ఇక బస్సులతో పనిలేదు..ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మొత్తం ఒకే కారులో షికారు వెళ్లొచ్చు
భారతదేశంలో ఇప్పుడు పెద్ద కుటుంబాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లడానికి అనువైన కార్ల కోసం జనం ఎగబడుతున్నారు. అందుకే ఇప్పుడు కార్ల కంపెనీలన్నీ ఎమ్‌పీవీ (MPV - Multi Purpose Vehicle)ల మీద దృష్టి పెట్టాయి. వచ్చే కొన్ని నెలల్లో భారత రోడ్ల మీదకు రాబోతున్న టాప్-6 ఫ్యామిలీ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. నిస్సాన్ గ్రావిట్ (Nissan Gravite)
ఈ జాబితాలో ముందుగా రాబోతున్న కారు నిస్సాన్ గ్రావిట్. ఇది ఫిబ్రవరి 17న లాంచ్ కాబోతోంది. ఇది చూడటానికి రెనాల్ట్ ట్రైబర్ లాగే ఉంటుంది కానీ, నిస్సాన్ మార్క్ స్టైలింగ్ ఉంటుంది. దీని ధర సుమారు రూ. 6 నుండి 9 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. తక్కువ ధరలో 7 సీటర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.

2. మెర్సిడెస్ బెన్స్ వీ-క్లాస్ (Mercedes-Benz V-Class)
లగ్జరీ కోరుకునే వారి కోసం మెర్సిడెస్ బెన్స్ తన పాపులర్ వీ-క్లాస్ ఎమ్‌పీవీని మార్చి 3న మళ్లీ తీసుకువస్తోంది. ఇది టయోటా వెల్‌ఫైర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. దీని ధర రూ. 1 కోటి పైనే ఉంటుంది. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, రాజభోగం లాంటి ఇంటీరియర్స్ ఉంటాయి.
3. మారుతి కాంపాక్ట్ ఎమ్‌పీవీ (Maruti Compact MPV)
మారుతి సుజుకి ఇప్పుడు ఎర్టిగా కంటే తక్కువ ధరలో ఒక చిన్న ఎమ్‌పీవీని తయారు చేస్తోంది. ఇది జపాన్‌లో ఫేమస్ అయిన స్పేసియా (Spacia) కారు ఆధారంగా రూపొందుతోంది. దీని పొడవు 4 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇది ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతోంది, దీనివల్ల మైలేజ్ అదిరిపోతుంది. ఇది 2026 చివరలో లేదా 2027లో వస్తుంది.
4. హ్యుందాయ్ ఎమ్‌పీవీ (Hyundai Stargazer based)
హ్యుందాయ్ కంపెనీ కూడా కియా కారెన్స్‌కు పోటీగా స్టార్‌గేజర్ మోడల్‌ను జూలై 2026లో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని లుక్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లు ఉండే అవకాశం ఉంది. ధర సుమారు రూ. 10 నుండి 17 లక్షల మధ్య ఉండవచ్చు.

5. మారుతి వైఎమ్‌సి (Maruti YMC - Electric MPV)
మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని సెప్టెంబర్ 2026లో తీసుకువస్తోంది. దీనికి వైఎమ్‌సి అనే కోడ్ పేరు పెట్టారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల పైనే ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లలో 7 సీటర్ కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప మలుపు అవుతుంది.
6. సిట్రోన్ స్పేస్‌టూరర్ (Citroen SpaceTourer EV)
ఫ్రెంచ్ కంపెనీ సిట్రోన్ కూడా తన ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది, ఇది సుమారు 350 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్లో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








