబోతున్న 4 పవర్ ఫుల్ కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొంతకాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. కస్టమర్లు తమ బడ్జెట్‌ను కాస్త పెంచుకుని మరీ ఎస్‌యూవీ కార్ల వైపు మొగ్గు చూపుతుండటంతో, ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు నడుం బిగించాయి.

రాబోయే రోజుల్లో సరికొత్త డిజైన్లు, నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు, విప్లవాత్మక ఫ్యూయెల్ టెక్నాలజీతో కూడిన నాలుగు అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ కార్లు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, ఎంజీ మోటార్స్ సంస్థల నుంచి రాబోతున్న ఆ సరికొత్త కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

upcoming hatchback cars new baleno hyundai i20 next gen maruti wagonr flex fuel mg binguo ev details

1. నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ i20 (Next-Gen Hyundai i20)
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న హ్యుందాయ్ i20, ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ కారును ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయంగా అన్‌వీల్ చేసి, 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో విక్రయించడానికి హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త i20 కారు మరింత పొడవుగా, వెడల్పుగా ఉండటమే కాకుండా.. హైట్ కొద్దిగా తగ్గబోతోంది. దీనివల్ల కారుకు మరింత స్పోర్టీ అండ్ స్థిరమైన లుక్ రానుంది.

కారు లోపలి భాగంలో క్వాలిటీ, ఫిట్టింగ్, ఫినిషింగ్‌లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. టెక్నాలజీ పరంగా లగ్జరీ కార్ల తరహాలో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఏకంగా 12.3-ఇంచుల భారీ కర్వ్‌డ్ స్క్రీన్‌ను అమర్చనున్నారు. సేఫ్టీని మరింత పటిష్టం చేస్తూ ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను కూడా జోడించబోతున్నారు. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లు అందుబాటులో ఉంటాయి.

upcoming hatchback cars new baleno hyundai i20 next gen maruti wagonr flex fuel mg binguo ev details

2. మారుతి సుజుకి బాలెనొ ఫేస్‎లిఫ్ట్ (Maruti Suzuki Baleno Facelift)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి బాలెనొ.. మిడ్-లైఫ్ అప్‌డేట్‎కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన రోడ్ టెస్టింగ్ కూడా ప్రారంభమైంది. సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ కారు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (LED DRLs), కొత్త లోయర్ బంపర్‌ను అందించబోతున్నారు. అలాగే సైడ్ ప్రొఫైల్‌లో సరికొత్త అలాయ్ వీల్స్, వెనుక వైపు మోడ్రన్ టెయిల్ లైట్స్ రానున్నాయి.

ఈ ఫేస్‎లిఫ్ట్ మోడల్‌లో కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్ ఫీచర్‌ను మారుతి ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త సీట్ అప్హోల్‌స్టరీ, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజన్ పరంగా పాత 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజన్‌ను మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లతో కొనసాగించవచ్చు లేదా కొత్త స్విఫ్ట్‌లో వాడుతున్న 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో పరిచయం చేసే అవకాశం ఉంది.

upcoming hatchback cars new baleno hyundai i20 next gen maruti wagonr flex fuel mg binguo ev details

3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Maruti WagonR Flex Fuel)
మారుతి సుజుకి సంస్థ పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో ఒక సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. గతంలో పలు ఆటో ఎక్స్‌పోలలో ప్రదర్శించిన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను జూన్ 5వ తేదీన అధికారికంగా అన్‌వీల్ చేయడానికి కంపెనీ ముహూర్తం ఖరారు చేసింది. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా నిలవనుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇది E85 నుంచి E100 (85% నుంచి 100% ఇథనాల్ బ్లెండెడ్) ఇంధనంతో నడుస్తుంది.

ఇథనాల్ ఇంధనం వల్ల ఇంజన్‌కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మారుతి సుజుకి కారులోని ఫ్యూయల్ లైన్స్, ఇంజెక్టర్లు, ఇంజన్ కాలిబ్రేషన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. లుక్స్ పరంగా ఇది సాధారణ వ్యాగన్ ఆర్ లాగే ఉన్నప్పటికీ, మెకానికల్ పరంగా భారీ మార్పులు ఉంటాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ యొక్క మోడిఫైడ్ వెర్షన్‌ను వాడుతున్నారు. దీని ధర సాధారణ పెట్రోల్ వేరియంట్ కంటే కేవలం రూ.40,000 నుంచి రూ.50,000 మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

upcoming hatchback cars new baleno hyundai i20 next gen maruti wagonr flex fuel mg binguo ev details

4. ఎంజీ బింగ్వో ఈవీ (MG Binguo EV)
బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) ఒక అదిరిపోయే ఆప్షన్‌ను తీసుకువస్తోంది. చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఎంజీ బింగ్వో ఈవీ (MG Binguo EV)ని మార్కెట్లోకి తెస్తోంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో భారత రోడ్లపైకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఈ కారు మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం విక్రయాల్లో దూసుకుపోతున్న టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3) కార్లకు డైరెక్ట్ పోటీదారుగా మారనుంది. ఈ కారు ధరను కస్టమర్లకు అందుబాటులో ఉండేలా రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో నిర్ణయించే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరసమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

Article Published On: Friday, May 29, 2026, 7:28 [IST]
English summary
Upcoming hatchback cars new baleno hyundai i20 next gen maruti wagonr flex fuel mg binguo ev details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+